ఇంతబతుకూ బతికి.. ఫస్ట్ టైం NEGETIVE TALK… తేడా కొట్టేలా..?

రాజమౌలి ఏం తీసినా హిట్టైతుందా...? లేదు లేదు ఈసారి మాత్రం ఫ్లాప్ పడితీరుతుంది.. ఈమాట ఈగ నుంచి వినపడుతోంది.

Post Published By: dialnews
Updated : 5 February 2026, 7:20 PM IST

రాజమౌలి ఏం తీసినా హిట్టైతుందా...? లేదు లేదు ఈసారి మాత్రం ఫ్లాప్ పడితీరుతుంది.. ఈమాట ఈగ నుంచి వినపడుతోంది. బాహుబలికి ఇలానే అన్నారు. త్రిబుల్ ఆర్ కి అలాంటి నెగెటీవ్ అంచనాలే వినిపించాయి. కాని అందుకు రివర్స్ లో ఇవన్నీ బ్లాక్ బస్టర్లయ్యాయి.. ఐతే ఫస్ట్ టైం వారణాసి మూవీ విషయంలో ఊహలకందని విధంగా ఓ నెగెటీవ్ టాక్ నిజంగా భయపెడుతోంది. అందుక్కారణం, అమెరికానుంచి దిక్కు మొక్కులేని రిపోర్టర్లకు వారనాసి టీం ఇంటర్వూలివ్వటమే... అదేతో సీఎన్ ఎన్, ఫాక్స్ న్యూస్ లాంటి ఛానల్స్ కో, ఎలెన్ షో లాంటి షోలో కనిపిస్తేనో ఏదో అనుకోవచ్చు.. అమెరికాలో అసలు పెద్దగా ఊరు పేరులేని ఛానల్స్ కి, రిపోర్టర్లకి ఇంటర్వూలు... వాళ్లని హైద్రబాద్ కి రప్పించడాలు.. ఇవే కాదు చాలా విషయంలో వారణాసి రాజమౌలికి ఫస్ట్ పంచ్ పడేలా చేస్తుందనే మాటలే వినిపిస్తున్నాయా? ఇండియాలో ఏదైనా చేయొచ్చు.. కాని వరల్డ్ మార్కెట్లో రాజమౌళి పప్పులు ఉడకటం కష్టమేనా?

ఒకరు ఎదుగుతుంటే, వాల్లు కిందపడితే చూడాలనే కొందరి ఏడుపు ప్రతీ రంగంలో కామన్. అలానే ఈగ టైం నుంచి రాజమౌళికి ఎప్పుడు ఫ్లాప్ పడుతుందా అని చర్చించుకోవటం కూడా చాలా చాలా కామన్. బాహుబలి టైంలో ఇక దీంతో రాజమౌళి పని ఔట్ అన్నారు. కాని అలా జరగలేదు. త్రిబుల్ ఆర్ తో ఛాప్టర్ క్లోజ్ అన్నారు. అది గ్లోబల్ గా కలిసొచ్చింది.కాని ఫస్ట్ టైం వారణాసి కొత్త ఇంటర్వూలు మాత్రం ఏదో తేడా కొడుతోందన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇంతబతుకు బతికి, ఇంటెనక సచ్చినట్టు... మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వీల్లు పిలిస్తే, లోకల్, నేషనల్ మీడియా రిపోర్టర్లు క్యూ కడతారు.. మిలియన్ల కొద్ది సబ్ స్క్రైబర్లున్న యూ ట్యూబ్ ఛాన్స్ ఇక్కడ కోకొల్లలున్నాయి.. వాళ్లు కూడా వారణాసి ఇంటర్వూ అంటే ఎగెత్తుకొని వస్తారు.

కాని కొండంత రాగం తీసి, దిక్కుమాలిన పాటపాడినట్టు... అదేదో అమెరికన్ రిపోర్టలంటూ ఓ అనామకులకి ఇంటర్వూ ఇచ్చింది వారనాసి టీం. ఒకటి స్క్రీన్ రాంట్ ప్లస్, మరొకటి కొల్లాయిడ్ ఇంటర్వూస్... విచిత్రం ఏంటంటే వీల్ల యూ ట్యూబ్ చానల్ తెరిచి చూస్తే లక్ష యాభైవేల సబ్ స్కైబర్లే ఉన్నారు. ఇక వారణాసి టీం ఇచ్చిన ఇంటర్వూల వీడియోలకే 2 లక్సల నుంచి 7 లక్షల వ్యూవ్స్ వరకొచ్చియి.. గతంలో వాళ్లు వేరే వాల్లతో చేసిన ఇంటర్వూల వీడియోలిక వందల్లోనే వ్యూస్ ఉన్నాయి.ఇలాంటి అప్ కమ్మింగ్ అమెరికన్ యూ ట్యూబ్ ఛానల్ రిపోర్టర్లకోసం కోట్లు ఖర్చు చేసి, ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు, స్టార్ హోటల్లో బస, ఇవన్నీ అవసరమా అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇంటర్వూ చేసిన ఒక రిపోర్టర్ అయితే, సెవెంటీస్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడని, సినిమాల్లోకి అలా నడుచుకుంటూ వెళ్లి హీరోగా జాయిన్ అవ్వొచ్చని కింద కామెంట్లు కూడా కనిపించాయి. అన్నీ తెలుగోళ్ల కామెంట్లే... ఎక్కడా అమెరికన్లు, హాలీవుడ్ మూవీ లవర్స్ కామెంట్స్ కనిపించలేదు.

దీని ప్రకారం, దిక్కుమొక్కు లేని అమెరికన్ అనామకుడికి ఇంటర్వూలు ఇవ్వటం తో హాలీవుడ్ లో వారనాసికి ఎలా రీచ్ పెరుగుతుంది. ఈమాత్రందానికి వారణాసి ప్రమోషన్ కోసం వందకోట్లెందుకు బురదలో పోస్తున్నారే కామెంట్స్ కూడా పెరిగాయి. గతంతో నెట్ ఫ్లిక్స్ వల్లే, త్రిబుల్ ఆర్ కి హాలీవుడ్ లో భారీ రీచ్ వచ్చింది. ఆస్కార్ రేసులో కూడా ఈ క్యాంపేన్ బానే పనిచేసింది.ఇప్పుడు అదే చేయొచ్చుకదా మరెందుకు ఇలాంటి ఇంటర్వూలు, ఇది సగటు కామెంట్ తాత్పర్యం. అమెరికన్ రిపోర్టర్స్ అంటే ఏ సీఎన్ ఎన్ లోనో, ఫాక్స్ న్యూస్ లో ప్రోగ్రామ్ అంటే ఏదో అనుకోవచ్చు.. అలా కాకుండా ఒక తెల్లతోలుండే అమెరికన్ ని పిలిచి ఇంటర్వూలు ఇవ్వటం, వాటిని మళ్లీ మన తెలుగోల్లే యూ ట్యూబ్ లో చూసి కామెంట్లు చేయటం సిల్లిగా ఉందంటున్నారు. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ అన్న కామెంట్లు కూడా పెరిగాయి.

ఇప్పటికే లోకల్ మీడియాను రాజమౌళి పక్కన పెట్టాడని, వాల్లు గుర్రుగా ఉన్నారు. ఇక నేషనల్ మీడియాను కూడా రాజమౌళి లెక్క చేయట్లేదనే కామెంట్లే పెరిగాయి. వరల్డ్ మీడియా లో వారణాసిని ప్రమోట్ చేయాలన్న ఆలోచన మంచిదే, అయినా, పాన్ ఇండియా మార్కెట్ ని,లోకల్, నేషనల్ మీడియాను దూరం పెట్టడం మొదటికే మోసం వచ్చే ఛాన్స్ఉందంటున్నారు. ఇండియాలో రాజమౌలి మ్యాజిక్కులు ఎన్నైనా చేయొచ్చు.. కాని వరల్డ్ ప్లాట్ ఫాంలో ఈ టాక్ టిక్స్ పనిచేయవనే మాటలు వినిపిస్తున్నాయి.. 30 భాషల్లో 120దేశాల్లో 100 కోట్ల మంది చూసేలా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయటం గొప్ప విషయమే.. కాని అన్ని థియేటర్స్ లో మనవాళ్లు కాకుండా, తెల్లోల్లు, ఆఫ్రికన్లు, చైనీస్, జపనీస్,యూరోపియన్స్ చూడాలంటే, రీచ్ గొప్పగా ఉండాలి.. అది సాధ్యమా? అవతార్ లాంటి మూవీతో ఈ సినిమాను కావాలని పోల్చేలా చేసే, ప్రయత్నం అవసరమా? ఇలా చేస్తే హాలీవుడ్ అటెన్షన్ వస్తుందా? కంటెంటే కింగ్.. అదే మాట్లాడాలి.. అది సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదు.. కాని ఈలోపు రాజమౌళి స్ట్రాటీజీ చూస్తుంటే, ఏమో ఈసారి ఎగిరే గుర్రం జారి పడినా పడొచ్చంనంటున్నారు.

Published : 
  • 5 February 2026, 7:20 PM IST