మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయంలో ఈమధ్య రూమర్లే నిజమౌతున్నాయి. దేవర సీక్వెల్ ఉండదని ఎప్పటి నుంచో నెగెటివ్ ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఎన్టీఆర్ సీన్ లోకి వచ్చి అదేంలేదు, దేవర సీక్వెల్ ఉంటుందన్నాడు.. కాని ఈలోపు నటసింహం బాలయ్యతో కొరటాల శివ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.. అంటే రెండవ దేవర లేనట్టేనా? అబ్బాయ్ మిస్ అయినట్టేనా? బాబాయ్ తో కొరటాల కమిట్ మెంట్ తో అదే తేలిందా? ఈ ప్రశ్నలే ఎదురౌతున్నాయి. దానికి సమాధానంగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందా అంటే, అందులో కొంతవరకు నిజం ఉంది.కాని రెండవ దేవర ఆగిపోయిందనేది మాత్రం పూర్తిగా అవాస్తవంగా తెలుస్తోంది.. అలా అయితే కొరటాల శివ తో గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ మొదలైతే, దేవర 2 పనేమైపోయినట్టు? వేర్ ఈజ్ క్లారిటీ... అదే ఇప్పుడు రాబోతోంది... ఆల్ మోస్ట్ అఫీసియల్ గానే ఈ ప్రశ్నకి కొరటాల శివ సమాధానం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
దేవర 2 పనైపోయిందా? ఇక ఉండదా? కన్ఫామ్ గా లేదని కొరటాల శివ తేల్చాడా? ఈ డౌట్లన్నీంటికి కారణం బాలయ్యతో తన సినిమా ఎనౌన్స్మెంటే... పవర్ మీట్స్ పర్పస్, మాస్ బిగమ్స్ ఏ మూవ్ మెంట్.. అంటే పవర్ కి సదుద్దేశం తోడైతే, జనాలంతా రెవెల్యూషనరీలుగా మారి ఓ పెద్ద మూవ్ మెంట్ వస్తుంది.. అంటే ఇది భరత్ అనేనేనుని మించే పొలిటికల్ డ్రామా అని అర్ధమౌతోంది.మరి మాస్ మతిపోగొట్టే ఊచకోత ఇంకెంతుంటుందో అన్న అంచనాల భారం పెరిగిపోతోంది. కాకపోతే ఒకే ఒక్క వెలితి... బాలయ్యతో కొరటాల శివ సినిమా డెఫినెట్ గా స్పెషల్ కాంబినేషనే.. కాని దేవర 2 తీశాకో, లేదంటే దేవర 2 ఉంటుందనే అస్యూరెన్స్ వచ్చాకో ఈ స్టేట్ మెంట్ వస్తే బాగుండేదనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాంక్ష... ఎందుకంటే డ్రాగన్ తర్వాత దేవర2 ఉంటుందనే ప్రచారమే జరిగింది.
బయట ఎన్ని రూమర్స్ వచ్చినా, దేవర 2 ఆగిందని, ఇప్పట్లో ఉండదని, అలాకాదు అసలుకే అటకెక్కిందని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ గాలి వార్తలని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు తేల్చారు. దేవర 2 ఉండి తీరుతుందని కూడా చాలా సార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ డ్రాగన్ రెండు భాగాలుగా కథ మారాకే, ఇక దేవర 2 ఉండదనే అభిప్రాయం పెరిగేలా రూమర్స్ వచ్చాయి.అలాంటి టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమా తీయాల్సిన కొరటాల శివ, గాడ్ ఆఫ్ మాసెస్ కి షిఫ్ట్ అవటం చూసతుంటే, ఇక దేవర సీక్వెల్ కష్టమే అనే కన్ క్లూజన్ కి జనాలు వస్తున్నారు. ఐతే అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు.. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్న ఎన్టీఆర్, ప్యార్ లల్ గా దేవర 2 చేయటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అని తెలుస్తోంది.
కాకపోతే డ్రాగన్ ఈ దసరాకల్లా పూర్తవుతుందనుకుంటే, కాదు వచ్చే సమ్మర్ వరకు రెండు భాగాల షూటింగ్ కంటిన్యూ అవ్వొచ్చని తెలుస్తోంది. అంటే వచ్చే సమ్మర్ వరకు త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ సినిమా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టే, ఈలోపు బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్లాన్ చేసుకున్నాడట. ఇది ఎడెనిమిది నెలల్లో పూర్తి చేసి, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.. ఆ క్లారిటీ ఉండబట్టే మొన్నీ మధ్య దేవర2 మీద కొరటాల శివ ట్వీట్ చేశాడు.. ఎన్టీఆర్ నుంచి అస్యూరెన్స్ వచ్చాయే బాలయ్యతో మూవీ కమిటయ్యాడని తెలుస్తోంది.