ఇంత టాక్సిక్ ఎందుకు…?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, మళయాళీ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్, ఈసారి అంతకు మించిన విజన్

Post Published By: dialnews
Updated : 30 April 2026, 1:56 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, మళయాళీ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్, ఈసారి అంతకు మించిన విజన్ తో ప్రేక్షకులను పలకరించాలని సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో వినిపిస్తున్న వార్తలు అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తున్నాయి. ప్రారంభంలో 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని నిర్మాణ కారణాల వల్ల దానిని జూన్ 4కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారుతుండటంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్వయంగా యశ్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, 'టాక్సిక్' కు వస్తున్న అంతర్జాతీయ స్పందన తమ ఆలోచనా విధానాన్ని మార్చిందని తెలిపారు. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్ గా విడుదల కావాలంటే పక్కా ప్లానింగ్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యశ్ చెప్పిన వివరాల ప్రకారం.. షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, మేకర్స్ ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ను సెట్ చేయడంలో బిజీగా ఉన్నారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమాను విడుదల చేయాలంటే అంతర్జాతీయ భాగస్వామ్యాలు చాలా ముఖ్యం. అందుకే తొందరపడి నాణ్యత విషయంలో రాజీ పడకుండా, పూర్తి ప్రిపరేషన్ తో ముందుకు వెళ్లాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ భారీ నెట్‌వర్క్ సెట్ అయ్యాక కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 'టాక్సిక్' వాయిదాకు కేవలం ప్లానింగ్ మాత్రమే కాదు, ఓటీటీ హక్కుల చర్చలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం దాదాపుగా 700 కోట్ల భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సుమారు 110 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ, నిర్మాతలు దానిని తిరస్కరించినట్లు సమాచారం. సినిమా రేంజ్ దృష్ట్యా అంతకు రెట్టింపు స్థాయిలో డీల్ ఉండాలని మేకర్స్ పట్టుబడుతున్నారు. ఈ ఒప్పందం ఇంకా ఫైనల్ కాకపోవడం కూడా రిలీజ్ డేట్ పై ప్రభావం చూపింది.యశ్ కూడా ఈ సినిమాపై అత్యంత ధీమాగా ఉన్నారు. ఇది ఇండియన్ సినిమా గర్వించదగ్గ ప్రాజెక్ట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. విడుదల వాయిదా అభిమానులకు తాత్కాలిక నిరాశ కలిగించినా, సినిమాను మరింత పెద్ద ఎత్తున ప్రపంచానికి పరిచయం చేయాలనే మేకర్స్ వ్యూహం సరైనదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి ఇంతటి అంచనాల మధ్య రాబోతున్న రాకింగ్ స్టార్ 'టాక్సిక్', బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Published : 
  • 30 April 2026, 1:56 PM IST