యుద్ధాల సామి అసలు ఓనర్ ఎవరు…?

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయాలనుకున్న సినిమా లార్డ్ ఆఫ్ వార్... లేదంటే గాడ్ ఆఫ్ వార్.. సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 8:20 PM IST

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయాలనుకున్న సినిమా లార్డ్ ఆఫ్ వార్... లేదంటే గాడ్ ఆఫ్ వార్.. సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కాని కథ లీకైందా? మరో హీరో ఇదే కథతో సినిమా తీస్తున్నాడా? అసలే ఎన్టీఆర్ టీం తో కలిసి త్రివిక్రమ్ రెడీ చేసిన ఈ సినిమా కథని, బన్నీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడన్న ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ నిమోసం చేసే ప్రయత్నం చేసి, తర్వాత లెంపలేసుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో ఇటు ఎన్టీఆర్, అల్లు అల్లు అర్జున్ మధ్యలో ఈప్రాజెక్ట్ నలుగుతుందనుకుంటే, సీన్ లోకి కొత్త హీరో వచ్చేలా ఉన్నాడు. అలాని త్రివిక్రమ్ కథని ఎత్తుకెళ్లటం కాదు.. అసలు త్రివిక్రమే కథని ఎత్తుకొచ్చాడా అన్న అనుమానం క్రియేట్ చేసేలా ఉన్నాడు... దీంతో ఇప్పుడు ఈమూవీకి హీరో ఎవని కాదు.. అసలు సుబ్రహ్మణ్య స్వామిని బేస్ చేసుకుని తీసే పాన్ ఇండియా మైథలాజికల్ డ్రామాకి ఓనర్ ఎవరనేది హాట్ టాపికైంది... అరవొల్ల అరుపులకి త్రివిక్రమ్ టీం షాక్ లో పడుతోందా? మళ్లీ తన చేతిలో మన హీరోలు మోసపోయేలా ఉన్నారా?

త్రివిక్రమ్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా గాడ్ ఆఫ్ వార్. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఈ మైతలాజికల్ డ్రామా ఉంటుందని గత నాలుగైదు నెలలుగా ప్రచారం జరుగుతోంది. కథ విషయంలో త్రివక్రమ్ స్టోరీ లైన్ కి ఎన్టీఆర్ తో పాటు, తన టీం కూడా సపోర్ట్ ఇవ్వటం, ఆ కథ మంచి షేప్ అయ్యాక, దర్శకుడు వెళ్లి బన్నీకి కథ చెప్పటంతో వివాదం జరిగిందన్నారు.తర్వాత ఎన్టీఆర్ ని వెన్నుపోటు పోడవబోనే, కథ కాపీ రైట్స్ ఎన్టీఆరే ముందుగా రాయించుకోవటంతో, త్రివిక్రమ్ ఏ యాంగిల్లో చూసినా మ్యాన్ ఆఫ్ మాసెస్ కి వెన్నుపోటు పొడవాలన్నీ పొడవలేడన్నారు. ఇదే కాదు, మరో థియరీ కూడా బయట ప్రచారంలో ఉంది. అదే బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరు ఫ్రీగా ఉంటే, ఎవరు తొందరగా ఫ్రీ అయితే వాళ్లతో త్రివిక్రమ్ సినిమా తీస్తాడనే థియరీ కూడా రీసౌండ్ చేసింది.

రియాలిటీ చూస్తే అరవ హీరో శివ కార్తికేయన్ ఆల్రెడీ లార్డ్ సుబ్రహ్మణ్య అంశగా కనిపించబోతున్నట్టు కొత్త పోస్టర తో తేలింది. లార్డ్ సుబ్రహ్మణ్య శూలాన్ని హీరో పట్టుకున్నంత మాత్రాన, ఇది అదే కథ అనుకోవటానికి లేదు. కాని ఆ పోస్టర్ వచ్చాకే, త్రివిక్రమ్ టీంలో కంగారు పెరగిందని, అందుకే ఇప్పుడు అంతా షాక్ లో ఉన్నారనే మాటే వినిపిస్తోంది. అంటే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయాలనుకుంటున్న గాడ్ ఆఫ్ వార్ కథ లీకైందా?లేదంటే ఆ స్టోరీలైన్ తోపాటు, కాన్సెప్ట్ కూడా ఇంకెక్కడో ఆల్రెడీ ఉందా? ఇక్కడే త్రివిక్రమ్ మీద కూడా డౌట్లు పెరిగేలాఉణ్నాయి. ఎందుకంటే తను గతంలో ఎన్నో సినిమాలు కాపీ చేశాడనే కామెంట్లు పేలాయి... అతడు నుంచి అగ్నాత వాసి వరకు, హాలీవుడ్ నుంచి యూరోపియన్ సినిమాల నుంచి కాపీ కొట్టాడన్నారు. వాటి మీద యూట్యూబ్ లో కుప్పలు తెప్పలుగా వీడియోలున్నాయి.

అవన్నీ పక్కన పెడితే, ఒకప్పుడు త్రివిక్రమ్ ఇంగ్లీష్ మూవీ సీడీలో రూమ్ లోకి వెల్లి, స్క్రిప్ట్ తో బయటికొస్తాడనే కామెంట్లు పేలాయి.. పవన్ మూవీ అగ్నాత వాసి కథైతే, ఫ్రెంచ్ మూవీ కాపీ అని తేలి, అప్పట్లో పరువు పోయింది కూడా... ఇలాంటి టైంలో, శివ కార్తికేయ కొత్త మూవీ పోస్టర్ చూస్తే, ఇది తమిళ నవలా రచయిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అంటున్నారు. ఆ నవలే కాపీ కొట్ట త్రివిక్రమ్ కథ ప్రిపేర్ చేశాడనే విషయం ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ టీం కి తెలిసొస్తోందా? కాపీ కథ ని కూడా ఎత్తుకెళ్లి వెన్నుపోటు పొడవాలనుకున్న త్రివిక్రమ్ అంటూ కూడా ఇదోరకం ప్రచారం మొదలైంది. ఏదేమైనా నిజంగానే అరవ రైటర్ నవలనే గాడ్ ఆఫ్ వార్ గా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తే, ఇది పాన్ ఇండియా లెవల్లో తలనొప్పౌతుంది.. లేదంటే ఇది సొంతకథై ఉండి, అది లీకవటంతో, అరవోళ్ళు ముందుగా సినిమా తీస్తే, అలా కూడా మంచి కథని ముందే కోల్పోయినట్టౌతుంది. తర్వాత కాపీ రైట్స్ పరంగా ఎంత లీగల్ బ్యాటిల్ చేసినా, ఎంతో కొంత డ్యామేజి జరిగే ఛాన్స్ ఉంది.

Published : 
  • 17 February 2026, 8:20 PM IST