అప్పుడు ఫ్లాప్ ఇప్పుడు టాప్…!

సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కొన్ని పాటలు కాలక్రమేణా క్లాసిక్స్‌గా మారిపోతుంటాయి. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రానికి వర్తిస్తుంది. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని

Post Published By: dialnews
Updated : 25 March 2026, 3:50 PM IST

సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కొన్ని పాటలు కాలక్రమేణా క్లాసిక్స్‌గా మారిపోతుంటాయి. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రానికి వర్తిస్తుంది. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దానికి ఉదాహరణగా రీసెంట్ గా అనిరుధ్ లైవ్ కన్సర్ట్స్‌లో 'అజ్ఞాతవాసి' పాటలు వస్తుంటే ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇదే అంటున్నారు.

2017లో ఈ పాటలు అంతగా క్లిక్ కాలేదని అనుకున్నాం. కానీ ఇప్పుడు అనిరుధ్ కాన్సర్ట్‌ వీడియోలు చూస్తుంటే, ఆ పాటలు ఎంతలా జనాల్లోకి వెళ్ళాయో అర్థమవుతోంది. ఇది నిజంగా ఐరనీ!" అని ఆయన పేర్కొన్నారు. సంగీతానికి భాషతో పాటు కాలంతో కూడా సంబంధం ఉండదని 'అజ్ఞాతవాసి' ఆల్బమ్ నిరూపించింది.గాలి వాలుగా పాట అనిరుధ్ మార్క్ మెలోడీకి నిదర్శనం. యువతను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తోంది.
బైటికొచ్చి చూస్తే.. ఒక కూల్ అండ్ రిలాక్సింగ్ వైబ్‌ని ఇచ్చే పాట. ఈ సాంగ్ నిత్యం రీల్స్‌లో వినిపిస్తూనే ఉంటుంది.

ఇక,ధగ ధగ మనే పాట పవన్ కళ్యాణ్ ఎనర్జీకి, అనిరుధ్ బేస్ మ్యూజిక్ తోడవడంతో ఒక రేంజ్‌లో పాపులర్ అయ్యింది. అనిరుధ్ రవిచందర్ టాలీవుడ్‌లోకి 'అజ్ఞాతవాసి'తోనే అడుగుపెట్టారు. సినిమా ఫలితం తారుమారైనా, ఆయన అందించిన ట్యూన్స్ మాత్రం పవర్‌ఫుల్‌గా నిలిచిపోయాయి. నేడు అనిరుధ్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడానికి ఇలాంటి క్వాలిటీ మ్యూజిక్ కూడా ఒక కారణం.
కొన్ని పాటలు విన్న వెంటనే నచ్చేస్తాయి, కానీ మరికొన్ని పాటలు మెల్లగా మనసులోకి చేరి ఎప్పటికీ ఉండిపోతాయి. 'అజ్ఞాతవాసి' పాటలు రెండో కోవకు చెందినవి. నాగవంశీ అన్నట్టుగా, మంచి సంగీతానికి కాలమే సరైన తీర్పు ఇస్తుంది. అప్పుడు అర్థం కాని సంగీతం, ఇప్పుడు అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

Published : 
  • 25 March 2026, 3:50 PM IST