మాస్ కా బాప్.. క్లాస్ కా బాప్.. నిజమైతే…!

ఒక్క సారి ఊహించండి మాంసం తినని సింహాన్ని... పంజా విసరని పులిని... అంటే సింహం సన్నాసం తీసుకుందా? పులి శాఖాహారిగా మారిందా? అచ్చంగా ఇలానే నటసింహం బాలయ్యతో శేఖర్ కమ్ముల మూవీ అంటూ జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది

Post Published By: dialnews
Updated : 1 May 2026, 7:50 PM IST

ఒక్క సారి ఊహించండి మాంసం తినని సింహాన్ని... పంజా విసరని పులిని... అంటే సింహం సన్నాసం తీసుకుందా? పులి శాఖాహారిగా మారిందా? అచ్చంగా ఇలానే నటసింహం బాలయ్యతో శేఖర్ కమ్ముల మూవీ అంటూ జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.. ఎక్కడ ఇది నిజంగా జరుగుతుందనే గ్యారెంటీలు లేని వార్తే.. కాని ఇదే నిజమయ్యేలా ఉందా? ఇంతలా అంతా ఎందుకు షాక్ అవ్వాలంటే, ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే అలాంటిది. ఒకరేమో గాడ్ ఆఫ్ మాసెస్.. ఇంకొకరు గాడ్ ఆఫ్ క్లాసెస్.. రెండు భిన్న ద్రువాలు... ఒకదిరి కమర్శియల్ రూటు.. ఇంకొకరిది రియలిస్టిక్ అప్రోచ్... ఎక్కడ ఈఏమాత్రం సింక్ అయ్యే అవకాశమే లేదు. కాని ఇలాంటి ఊహే నిజమైతే ఎవరికి లాభం? నిజంగా ఈ ఊహ నిజమయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది? కొరటాల శివ సినిమాకాకుండా బాలయ్య ఇంకెవరికి? ఎందుకు? అవకాశాలివ్వబోతున్నాడు?

నటసింహం బాలయ్యతో శేఖర్ కమ్ముల సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. కాని ఎక్కడా రియలిస్టిక్ అప్రోచ్ కనిపించట్లేదనే కామెంట్స్ కూడా కౌంటర్ గా వస్తున్నాయి. కాని ఈ ఇద్దరి కాంబో ఓకే అయ్యేలా ఉందనే వింత వార్తలకు బ్రేక్ పడట్లేదు. కారనం కూడా సాలిడ్ గానే ఉంది. బాలయ్య ఈమధ్య కొత్త వాళ్లకు, లేదంటే యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు.ఈ లిస్ట్ లోకి శేఖర్ కమ్ముల రాడు. తను కొత్తవాడు కాదు, యంగ్ దర్శకుడు కూడా కానే కాదు. కానీ ఈ కాంబోని సెట్ అయ్యేలా చేస్తోంది ఎవరో కాదు, బాలయ్య చిన్న కూతురు తేజస్విని. ఔను మొన్నీమధ్యే కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్ ఓకే అయ్యేందుకు తనే కారణమైంది. తన వల్లే ఈ రేర్ కాంబినేషన్ ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పైప్ లైన్ లో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ వచ్చేస్తోంది.నిజానికి బాలయ్య అంటేనే గాడ్ ఆఫ్ మాసెస్.. అలానే మాస్ రూట్లో అన్ స్టాపబుల్ అనిపించుకున్నాడు. వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్లతోదూసుకెళ్లాడు. అఖండ సీక్వెల్ కొంతవరకు నిరాశ పరిచినా, ఇప్పుడు వరుసగా రెండు మాస్ మూవీలతో బిజీ అయ్యాడు. కట్ చేస్తే, కొరటాల శివ సినిమా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఆగస్ట్ లో బాలయ్యతో శేఖర్ కమ్ముల మూవీ అని ప్రచారం పెరిగింది.

అసలు ఈ రెండు భిన్న ధ్రువాలకు ఎలా పొంతన కుదురుతుంది. ఇది ఈ కాంబినేషన్ ఓకే అన్న వార్త విన్న ఎవరికైనా వచ్చే డౌట్.. శేఖర్ కమ్ముల సినిమాలు రియాలిస్టిక్ అప్రోచ్ లో ఉంటాయి. చాలా క్లాస్ గా ఉంటాయి. రీసెంట్ గా నాగ్, ధనుష్ తో తీసిన కుబేరా కూడా ఇలానే వచ్చి కదిలించింది. ఎక్స్ ట్రీమ్ లీ కంటెంట్ డ్రివెన్ స్టోరీలే తను తీస్తాడు..కాని బాలయ్య సినిమాలకు సెంటరాఫ్ అట్రాక్షన్ అంటేనే నటసింహం... తన పాత్రతోనే సినిమా మొత్తం నెట్టుకొచ్చే మాస్ ఎమోషన్స్ తో నిండి ఉంటాయి.. అలాంటి ఈ కాంబినేషన్ సెట్ అయితే సెన్సేషనే.. ఆల్రెడీ బాలయ్యని సెటిల్డ్ రోల్స్ లో చూపించాలని కొరటాల శివ కథ సిద్దం చేసుకుంటే, ఊహించని స్తాయిలో రియలిస్టిక్ రోల్ లో బాలయ్యని చూపించే ప్రయత్నంలో ఉన్నాడు శేఖర్ కమ్ముల.ఐతే ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే, బాలయ్య మాస్ ఫాలోయింగ్ కి నచ్చేలా, తన మూవీలో ఉండే మాస్ ఎమోషన్స్ మిస్ కాకుండా శేఖర్ కమ్ముల చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం తన బలమైన రియలిస్టిక్ అప్రోచ్ , అలానే తన రైటింగ్ విలువలు దారితప్పకుండా చూసుకోవాలి... అందుకే ఇది మరో లీడర్ లాంటి మూవీకి దారి తీసే కాంబినేషన్ అంటున్నారు. ఎక్కడ పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా ఇది మారుతుందో అన్న అంచనాలు కూడా మొదలుపెట్టేశారు.

Published : 
  • 1 May 2026, 7:50 PM IST