మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ షూటింగ్ పూర్తైంది.. ఈ మాట వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవ్వాలి... ఇండస్ట్రీ కూడా షాక్ అవ్వాలి... రీసెంట్ గా జోర్డాన్ కి వెళ్లిన ఫిల్మ్ టీం అక్కడి పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసింది.. మెరుపు వేగంతో ఈ షెడ్యూల్ ని పూర్తి చేయటంతో ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఎందుకంటే, జోర్జాన్ షెడ్యూల్ తో డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ పార్ట్ 1 పూర్తైనట్టే. మరి దసరా వరకు ఈ సినిమా షూటింగ్ కొనగాగుతుందన్నారు? దానర్ధం ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం, నిజమే, దసరా వరకు షూటింగ్ కొనసాగాల్సిందే.. కాకపోతే వచ్చేనెల నుంచి సెప్టెంబర్ వరకు తెరకెక్కబోయేది డ్రాగన్ 2.. అంటే వర్కింగ్ టైటిల్ ని పక్కన పెడితే బ్రూస్లీ 2...ఇదే నిజం... రెండు భాగాలుగా తెరకెక్కుతున్న డ్రాగన్ అలియాస్ బ్రూస్లీలో ఫస్ట్ పార్ట్ ని ప్రశాంత్ నీల్ పూర్తి చేశాడని తెలుస్తోంది. కాని తెలవాల్సింది..? జోర్జాన్ షెడ్యూల్ అంత మెరుపు వేగంతో ఎందుకు? ఎలా పూర్తి చేశారు? ఈ మెరుపు వేగానికి రాజమౌళి నుంచి వచ్చిన ఫోన్ కాలే కారణమా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్ , ఏదో పూనకాలు వచ్చినట్టు, మెరుపువేగంతో జోర్డాన్ షెడ్యూల్ ని పూర్తి చేశాడు. ఐతే ఇది కేవలం బ్రేక్ మాత్రమే అన్నారు. కాని లేదు షార్ట్ టైం లో జోర్డాన్ షెడ్యూల్ పూర్తైపోయింది. అదొక్కటే కాదు డ్రాగన్ మొదటి భాగం షూటింగ్ కి ఆల్ మోస్ట్ గుమ్మడి కాయ కొట్టేసినట్టేనట.కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్. కట్ చేస్తే వచ్చే వారం, నుంచి డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ పార్ట్ 2 మొదలయ్యేలా ఉంది. ఔను, బ్యాక్ టు బ్యాక్ డ్రాగన్ మూవీ రెండు భాగాలను దసరాలోగా పూర్తి చేయాని ఫిక్స్అయ్యాడు ప్రశాంత్ నీల్.. కేజీయఫ్ ఛాప్టర్ 1 రిలీజ్ అయ్యాక, చాప్టర్ 2 షూట్ చేసినట్టుకాకుండా, సలార్ రిలీజైన తర్వాత ఇప్పుడు కొత్తగా సలార్ 2 ప్లాన్ చేసినట్టు కాదు.
డ్రాగన్ మూవీ మొదటి భాగం పూర్తి చేసి, వెంటనే సీక్వెల్ పనులు కూడా షురూ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. చాలా వేగంగా షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి. జోర్డాన్ షెడ్యూల్ తర్వాత హైద్రబాద్ షెడ్యూల్ లో పార్ట్ 2 తాలూకు ఇంటర్వెల్ సీన్ షూటింగ్ తో , రెండో భాగం మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్ నీల్. దసరా లోగా ఈ షూటింగ్ పూర్తవాలి.ఇక 2027 సమ్మర్ ఎండ్ లోగా అంటే జూన్ లోగా దేవర 2 పూర్తవాలి.. ఇది రాజమౌళి నుంచి క్లియర్ కట్ గా ఎన్టీఆర్ కి వెళ్లిన మెసేజ్.. తన నుంచి కాల్ వచ్చింది.. తర్వాతీ ప్రాజెక్ట్ ఈ ఇద్దరి కాంబినేషనే కాబట్టి, 2027 జూన్ తర్వాత ఎన్టీఆర్ కనీసం 4 ఏళ్ల డేట్స్ రాజమౌళికే ఇవ్వాల్సి ఉంటుంది.
అదే కండీషన్ మీద ఫోన్ కాల్ లోనే ప్రాజెక్ట్ కన్ఫామ్ అయిపోయిందన్నారు.కాబట్టే ప్రశాంత్ నీల్ వేగంగా డ్రాగన్ ని పూర్తి చేస్తున్నాడన్నారు. ఎంత వేగంగా పూర్తి చేయమంటేమాత్రం డ్రాగన్ మొదటి భాగంలో కీలక ఘట్టమైన ప్రి క్లైమాక్స్ సీన్ ని జోర్డాన్ లో తీయాలనుకన్నారు. అందుకే ఈమధ్యే వెల్లారు.. కట్ చేస్తే ఎన్టీఆర్ తిరిగొచ్చేశాడు. అంతేకాదు వచ్చే సోమవారం హైద్రబాద్ లో డ్రాగన్ 2 షూటింగ్ మొదలు కాబోతోందనటంటో, రాజమౌళి జస్ట్ కాల్ చేసి క్లారిటీ ఇస్తే, డ్రాగన్ షూటింగ్ సడన్ గా మెరుపు వేగంతో దూసుకెళ్లేలా లెక్కలు మారాయి... ఇవన్నీ జక్కన్న, ఎన్టీఆర్ కాంబినేషన్ ని కన్ఫామ్ చేస్తున్నాయి.