MASSలెవల్లో GOOD & బ్యాడ్ NEWS.. 40% నిజం..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్.. ఇంకొకటి షాక్ ఇచ్చే బ్యాడ్ న్యూస్... చాలా రోజులుగా డ్రాగన్ మీద జరగుతున్న ప్రచారాల్లో కొంత నిజం భయపెట్టేలా ఉంటే, ఇంకొంత నిజం, ఫ్యాన్స్ కే కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా సంతోషాన్ని

Post Published By: dialnews
Updated : 30 April 2026, 5:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్.. ఇంకొకటి షాక్ ఇచ్చే బ్యాడ్ న్యూస్... చాలా రోజులుగా డ్రాగన్ మీద జరగుతున్న ప్రచారాల్లో కొంత నిజం భయపెట్టేలా ఉంటే, ఇంకొంత నిజం, ఫ్యాన్స్ కే కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా సంతోషాన్నిచ్చేది గా మారింది. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ వేయిట్ లాస్ అయ్యాడు. ఇప్పుడు కసరత్తులు చేస్తున్నాడు. మజిల్స్ పెంచేస్తున్నాడు. ఇక్కడ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే, త్రిబుల్ ఆర్ కంటే కూడా మరింత స్ట్రాంగ్ గా, కండలతో షాక్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్.. కాకపోతే ఒక రెండు రూమర్స్ మాత్రం ఇప్పుడు నిజమైనట్టే కనిపిస్తున్నాయి.. అవే బ్యాడ్ న్యూస్ గా మారాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మజిల్స్ పెంచటంలో మామూలు బిజీ కాదు.. సిక్స్ ప్యాక్స్, టెన్ ప్యాక్స్ ఇలా యాప్స్ పెంచేసిన తను, ఇక మీదట బైసప్స్ ట్రై సప్స్ పెంచుతూ భారీ మజిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు.. ప్రతీ 3 వారాలకో సారి ఫోటో షూట్..ప్రతీ నెలకోసారి డ్రాగన్ మూవీలో ఒకే సీన్ ని కనీసం ఒకసారి షూట్ చేస్తున్నారు.. అది టోటల్ కాస్ట్ లేకుండా... కేవలం ఒక్క ఎన్టీఆర్ ని పెట్టే డమ్మీ షూట్స్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.. ఈ ప్రాసెస్ లోనే ఒక చేదులాంటి వార్త బయట పడింది. అందులో చాలా మంచి కూడా జరగబోతోందని కూడా తేలుతోంది. ఇక ముందు బ్యాడ్ న్యూస్ ఏంటో చూస్తే, చాలా రోజుగా వస్తున్నరూమర్స్ కొన్ని నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఇప్పటి వరకు జరిగిన 40శాతం షూటింగ్ పక్కన పెట్టే అవకాశం..

అలాని బయట వినిపించిన రూమర్స్ ప్రకారం, కథ బాలేకనో, ఎన్టీఆర్ ఈ సినిమా కథ విషయంలో సంత్రుప్తి చెందకనో రీషూట్ ప్లాన్ చేయలేదు. రిపేర్లకు కథ కి సంబంధం లేదు. కథ కత్తిలా ఉందని, కథనం అంతకంటే బాగా కుదిరిందని ఎన్టీఆర్ తన టీం తో ఎన్నో సార్లు చెప్పటం, అలా ఇండస్ట్రీలో డ్రాగన్ ఒక కల్ట్ మూవీగా మారబోతోందనే నమ్మకం క్రియేట్ అవటం జరిగాయి.మరెందుకు ఆల్రెడీ తీసిన 40శాతం సినిమాను రీకాల్ చేయాలనుకుంటున్నారు.. కారణం ఒకటి, ఎన్టీఆర్ లుక్.. తను టెన్ ప్యాక్స్ కోసం 14 కిలోలు వేయిట్ తగ్గటం, తాత,మనవళ్ల పాత్రల వేరియేషన్ కోసం తన లుక్ మీద ప్రయోగాలు చేయటమే వికటించిందట. 40శాతం షూటింగ్ చేశాక కాని, ఎన్టీఆర్ లుక్ కథకి కాని, పాత్రకి కాని సూటయ్యేంత ఇదిగా లేదని, ఎన్టీఆరే భావించటం.

కథాలోపాలు లేవు.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ మీద ఎన్టీఆర్ కి, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే హీరో వేసే రెండు పాత్రలు నెక్ట్స్ లెవల్లో ఉంటే, కేవలం టెన్ ప్యాక్స్ లుక్ కోసం తను బరువు తగ్గికనిపించటమే, ఎందుకో అంత ఇదిగా లేదనిపించి.. ఇప్పటి వరకు జరగిన షూటింగ్ లో తన పార్ట్ వరకు తీసేసి, దాన్ని రీషూట్ చేయాలని ఎన్టీఆరే ఆదేసించినట్టు తెలుస్తోంది. ఈ ఇన్స్ డెంట్ ని ఓ ఛాలెంజ్ గా తీసుకుని, మజిల్స్ పెంచి, ప్రతీ మూడు వారాలకో లుక్ టెస్ట్, నెలకోసారి సేమ్ సీన్ షూట్ చేసి రషెస్ చూసుకుంటున్నాడట. తను సంత్రుప్తి చెందే వరకు ఇలా మజిల్స్ పెంచి, షూట్ చేసి, ఒక లుక్ ఓకే అనుకున్నాక, అప్పుడు పాత సీన్ల షూటింగ్ తో పాటు, కొత్త షెడ్యూల్ షూటింగ్ వేగం పెరిగే ఛాన్స్ఉంది. అదే మే రెండోవారం నుంచి జరిగేలా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ తన ప్రజెంట్ లుక్ మీద సంత్రుప్తిగా ఉండటం, అది డ్రాగన్ లో తాత పాత్రకు సరిపోవటంతో, అసలు షెడ్యూల్ మొదలయ్యేలా ఉంది.

Published : 
  • 30 April 2026, 5:50 PM IST