మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజం చెప్పాలంటే టెంపర్ తర్వాత, ఫెల్యూర్ అంటే ఏంటో తెలియదు.. అంతగా డబుల్ హ్యాట్రిక్, త్రిబుల్ హ్యాట్రిక్ కిక్ తో దూసుకెళుతుంటేనే త్రిబుల్ ఆర్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో హిట్టైంది.. గ్లోబల్ గా నాటు గుర్తింపు దక్కింది. కట్ చేస్తే దేవరతో పాన్ ఇండియా లెవల్లో మరో హిట్.. సో టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లెవల్లో కూడాఎన్టీఆర్ కి హ్యాట్రిక్స్ కామన్ అవుతున్నాయనుకున్న టైంలో, వార్ 2 షాక్ ఇచ్చింది.. సో ఆ చిన్న బ్రేక్ తర్వాతే డ్రాగన్ గా డబుల్ కిక్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ టైం తీసుకుంటున్నాడు.. కొత్తలుక్ తో షాక్ ఇస్తూనే, మురుగన్ గా మారుతున్నాడు.. రెండూ తన ఫేట్ నే కాదు, పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మార్కెట్ గేట్లు తెరిచే మూవీలే... ఇందులో ఒక్కటి వర్కవుట్ అయినా మ్యాన్ ఆఫ్ మాసెస్ గాడ్ ఆఫ్ మాసెస్ గా మారినట్టేనా?
ఎన్టీఆర్ డ్రాగన్ యుగాన్ని మొదలుపెడుతున్నాడా? ఇప్పడు ఇండియాలో పాన్ వరల్డ్ యుగం మొదలౌతోందనంటున్నారు. దాన్ని రాజమౌళినే షురూ చేస్తున్నాడు.. వారణాసితోనే పాన్ వరల్డ్ గేట్లు బద్దలౌతాయనే అంచనాలున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ అయిపోయింది. ఇక మిగిలింది పాన్ వరల్డ్ ట్రెండే అన్న అభిప్రాయం మొదలైంది.ఇలాంటి టైంలో రాజమౌలికి, వారాణాసికి భిన్నంగా, ఒకటి కాదు రెండు ప్రయోగాలతో పాన్ ఆసియా మార్కెట్ మీద యుద్దం మొదలుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ప్రజెంట్ డ్రాగన్ యుగాన్ని తనే షురూ చేయబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ప్లానింగ్, ఎన్టీఆర్ కమిట్ మెంట్.. మొత్తంగా ఇండియా, చైనా, భూటాన్ ట్రాయాంగిల్ బ్యాక్ డ్రాప్ తో డ్రాగన్ రాబోతోంది.
ఒకటి కాదు రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈసినిమాతో, ఇండోనేషియా, మలేషియా, చైనా, జపాన్, కొరియాలే కాదు, వియాత్నం, థాయ్ లాండ్ అన్నీ మార్కెట్లు కొల్లగొట్టే ప్రయత్నమే చేయబోతున్నాడు ఎన్టీఆర్. దీనికి వారణాసి మూవీకి చాలా వ్యత్యాసం ఉంది. రాజమౌళిలి అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ ఆసియా అని కాకుండా, కేవలం సౌత్ ఆసియానే మేయిన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు ఎన్టీఆర్.ఇదే కాదు, త్రివిక్రమ్ మేకింగ్ లోచేయబోతున్న గాడ్ ఆఫ్ వార్ కూడా సౌత్ ఆసియా మార్కెట్టే టార్గెట్.. అంతా పాన్ వరల్డ్ టైం మొదలైందంటే, ఎందుకు ఎన్టీఆర్ పాన్ ఆసియా మార్కెట్టే చాలాంటున్నాడు.? ఇక్కడే ప్రాక్టికల్ గా పరోక్షంగా ఈ స్ట్రాటజీ తనని ముందుకు తీసుకెళ్లేలా ఉంది. పాన్ వరల్డ్ మూవీ తీయటం గొప్ప కాదు.. పాన్ వరల్డ్ లెవల్లోమార్కెట్ ని కబ్జా చేయాలి.
అందుకే కంటెంట్ ఒక్కటే దిక్కు.. అయినా కూడా కొన్నిసార్లు కంటెంట్ కూడా గొప్పగా ఉన్నా, అంత రీచ్ ఉండాలని లేదు. అదే జపాన్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, అటునుంచి నరుక్కుంటూ వస్తే మార్కెట్ తనకి తేలికవుతుంది. జపాన్, కొరియా, ఇండియోనేషియా,మలేసియా, థాయ్ లాండ్, వియత్నం, చైనా ఇలా సౌత్ ఆసియా మార్కెట్ లోకి డ్రాగన్ గా ఎన్టీఆర్ ఎంటరైతే, గాడ్ ఆఫ్ వార్ కి కూడా ఎంట్రీ ఈజీ అవుతుంది.ఇక డ్రాగన్ కూడా ఒక భాగంగా ఏం రావట్లేదు. ఇది టూ పార్ట్స్ గా వస్తున్న సినిమా కాబట్టి, ఒకటి ఎన్టీఆర్ ని సౌత్ ఆసియా మార్కెట్ కి పరిచయం, చేస్తే, రెండో ప్రాజెక్ట్ అక్కడ తన మార్కెట్ పెంచే అవకాశం ఉంది. తర్వాత గాడ్ ఆఫ్ వార్ కి కూడా గ్రాండ్ వెల్ కమ్ దక్కొచ్చు.. ఇవన్నీ జరిగితే, ఆ వేవ్ యూరప్, యూస్ వరకు విస్తరించేఛాన్స్ ఉంది. ఇదంతా ఒక్క ఏడాదిలో, ఒక్కమూవీతో జరిగేది కాదు.. కాబట్టే రెండు డ్రాగన్లు, ఒక మురుగన్ సాయంతో, పాన్ ఆసియా టూ పాన్ వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్.