180 సెకన్ల సునామీ.. 24 గంటల్లో 90 సెకన్లు పెరిగాయా..?

180 సెకన్లు గ్లింప్స్.. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే జరగలేదు. ఇక మీదట జరుగుతుందో లేదో కూడా చెప్పలేం.. ఎందుకంటే 180 సెకన్లంటే మూడు నిమిషాలు.. త్రీ మినట్స్ తో ఒక ట్రైలర్ వస్తేనే ఇంత లెంథీ ప్రోమోనా అని కూడా అనుకున్న రోజులున్నాయి.

Post Published By: dialnews
Updated : 14 May 2026, 6:55 PM IST

180 సెకన్లు గ్లింప్స్.. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే జరగలేదు. ఇక మీదట జరుగుతుందో లేదో కూడా చెప్పలేం.. ఎందుకంటే 180 సెకన్లంటే మూడు నిమిషాలు.. త్రీ మినట్స్ తో ఒక ట్రైలర్ వస్తేనే ఇంత లెంథీ ప్రోమోనా అని కూడా అనుకున్న రోజులున్నాయి. అలాంటిది డ్రాగన్ మూవీ సంబంధించి, ట్రైలర్ కాదు, టీజర్ కాదు.. కేవలం గ్లింప్స్ నే 180 సెకన్లతో డ్రాగన్ గ్లింప్సా...? ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.. నిన్నటికి నిన్న 90 సెకన్లతో గ్లింప్స్ వస్తోందన్న లీక్ షాక్ ఇచ్చింది. టీజరే నిమిషం ఉండే ఈరోజుల్లో నిమిషమున్నర గ్లింప్స్ ఏంటి అన్నారు.. కాని 24 గంటల్లో డ్రాగన్ గ్లింప్స్ డ్యూరేషనే డబులైంది. ఎంత డ్యూయెల్ రోల్ లో డబుల్ డోస్ ఇస్తున్నా? ఇలా 24 గంటల్లలో గ్లింప్స్ సైజుని డబుల్ చేస్తారా? ఎందుకలా? 3 నిమిషాల గ్లింప్స్ తో మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మతిపోవాల్సిందేనా?

జస్ట్ ఇమాజిన్ ఒక సినిమా ప్రోమో అని పావుగంట సినిమాని వదిలితే ఎలా ఉంటుంది.. నిజంగా ఇలా కొన్నిసార్లు జరిగింది. తమిళ, కన్నడ ఫిల్మ్ ఇండస్టీలో ఏకంగా 5 నిమిషాలు, 15 నిమిషాల సీన్లను వదిలి.. ఇదే ఆ సినిమా ప్రోమోలని షాక్ ఇచ్చారు.. డ్రాగన్ టీం ఇలాంటి కిక్కే ఇప్పుడు ఇచ్చేలా ఉంది. ఎందుకంటే డ్రాగన్ మూవీ గ్లింప్స్ ఏకంగా 3 నిమిషాలు ఉండబోతోందన్న వార్త వైరలైంది.3 నిమిషాలంటే 180 సెకన్లు.. ఎక్కడైనా గ్లింప్స్ మహా అయితే 30సెకన్లు, లేదంటే 45 సెకన్లు ఉంటుంది. కాదంటే 50 సెకన్లుండటం కామన్. అలాంటిది 180 సెకన్ల గ్లింప్సా..? ఇది నిజంగా ట్రెండ్ సెట్ చేసే సాహసమే. నిన్నటికి నిన్న డ్రాగన్ గ్లింప్స్ 90 సెకన్లన్నారు.. 24 గంటల్లో మరో 90 సెకన్ల డ్యూరేషన్ పెంచేశారు. కేవలం 24 గంటల్లో డ్రాగన్ గ్లింప్స్ డ్యూరేషన్ డబుల్ అయ్యింది.

ఇదెక్కడి షాకింగ్ డిసీజన్..? అసలు ట్రైలరో, టీజరో లెంథీగా ఉంటేనే షాక్ అయ్యే రోజులివి.. అలాంటిది జస్ట్ గ్లింప్స్ నే 180 సెకన్లు వదులుతున్నారంటే, ఇదే టీజర్ అనుకోవాలా? లేదంటే ఇదే ట్రైలర్ అని సరిపెట్టుకోవాలా?
ఎలాగూ ఈమూవీ 2027 జూన్ 11న రాబోతోంది. అంటే కనీసం ఏడాది పైనే రిలీజ్ కి టైం ఉంది. అందుకే ఫ్యాన్స్కి మార్కెట్ కి ఊపొచ్చేందుకు ఇలా గ్లింప్స్ నే భారీగా వదులుతున్నారా అన్న డౌట్లు పెరిగాయి.ఏదేమైనా మే 19 అర్దరాత్రి డ్రాగన్ గ్లింప్స్ రాబోతోంది. 180 సెకన్ల నిడివి అని ఎక్కడా అఫీసియల్ ఎనౌన్స్ మెంట్స్ లేవు..కాని ఫీలర్స్ మాత్రం గట్టిగా వదులుతోంది ఫిల్మ్ టీం. అందుకే ఇది నిజమే అన్న కాన్ఫాడెన్స్ ఇండస్ట్రీలో పెరిగింది. ఐతే ఇప్పుడు సమస్య ఏంటంటే, నిజంగా డ్రాగన్ ని 180 సెకన్ల గ్లింప్స్ రూపంలో వదిలితే, టీజర్, ట్రైలర్ పరిస్థితేంటి?

టీజర్ ని ఐదు నిమిషాలు, ట్రైలర్ ని పదినిమిషాల డ్యూరేషన్ తో వదులుతారా? అలా జరుగుతుందని కాదు కాని, గ్లింప్సే 3 నిమిషాలుంటే, టీజర్, ట్రైలర్ లెంథ్ కూడా ఎక్కువే ఉంటుందనే అంచనాలుంటాయి. అంచనాలు భారీగా పెరుగుతాయి... ఏదేమైనా గ్లింప్స్ కనుక 180 సెకన్లు ఉంటే , పాన్ ఇండియా మొత్తం షేక్ అవుతుంది. దసరాకు వచ్చే టీజర్ లో మార్కెట్ లో ఓక సెన్సేషన్ షాక్ వేవ్ వస్తుంది.. ఇక సంక్రాంతికి వచ్చే ట్రైలర్ తో మాస్ పూనకాలకు గేట్లు తెరుచుకుంటాయి.. ఇవన్నీ జరుగుతాయో లేదో, 7రోజుల తర్వాత వచ్చే గ్లింప్స్ తో తేలబోతోంది?

Published : 
  • 14 May 2026, 6:55 PM IST