ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు, పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి.

Post Published By: dialnews
Updated : 14 August 2026, 7:10 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు, పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక టాక్ నడుస్తూనే ఉంటుంది.అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ మరియు టీజర్ విడుదలపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ కళ్లకు ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు.

కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అసలు ఏం జరుగుతోంది? ప్రమోషన్స్ ఎందుకు వాయిదా పడ్డాయి? అనే ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి. సాధారణంగా దేశభక్తి నేపథ్యంలో లేదా పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కే చిత్రాలకు ఆగస్టు 15 అనేది ప్రమోషన్స్ ప్రారంభించడానికి సరైన సందర్భం. అందుకే 'ఫౌజీ' టీజర్ లేదా ఒక చిన్న గ్లింప్స్ ఈ రోజే విడుదలైతే బాగుంటుందని మేకర్స్ కూడా భావించారు. అభిమానులు కూడా ఓ రేంజ్‌లో హంగామా చేయడానికి సిద్ధమయ్యారు.
కానీ, అనూహ్యంగా ప్రమోషనల్ కంటెంట్ విడుదలను హోల్డ్‌లో పెట్టాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఒక కీలక నటుడి వీసా సమస్య అని పరిశ్రమ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

చిత్ర బృందం సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం లండన్ నుంచి ఒక ప్రముఖ నటుడిని ఎంపిక చేశారు. కథలో ఈ పాత్ర చాలా ప్రాధాన్యత కలిగినది. అయితే, సాంకేతిక మరియు వీసా సమస్యల కారణం వల్ల ఆ నటుడు లండన్ నుండి ఇండియాకు రావడం ఆలస్యమైంది.దీని ప్రభావం నేరుగా సినిమా షూటింగ్ షెడ్యూల్‌పై పడింది. ఆ నటుడికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం పూర్తయితే తప్ప, టీజర్ లేదా గ్లింప్స్‌ని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయడం సాధ్యపడదని చిత్ర యూనిట్ భావించింది. సదరు లండన్ నటుడికి సంబంధించిన సీన్లను కూడా టీజర్‌లో చేర్చితే ప్రమోషన్స్‌కి మరింత ఇంపాక్ట్ వస్తుందని దర్శకుడు హను రాఘవపూడి అండ్ టీమ్ భావించారు. హడావుడిగా ఏదో ఒక వీడియో వదిలి అభిమానులను సంతృప్తి పరచడం కంటే, అత్యుత్తమమైన ఔట్‌పుట్‌తో రావడం ముఖ్యమని భావించి ప్రస్తుతం గ్లింప్స్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసారు.

కేవలం ఒక చిన్న విజ్యువల్ లేదా పాట ద్వారా కాకుండా, 'ఫౌజీ' కథా ప్రపంచం ఎలాంటిదో ప్రేక్షకులకు నేరుగా చూపించాలనేది మేకర్స్ ప్లాన్. ఆ లండన్ నటుడి సన్నివేశాలతో కూడిన సంపూర్ణమైన కంటెంట్‌తో వస్తేనే ఆ 'వరల్డ్' ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవుతుందని, అందుకే అంతవరకు ఈ మెటీరియల్ మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. సీతా రామం' వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. విజువల్ పోయెట్రీ మరియు ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కించే హను, ఈసారి ప్రభాస్‌ని ఏ రీతిలో చూపిస్తారో చూడాలని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. 1940ల నాటి రజాకార్ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్ లేదా స్వాతంత్ర్య పూర్వపు ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండటంతో మరోసారి సంగీతపరంగా ఈ సినిమా మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తాత్కాలికంగా షూటింగ్ మరియు ప్రమోషన్లు వాయిదా పడినప్పటికీ, లండన్ నటుడి వీసా సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని, ఆ తర్వాత వెంటనే షూటింగ్ పూర్తి చేసి గ్రాండ్ లెవెల్‌లో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారని సమాచారం. కాబట్టి ప్రభాస్ అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు. మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో 'ఫౌజీ' ప్రపంచాన్ని మైండ్ బ్లోయింగ్ కంటెంట్‌తో మన ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

Published : 
  • 14 August 2026, 7:10 PM IST