తెలంగాణ యాసలో శివాలెత్తే నాని…!

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్‌కు ఇది మామూలు పండగ కాదు.. పూనకాలు తెప్పించే పండగ! నాని బర్త్ డే స్పెషల్‌గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరియు అనిరుధ్ రవిచందర్ కాంబోలో రాబోతున్న 'ద పారడైజ్' నుంచి ఫస్ట్ సింగిల్ '

Post Published By: dialnews
Updated : 23 February 2026, 5:50 PM IST

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్‌కు ఇది మామూలు పండగ కాదు.. పూనకాలు తెప్పించే పండగ! నాని బర్త్ డే స్పెషల్‌గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరియు అనిరుధ్ రవిచందర్ కాంబోలో రాబోతున్న 'ద పారడైజ్' నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' ప్రోమో విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో నాని రెండు జడలు వేసుకున్న ఒక డిఫరెంట్ అండ్ రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు.

ఎర్రటి డెజైనర్ జాకెట్, తీక్షణమైన చూపులతో నాని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. వందలాది మంది డ్యాన్సర్ల మధ్య నాని చేసే డ్యాన్స్ మూమెంట్స్ 'దసరా' సినిమాలోని 'ధూమ్ ధామ్' సాంగ్‌ని మించిపోయేలా ఉన్నాయి. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఈ పాటను ఒక మాస్ కార్నివాల్ లాగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.ఈ పాటకి అనిరుధ్ రవిచందర్ తనదైన శైలిలో హై వోల్టేజ్ బీట్స్ ఇచ్చారు. ఈ సాంగ్ రికార్డింగ్ అప్పుడు సౌండ్ లెవల్స్ 90 డెసిబుల్స్ దాటాయని డైరెక్టర్ స్వయంగా పోస్ట్ చేశారు.

కాసర్ల శ్యామ్ పవర్‌ఫుల్ లిరిక్స్ అందించగా.. అద్దుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్యలతో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను పాడాడు. "ఆయా షేర్.. ఆయా షేర్.." అనే కోరస్ వింటుంటేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయని అర్థమవుతోంది. ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24న నాని బర్త్ డే సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గతంలో ఈ సినిమాని మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. 'ద పారడైజ్' సినిమా 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కాబోతోంది. ఓనం, రాఖీ పండగ, కృష్ణాష్టమి వంటి వరుస సెలవులను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ డేట్‌ని లాక్ చేశారు.

Published : 
  • 23 February 2026, 5:50 PM IST