చివరి 40 నిమిషాల సినిమా.. స్వామియే శరణం అయ్యప్ప.!

'ఇరుముడి' సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతోందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.

Post Published By: dialnews
Updated : 18 August 2026, 4:54 PM IST

'ఇరుముడి' సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతోందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.సాధారణంగా మాస్, ఎనర్జిటిక్ సినిమాలకు పేరుగాంచిన రవితేజ నుంచి రాబోతున్న ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో క్లైమాక్స్ భాగాలు అత్యంత కీలకం కానున్నాయి. చివరి 40 నిమిషాల్లో వచ్చే ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనం చేస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.

తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఎమోషనల్ సీన్లలో ఇవి ఒకటిగా నిలుస్తాయని చెప్తున్నారు.
ముఖ్యంగా రవితేజ నటన ఈ చివరి సన్నివేశాల్లో సరికొత్త స్థాయిలో ఉంటుందని, థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆ ఎమోషన్ వెంటాడుతుందని అంటున్నారు. కేవలం ఒకసారి చూసి వదిలేసేలా కాకుండా, ఆ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కోసం మళ్లీ మళ్లీ సినిమా చూడాలనిపించేలా ఈ 40 నిమిషాల సీన్స్ డిజైన్ చేశారని తెలుస్తోంది.

Published : 
  • 18 August 2026, 4:54 PM IST