సింహం సిక్స్ కొడితే…!

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కొరటాల శివతో నందమూరి బాలకృష్ణ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'దేవర 1' ఘనవిజయం సాధించిన తర్వాత, అందరూ 'దేవర 2'

Post Published By: dialnews
Updated : 25 April 2026, 8:20 PM IST

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కొరటాల శివతో నందమూరి బాలకృష్ణ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'దేవర 1' ఘనవిజయం సాధించిన తర్వాత, అందరూ 'దేవర 2' ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తుంటే, అనూహ్యంగా బాలయ్య ప్రాజెక్ట్ తెరపైకి రావడం వెనుక ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తున్నాయి. కొరటాల శివ వెంటనే 'దేవర 2' మొదలుపెట్టకపోవడానికి ప్రధాన అడ్డంకి ఎన్టీఆర్ డేట్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న బాలీవుడ్ భారీ చిత్రం వార్2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మరోవైపుఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా 'గోల్డెన్ ఫేజ్'లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. కొరటాల శివ వంటి సోషల్ మెసేజ్ ఇచ్చే దర్శకుడు బాలయ్యను కలిస్తే ఆ మాస్ అప్పీల్ వేరే స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొరటాల శివ సినిమాల్లో ఒక బలమైన సామాజిక అంశం ఉంటుంది.

బాలయ్య డైలాగ్ డెలివరీకి, ఆయనకున్న ఇమేజ్‌కి ఒక పవర్ ఫుల్ మెసేజ్ తోడైతే అది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది అని సినీ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే,దేవర 2' అనేది భారీ వీఎఫ్ఎక్స్ కూడిన సినిమా. దానికి చాలా ప్రీ-ప్రొడక్షన్ అవసరం. ఈలోపు బాలయ్యతో ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ పూర్తి చేయడం కొరటాలకు సులభం. ఇకపోతే, కొరటాల శివ గతంలోనే బాలయ్య కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇది రాజకీయ మరియు సామాజిక అంశాల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని సమాచారం. రైతుల సమస్యలు లేదా సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక పవర్‌ఫుల్ లీడర్ పాత్రలో బాలయ్య కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొరటాల మార్క్ క్లాస్ మేకింగ్, బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.సినిమా రంగంలో టైమింగ్ చాలా ముఖ్యం. 'దేవర 2' కోసం ఎన్టీఆర్ అందుబాటులోకి వచ్చే వరకు ఖాళీగా ఉండటం కంటే, తనకున్న క్రేజ్‌ను ఉపయోగించుకుని మరో బిగ్ స్టార్‌తో సినిమా చేయడం కొరటాల శివ తీసుకున్న తెలివైన నిర్ణయంగా కనిపిస్తోంది. ఇది నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా లాంటిదే. ఒకవైపు ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తుంటే, మరోవైపు బాలయ్య-కొరటాల కాంబోలో రాబోయే సినిమా టాలీవుడ్‌లో కొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Published : 
  • 25 April 2026, 8:20 PM IST