JAMEBOND VS డెవిల్.. సూపర్ పూనకాలే…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు పాన్ వరల్డ్ లెవల్లో తనతోనే తనకే ఫైట్ అంటున్నారా? అలా తను ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆల్రెడీ వారణాసి మూవీ షూటింగ్ జూన్ లో పూర్తి కాబోతోందని రాజమౌళి తేల్చాడు. దీంతో ఆతర్వాత తను జేమ్స్ బాండ్ జోనర్ లో సుకుమార్ తో సినిమా చేస్తాడని ప్రచారం ఊపందుకుంది. కట్ చేస్తే సడన్ గా సీన్ లోకి సందీప్ రెడ్డి పేరొచ్చింది. డెవిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం మొదలైంది. కాని కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ తో ఆల్రెడీ ఒక మూవీ చేశాడు.. కాబట్టి ఆ టైటిల్ తో సందీప్ రెడ్డి మూవీ అనేది నిజం కాకపోవచ్చన్నారు.. కట్ చేస్తే ఆ టైటిల్ మీద రైట్స్ కోసం సందీప్ ప్రయత్నిస్తున్నాడనే మాట వినిపించగానే, సమ్ థింగ్ ఫిజీ అనంటున్నారు. అలాని సుకుమార్ ని మహేశ్ బాబు పక్కన పెట్టే పరిస్తితి ఉండదు... దీనికి తోడు సందీప్ రెడ్డి కూడా వెంటనే మహేశ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. చేతిలో స్పిరిట్ ఉంది.. తర్వాత యానిమల్ పార్కుంది... ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఓ లైన్ చెప్పాడనే ప్రచారం ఉంది... ఇంతకి ఏం జరగబోతోంది? జేమ్స్ బాండ్ వర్సెస్ డెవిల్ లో ఎవరు గెలవబోతున్నారు?

Post Published By: dialnews
Updated : 18 February 2026, 5:30 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుని జేమ్స్ బాండ్ గా చూడాలని తన ఫ్యాన్సే కాదు, తెలుగు మూవీలవర్స్ అందరికి ఉంది. హాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ స్టార్ గా తనకా కిక్ ఇచ్చే లుక్ ఉంది.. ఇక మిగిలింది, తన కలకి తగ్గ కథ... అదే సుకుమార్ దగ్గరుంది.. ఇక ఈ కాంబినేషన్ వారణాసి తర్వాత సెన్సేషనల్ కాంబోగా మారబోతోందన్నారు. కట్ చేస్తే...ఇప్పుడు సూపర్ స్టార్ మహేవ్ బాబుతో సూపర్ స్టార్ మహేశ్ బాబే పోటీ పడాల్సి వచ్చేలా ఉంది. కారణం సీన్ లోకి వచ్చిన సందీప్ రెడ్డి వంగనే.. తనే ఇప్పుడు మహేవ్ బాబుకోసం కథ రెడీ చేయటం, చెప్పటమే కాదు, దాని టైటిల్ డెవిల్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే గతంలో ఎన్టీఆర్ ని, అలానే మహేశ్ బాబుని ఇలా ఇద్దరిని కలిసి కథ వినిపించిన సందీప్ ప్రజెంట్ స్పిరిట్ ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు.

అదయ్యాక యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ మొదలౌతుంది. 2028 కల్లా ఈరెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్. అలా చూస్తే ఈ ఏడాది జూన్ తర్వాత ఫ్రీ కాబోతున్న మహేవ్ తో సందీప్ సినిమా కష్టమే.. తనే కాదు, సుకుమార్ ప్లాన్ చేస్తున్న జేమ్స్ బాండ్ జోనర్ మూవీ కూడా 2028 లోనే మొదలయ్యే ఛాన్స్ ఉంది..ఐతే ఇక్కడే అసలు సిసలు పోటీ కనిపిస్తోంది. జూన్ లో వారనాసి షూటింగ్ పూర్తైనా, 2027 మార్చ్ వరకు ఈ సినిమా ను వరల్డ్ ప్లాట్ ఫాం మీద ప్రమోట్ చేసేందుకు వందదేశాలు చక్కర్లు కొట్టబోతున్నాడు మహేశ్... మొత్తానికి 2027 జూన్ వరకు ఈ మూవీ ప్రమోషన్ తోనే తను బిజీ అవుతాడు.. సో ఆలోపు సుకుమార్ రామ్ చరణ్ మూవీ సగం అయిపోతుంది.

స్పిరిట్ పూర్తి చేసి, యానిమల్ పార్క్ ని కూడా సగంకి పైనే సందీప్ రెడ్డి పూర్తి చేసేఛాన్స్ఉంది. అదే ఇప్పుడు సమస్య.. సో ఒకేసారి సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ ఫ్రీ అయితే, మహేశ్ బాబుతో ఒకేసారి రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కే ఛాన్స్ఉంది.కాకపోతే తనతో ఏ హీరో సినిమా కమిటైనా, అదయ్యే వరకు మరో మూవీ చేయకూడదనేది సందీప్ రెడ్డి కండీషన్... తన సినిమాలో హీరో లుక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక జేమ్స్ బాండ్ లాంటి కాన్జెన్ట్ తో సుకుమార్ సినిమా తీసినా మహేశ్ మరో సినిమా చేయటం కుదరదు.. అందుకే ముందు సుకుమార్ సినిమా, ఆలోపో యానిమల్ పార్క్ పూర్తి చేసి ఎన్టీఆర్ తో సందీప్ సినిమా పట్టాలెక్కుతుందంటున్నారు.... అదే జరిగితే, బ్యాక్ టు బ్యాక్ సుకుమార్, సందీప్ రెడ్డి సినిమాలతో మహేశ్ బాబు 2030 వరకు ఫుల్ బిజీ అవ్వాల్సి వస్తుంది.

Published : 
  • 18 February 2026, 5:30 PM IST