సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు పాన్ వరల్డ్ లెవల్లో తనతోనే తనకే ఫైట్ అంటున్నారా? అలా తను ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆల్రెడీ వారణాసి మూవీ షూటింగ్ జూన్ లో పూర్తి కాబోతోందని రాజమౌళి తేల్చాడు. దీంతో ఆతర్వాత తను జేమ్స్ బాండ్ జోనర్ లో సుకుమార్ తో సినిమా చేస్తాడని ప్రచారం ఊపందుకుంది. కట్ చేస్తే సడన్ గా సీన్ లోకి సందీప్ రెడ్డి పేరొచ్చింది. డెవిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం మొదలైంది. కాని కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ తో ఆల్రెడీ ఒక మూవీ చేశాడు.. కాబట్టి ఆ టైటిల్ తో సందీప్ రెడ్డి మూవీ అనేది నిజం కాకపోవచ్చన్నారు.. కట్ చేస్తే ఆ టైటిల్ మీద రైట్స్ కోసం సందీప్ ప్రయత్నిస్తున్నాడనే మాట వినిపించగానే, సమ్ థింగ్ ఫిజీ అనంటున్నారు. అలాని సుకుమార్ ని మహేశ్ బాబు పక్కన పెట్టే పరిస్తితి ఉండదు… దీనికి తోడు సందీప్ రెడ్డి కూడా వెంటనే మహేశ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. చేతిలో స్పిరిట్ ఉంది.. తర్వాత యానిమల్ పార్కుంది… ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఓ లైన్ చెప్పాడనే ప్రచారం ఉంది… ఇంతకి ఏం జరగబోతోంది? జేమ్స్ బాండ్ వర్సెస్ డెవిల్ లో ఎవరు గెలవబోతున్నారు?
