సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో రాజమౌలి తీస్తున్న మూవీ వారణాసి. ఆల్రెడీ 80 శాతం షూటింగ్ అయిపోయింది. మరో మూడునెల్ల టాకీ పార్ట్ తో షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఇలాంటి టైంలో నాటు బాంబు పేలబోతోందన్న వార్త వైరలైంది. మరోసారి కీరవాణి నాటు బీటు రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వారణాసి తాలూకు రెండు పాటలు తూటాల్లా పేలాయి.. ఇప్పుడు మూడో పాటముగ్గురు మొనగాల్ల కోసమని తెలుస్తోంది. నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కింది. హాలీవుడ్డే కదిలి స్టెప్పేసింది. కట్ చేస్తే అలాంటి నాటు పాటకి, ఈ సారి ముగ్గురు మొనగాళ్లు చిందేయబోతున్నారు. నాటు పాటకు ఇద్దరు స్టార్స్ దుమ్ముదులిపితే, వారణాసి నాటు పాటకి, ఒక్కరే ముగ్గరై మైండ్ బ్లాంక్ చేయబోతున్నాడా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ అల్లూరి సీతారామరాజుగా కలిస చేసిన ప్రయోగం త్రిబుల్ ఆర్. అందులో ఈ ఇద్దరు నాటు నాటు పాటకి, పర్ఫెక్ట్ సింక్ లో చేసిన డాన్స్ వైరలైంది. హాలీవుడ్ నుంచి అమెరికాలో కామన్ ఆడియన్స్ వరకు థియేటర్స్ లో అంతా తీన్మార్ వేసేలా చేసింది. అంతగా నాటు నాటు పాట గ్లోబ్ ని కుదిపేసింది.ఈ ఇద్దరినీ గ్లోబల్ స్టార్స్ గా మార్చింది. కట్ చేస్తే, ఈ ఇద్దరి ప్లేస్ లో ముగ్గురు వస్తే, ఆ ముగ్గరు కూడా మరింత నాటు పాటకి డాన్స్ చేస్తే.. అదే జరగబోతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి మూవీ లో మూడో సాంగ్ లోడ్ అవుతోంది. కీరవాణి ఆల్రెడీ ఆ పాటని తూటాలా పేల్చే పనిలో ఉన్నాడు. ఆ సాంగ్ షూటింగ్ కి రాజమౌళి టీం రెడీ అయ్యింది.
బాలీవుడ్ పాపులర్ సింగర్ బాబుల్ సుప్రియో తో ఈ పాట పాడించాడని తెలుస్తోంది. ఆల్రెడీ వారణాసిలో రణకుంబా అని విలన్ సాంగ్ వచ్చింది. గ్లోబ్ ట్రాటర్ గా హీరో పాట పేలింది. కాని మాస్ మతిపోగొట్టే, స్పైసీ సాంగ్ గా మూడో పాట రాబోతోంది. ఆ పాటని నాటు నాటు స్టైల్లో పరమనాటుగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇందులో ఒక్కరు కాదు, ఏకంగా ముగ్గరు మొనగాల్లు కనిపించబోతున్నారుఅంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు, విలన్ రోల్ వేసిన మలయాళ స్టార్ ఫ్రుథ్విరాజ్ తోపాటు మరో నటుడా అంటే కానే కాదు.
పూర్తిగా ఇది సూపర్ స్టార్ మహేశ్ బాబు సోలో సాంగ్..కాకపోతే తనే ఈ పాటలో ముగ్గురిగా మారబోతున్నాడు. రుద్రుడిగా, శివుడిగా, రాముడిగా ఇలా తను వేసిన మూడు పాత్రలు, ఈ పాటలో ఉండబోతున్నాయి.. అలాని అన్ని పాత్రలు డాన్స్ వేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది.రుద్రుడిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్చీ మడత పెట్టబోతున్నాడు. గుంటూరు కారంలో ఊర మాస్ స్టెప్స్ తో ఊపేసిన ఈ క్లాస్ హీరో, వారణాసిలో ఉన్న ఏకైక మాస్ సాంగ్ కి, అంతకంటే మాస్ డాన్స్ కి రెడీ అయ్యాడు. రిహార్సిల్స్ కే ఏకంగా 10 రోజుల టైం తీసుకున్నారంటే, స్టెప్స్ ఎలా ఉండొచ్చు.. తనెంత గట్టిగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చుండొచ్చు.. అందుకే బాబుల్ సుప్రియో సాంగ్ మరో నాటు సాంగ్ లా మారుతుందనే అంచనాలున్నాయి.