మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ జూన్ లోగా ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి కాబోతోంది. సెకండ్ పార్ట్ దసరాలోగా పూర్తవుతుంది.. తర్వాత దేవర 2 తో ఎన్టీఆర్ బిజీ అవుతాడు..అంతవరకు బానే ఉంది. ఎటొచ్చి ప్రశాంత్ నీల్ పరిస్థితేంటో తేలలేదు.. అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ దేవుడిలా కనిపిస్తున్నాడు. సలార్ 2 విషయంలో గేట్లు తెరిచేలా ఉన్నాడు.. ఔను ఎప్పుడో మొదలవ్వాల్సిన సలార్ సీక్వెల్ కల్కీ, ఫౌజీ వల్ల డిలే అవుతూ వచ్చింది. సీన్ లో కి స్పిరిట్ వచ్చాక ఇంకా డిలే అయ్యింది. కట్ చేస్తే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్ తీస్తూ ఉన్నాడు.. ఇది దసరాకు అయిపోవటం ఆలస్యం, అప్పుడే సలార్ 2 ని పట్టాలెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్.. కేవలం అంటే కేవలం 6 నెలల్లోనే సలార్ సీక్వెల్, శౌర్యంగా పర్వం పూర్తి కాబోతోందా? అంత అర్జెంట్ గా లెక్కలెందుకు మారుతున్నాయి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. టైటిల్ మారొచ్చు.. కాని ప్రస్తుతానికి ఈ వర్కింగ్ టైటిల్ తోనే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్. రెండో భాగం కూడా దసరాలోగా పూర్తవుతుంది. కట్ చేస్తే ఆవెంటనే సలార్ సీక్వెల్ సెట్స్ పైకెళ్లేలా ఉంది. శౌర్యాంగ పర్వాన్ని ఇక మీదట డిలే చేసేందుకు ప్రశాంత్ నీల్ సిద్దంగా లేడట..ప్రజెంట్ ప్రభాస్ తో జరిగిన డిస్కర్షన్ లో మొహమాటం కొద్ది డేట్లిచ్చాడో? లేదంటే క్లారిటీ తో ఇచ్చాడో కాని సలార్ 2 కోసం రెబల్ స్టార్ డేట్లిచ్చేశాడట. ఒకవైపు ఫౌజీ పూర్తి చేస్తున్నాడు. ఈలోపే స్పిరిట్ మొదలై కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ జరిగాయి. కట్ చేస్తే ఈలోపే కల్కీ 2 సెట్స్ పైకెళ్లింది. ఎలా చూసినా కనీసం ఏడాదిన్నర వరకు ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కోసం డేట్లు అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి.
కాని దసరా తర్వాత అంటే ఆల్ మోస్ట్ అక్టోబర్ లో సలార్ 2 మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్క్రిప్ట్ వర్క్ మొదటి భాగం తీసేప్పుడే రెడీ అయ్యింది. ఇక రెండో భాగం కథ సిద్దం కాబట్టి, షూటింగ్ మొదలు పెడితే దూసుకెళ్లటమే.. కాకపోతే ప్రభాస్ తో అంత అర్జెంట్ గా ప్రశాంత్ నీల్ ఎందుకు సలార్ 2ని మొదలు పెట్టబోతున్నాడు.ఒకవైపు డ్రాగన్ షూటింగ్ దసరా వరకు జరగబోతోంది. అది కూడారెండు భాగాలు.. అందులోనూ జనవరి లో డ్రాగన్ మొదటి భాగం సంక్రాంతి స్పెషల్ గా రాబోతోందంటే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులుంటాయి. ప్రమోషన్ కోసం పాన్ ఆసియా అంతా చుట్టేయాలి... తర్వాత డ్రాగన్ సీక్వెల్ కూడా పోస్ట్ ప్రొడక్షణ్ వర్క్ పూర్తి చేయాలి.. అలాంటప్పడు ప్రశాంత్ నీల్ కి మరో మూవీ చేసేంత తీరిక ఉండదు.
ఐనా కూడా దసరా లోపు డ్రాగన్ ని , ఆవెంటనే సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వాన్ని మొదలు పెట్టబోతున్నాడు. కేవలం నెలరోజులు షూట్ చేసి, ఒక టీజర్ వదిలి, ప్రభాస్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టమానిపించుకుంటాడట ప్రశాంత్ నీల్.. తర్వాత డ్రాగన్ రెండు భాగాల పోస్ట్ ప్రొడక్షన పనులుచూసుకుంటూ, మధ్యమధ్యలో సలార్ సీక్వెల్ షూటింగ్ ప్లాన్ చేస్తాడట. అలా చేయకపోతే, సలార్ 2 అనేదే మళ్లీ మొదలయ్యే అవకాశాలుండేలా లేవు.ఎందుకంటే తన డేట్లన్నీ చాలా మంది దర్శక నిర్మాతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అందుకే సలార్ సీక్వెల్ ని సజీవంగా ఉంచాలంటే, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలి.