వారణాసి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడంటే, ప్రభాస్ తో లేదంటే ఎన్టీఆర్ తో అన్నారు. కాని మధ్యలోకి అల్లు అరవింద్ వచ్చి, తన కొడుకుతో సినిమా తీయాల్సిందే అని పట్టుపట్టినట్టు ప్రచారం చేశారు. ఫైనల్ గా మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కే రాజమౌళి నుంచి కాల్ వెల్లిందని తెలుస్తోంది. అంతా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్స్ తోనే , జక్కన్నతో ఎన్టీఆర్ మూవీని ఇండస్ట్రీ జనం ఆల్ మోస్ట్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో మరో సాలిడ్ న్యూస్ ఏంటంటే డ్రాగన్ మూవీ చాప్టర్ క్లోజ్ అయ్యింది. నిజంగా ఇది నిజం... జోర్డాన్ లో ఒక యాక్షన్ పార్ట్ పూర్తైందనేది అసలు వార్త.. కాని ఇక్కడ తేలాల్సింది, డ్రాగన్ మూవీ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టే టైం వచ్చిందని... దసరా వరకు షూటింగ్ కంటిన్యూ అన్నారు. కాని ఈలోపే ఛాప్టర్ క్లోజ్ చేయటానికి రీజన్ రాజమౌళి నుంచి వచ్చిన కాలేనా? ఒక రకంగా అది కూడా ఒక కారణం కావొచ్చు.. కాని ప్రశాంత్ నీల్ డ్రాగన్ ని రెండు బాగాలుగా ప్లాన్ చేసి, అందులో మొదటి భాగాన్ని పూర్తి చేసేస్తున్నాడు.. ఆల్ మోస్ట్ పూర్తి చేశాడు.. ఈనెలాఖర్లోగా డ్రాగన్ మొదటి భాగం పూర్తవుతుందా? దీనికి రాజమౌలితో ఎన్టీఆర్ సినిమాకి ఉన్న లింకేంటి?
రాజమౌళి వారణాసి ని జూన్ లోగా పూర్తి చేసి, తర్వాత పూర్తిగా వరల్డ్ టూర్ కే పరిమితమవ్వబోతున్నాడు. బాహుబలి రిలీజ్ టైంలో నార్త్ ఇండియా మార్కెట్ కి గేట్లు తెరిచేందుకు ఎంత కష్టపడ్డాడో, అంతకు వంద రెట్లు వరల్డ్ మార్కెట్ లో మన సినిమాకు గేట్లు తెరిపించే పనిలో బిజీ అవుతాడు.. అంతవరకుఓకే కాని, ఆతర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమాచేస్తాడనేదే, 1000 కోట్ల డౌటు..ప్రబాస్, ఎన్టీఆర్, బన్నీ ఇలా తన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరిని పిలిచినా వాళ్లు వచ్చి వాలటం చాలా చిన్న విషయం.. కాకపోతే రాజమౌళి ఎవరితో మూవీ ప్లాన్ చేస్తున్నాడనేదే ఇక్కడ అసలు ప్రశ్న... ఆ ప్రశ్నకే ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఆల్రెడీ రాజమౌళి నుంచి కాల్ వెల్లటం, ఎన్టీఆర్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించటం పెరిగిపోయాయి.ఆల్రెడీ డ్రాగన్ మూవీ చాప్టర్ క్లోజ్ చేసే పనిలో ఉంది ప్రశాంత్ నీల్ టీం. ఔను రెండు భాగాలుగా ప్లాన్ చేసిన డ్రాగన్ లో మొదటి ఛాప్టర్ ఏప్రిల్ లోగా పూర్తవ్వొచ్చు.. ఇంకా వివరంగాచెప్పాలంటే, ఈనెల్లోనే డ్రాగన్ తాలూకు 95 శాతం షూటింగ్ పూర్తువుతంది.
జోర్డన్ లో ప్లాన్ చేసింది డ్రాగన్ ప్రీ క్లైమాక్స్ సీన్ అని తెలుస్తోంది. మొదటి ఛాప్టర్ ని ఏప్రిల్ లో పూర్తి చేసి, మళ్లీ మే రెండో వారం నుంచి రెండో చాప్టర్ మొదలు పెట్టబోతున్నారు. మొత్తం రెండు భాగాలు దసరా లోగా పూర్తవుతాయి.తర్వాత రాజమౌళి సినిమా సెట్స్ పైకెళుతుందా అంటే కానే కాదు, దేవర 2 మొదలౌతుంది.. అది కూడా కేవలం 6 నెలల్లో పూర్తయ్యేలా ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీం. ఆ విషయం తెలిసే కొరటాల శివ దేవర 2 పనుల్లో వేగం పెంచాడు. రాజమౌళి నుంచి నిజంగా ఎన్టీఆర్ కి కాల్ వెలితే, వారణాసి జూన్ లో పూర్తయ్యే ఛాన్స్ఉంటే, ఆతర్వతే జక్కన్నతో మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఉండాలి.కాని వారణాసి పాన్ వరల్డ్ మూవీ అవటంతో, 2027 లో రిలీజ్ అయ్యే వరకే కాదు, విడుదలైనాక మే వరకు మహేశ్, రాజమౌలి అండ్ టీం ఈ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంటుంది.యూరప్, అమెరికా ఇలా వరల్డ్ టూర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే వచ్చే ఏడాది జూన్ కల్లా ఎన్టీఆర్ తను కమిటైన, డ్రాగన్ రెండు భాగాలు, దేవర సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసుకుని, రాజమౌలిమూవీకోసం ఫ్రీ అయిపోవాలి... ఇది రాజమౌలి నుంచి ఎన్టీఆర్ కి వెళ్లిన మెసేజు... దానివల్ల ఎన్టీఆర్ తోనే రాజమౌలిసినిమా అని ఆల్ మోస్ట్ ఇండస్ట్రీ జనానికందరికి క్లారిటీ వచ్చింది.