మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏజ్ ఇప్పుడు 43 ఏళ్లు.. ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తన లెక్కలన్నీ మారిపోతాయా? ఎన్టీఆర్ కి 50ఏళ్లు నిండితే, ఇక పొలిటికల్ ఘాటు మొదలౌతుందనే అంచనాలున్నాయి... అలాని వెంటనే 50ఏళ్లకి రాజకీయాల్లోకి వస్తాడనికాదు.. కాని రాజకీయ వాసనలు అప్పటి నుంచే మొదలు కాబోతున్నాయనంటున్నారు. 55 ఏళ్లు నిండాక మాత్రం తాత పార్టీలోకి వస్తాడా? తనే కొత్త దారి వెతుక్కుంటాడా? చెప్పలేం.. కాని పొలిటికల్ ఎంట్రీ మాత్రం పక్కా అనేస్తున్నారు. అచ్చంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 55 ఏళ్లు నిండాకే ఫుల్ టైం పొలిటీషియన్ గా మారాడు. తమిళ స్టార్ దళపతి విజయ్ కూడా 50ఏళ్లు రాగానే పొలిటికల్ గా కొద్ది కొద్దిగా సిగ్నల్స్ ఇచ్చాడు. 55 ఏళ్లు రాగానే పార్టీ పెట్టేశాడు.. ఇదే స్ట్రాటజీ ని ఎన్టీఆర్ విషయంలో ఊహిస్తున్నారా? ఆ ఊహే నిజమయ్యేలా ఉందంటున్నారా? ఏం జరగొచ్చు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత మంచి పెర్ఫార్మర్ అయినా, పాలిటిక్స్ లో ఇప్పుడప్పట్లో ఇంట్రస్ట్ లేదన్నా, తనని తన సినిమాలని రాజకీయాలకు దూరంగా ఉంచటం కష్టం. ఎంతైనా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత నేత ఎన్టీఆర్ రామారావు మనవడు.. కాబట్టి టీడీపీలోకి వస్తాడా? లేదంటే టీడీపీకి సపోర్ట్ అవుతాడా? ఇలా ఎప్పడూ ఏదో ఒక చర్చ జరుగుతుంది.తనని అభిమానించే కొందరు వైసీపీలో ఉన్నా, తను పుట్టింది హైద్రబాద్ లో కాబట్టి, కట్టే కాలేవరకు అక్కడే ఉంటా అన్నట్టే... తన తాత పెట్టిన పార్టీ అభ్యన్నతికే పాటు పడుతా అన్నట్టుగానే వెళతాడేమో... సరి ఇప్పిటికిప్పేడే కాదు, మరో 12 ఏళ్ల వరకు తన రాజీకీయ ఎంట్రీ ఉండే ఛాన్స్ లేదు.
ఉంటే గింటే,ఆఫ్టర్ 7 ఇయర్స్ అసలు సిసలైన సిగ్నల్స్ ఎన్టీఆర్ నుంచి రావచ్చు..దీని వెనక ఒక లాజిక్ ఉంది. కనీసం 50 ఏళ్లు నిండే వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు... ఎవరూ పొలిటికల్ సిగ్నల్స్ ఇవలేదు.. అంటే వాళ్లు నటించే సినిమాలో డైలాగ్స్ వెనక పొలిటికల్ ఇంట్రస్ట్ ఉండటం లాంటివి, అప్పట్లో రజినీకాంత్ బాబా టైంలో చేశారు.. కమల్ మూవీల్లో అలాంటి మాటలు వాడారు.. అంతెందుకు తమిళ దళపతి విజయ్ కూడా, తన సినిమాల్లో పొలిటికల్ పంచ్ లు పేల్చాడంటే, లోలోపలున్న పొలిటికన్ ఇంటెన్షన్సే కారణం.అంటే ఎన్టీఆర్ మరో ఏడేళ్ల తర్వాత 50లోకి పడగానే, తన సినిమాలో పొలిటికల్ వాసనలు కనిపించేఛాన్స్ఉందా? అప్పుడే చెప్పలేం.. ఒకవేల ఎన్టీఆర్ నిజంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్టు సిగ్నల్స్ ఇవ్వాలంటే 50 ఏల్లు నిండాకే అది బెస్ట్ ఆప్షన్.. ఈలోపంటే ఇంకా ఏజ్ ఉది... మార్కెట్ లో మంచి మైలేజ్ ఉంది.
ఇలాంటప్పుడు పొలిటికల్ వాసనలు తన సినిమాలకు మంచిది కాదు..ఎప్పుడైతే 55 ఏళ్ల వయసులో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తమిళ స్టార్ విజయ్ అనుకుని, 50 ఏళ్ల వయసురాగానే పొలిటికల్ సిగ్నల్స్ ఇస్తూ, 55 ఏళ్లవయసు రాగానే పార్టీ పెట్టాడో.. ఇదే స్టైల్ ఎన్టీఆర్ కి కూడా వర్తించే ఛాన్స్ఉంది. కాకపోతే ఇవన్నీ స్పెక్కులేషన్సే... అలాని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకుండా ఉండే అవకాశం ఎన్టీఆర్ తలరాతలోనే లేదంటారు.. తనెంత ఎత్తెదిగినా, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తాత దారిలో నడవాలనేది తన విధంటారు.. దాన్నే ఎన్టీ ఆర్ ఇష్టపడతాడని కూడా అంటున్నారు. కాబట్టి సినిమాలతో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఈ ఏడేళ్లలోపే.. ఆతర్వాత చేసేవన్ని పొలిటికల్ ఇంట్రెస్ట్ తో చేసే ప్రయోగాలే అన్న అంచనాలున్నాయి... చాలా మంది హీరోలు ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. కాబట్టి ఎన్టీఆర్ దారి కూడా ఇదే అనంటున్నారు.