ఇదే అమాయకపు మొహం ఇప్పుడు మంగ్లీ కొంప ముంచింది. ఆమె ఇంత కాన్పిడెంట్‌గా చెప్తుందంటే మైక్రో ఫైనాన్స్ కేసులో శివ చౌహాన్ తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు అనిపిస్తోంది కదా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్‌కు పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 3 సార్లు శివ అకౌంట్‌కు డబ్బులు పంపించాడు రమావత్ మధు. దీంతో ఈ కేసులో తరువాతి అరెస్ట్‌లు మంగ్లీ ఫ్యామిలీ నుంచే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో సంచలనం రేపిన మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ ఫ్యామిలీ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ లావాదేవీలు పరిశీలిస్తున్న సమయంలో.. కీలక విషయాలు గుర్తించారు పోలీసులు. మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు 3 విడతల్లో పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. డబ్బు ట్రాన్స్ఫర్ అయిన మరుసటి రోజే శివ ఆ డబ్బును విత్ డ్రా చేశాడు. దీంతో ఇప్పుడు అందరీ ఫోకస్ శివ మీదకు వెళ్లింది. మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్‌కు డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది ? ఆ డబ్బును శివ మరుసటి రోజే ఎందుకు విత్ డ్రా చేశాడు ? ఈ కేసులో శివ చౌహాన్, మంగ్లీ పాత్ర ఏంటి ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇప్పుడు మంగ్లీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు గతంలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ బాలాజీ నాయక్ కూడా మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో చీటింగ్ చేసి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. గురువు దగ్గర నేర్చుకున్న విద్యను అమాయకుల మీద ప్రయోగించాలని మధు డిసైడ్ అయ్యాడు. అధిక వడ్డీ ఆశచూపి దాదాపు 100 కోట్లకు పైగానే గిరిజనుల నుంచి వసూలు చేసి మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సింగర్ మంగ్లీ పేరు వాడుకుని గిరిజనుల నుంచి డబ్బు వసూలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇలా వసూలు చేసిన మొత్తం విలువ దాదాపు 100 కోట్లుకు పైనే.గిరిజనుల దగ్గర తీసుకున్న డబ్బుతో బాలాజీ, మధు ఖరీదైన కార్లు కొన్నారు. ఇంద్ర భవనాల్లాంటి ఇళ్లు కట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు భారీగా వ్యాపారాలున్నాయని గిరిజనులను నమ్మించారు. తమకు డబ్బు ఇస్తే 10 నుంచి 15 రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మించి డబ్బు వసూలు చేశారు.
10 లక్షలు ఇస్తే నెలకు లక్ష వడ్డీ వస్తుందన్న ఆశతో గిరిజనులు మధు టీంకు డబ్బులు చెల్లించారు. దేవరకొండ ప్రాంతానికి చుట్టుపక్కల దాదాపు అన్ని గిరిజన ప్రాంతాలను మధు టీం కవర్ చేశారు. గ్రామాలు, తండాలు జల్లెడ పట్టి దాదాపు 400 మంది నుంచి డబ్బు వసూలు చేశారు. కొన్ని నెలలు వడ్డీ సక్రమంగా చెల్లించి తరువాత ఆపేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో మోసపోయామని తెలిసిన గిరిజనులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. వీళ్లు చేసిన మోసాన్ని తట్టుకోలేక ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ మొత్తం వ్యవహారం మగ్లీ పేరు వాడుకుని చేసినట్టు బాధితులు చెప్తున్నారు. కానీ నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ పోలీసులు ఇప్పుడు బయట పెట్టిన బ్యాంక్ లావాదేవీల రిపోర్ట్‌తో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్‌కు డబ్బు వెళ్లిందంటే ఖచ్చితంగా ఈ కేసుతో శివకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.