మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం మైండ్ బ్లాంక్ చేసేలా ఉందా? ఇటు సూర్యుడు అటు ఉదయించినట్టు,తను ఇక్కడ కొడితే, సౌండ్ హాలీవుడ్ లో రీసౌండ్ చేస్తోందా? ఎప్పుడో జమనాలో అన్నారు ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ గురించి. తర్వాత ఆ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు.. అలాని హాలీవుడ్ బ్యాచ్ ఎప్పుడు పడితే అప్పుడు, లేదంటే ఫ్యాన్స్ అడుగుతున్నారని అప్ డేట్స్ ఇవ్వరు. కాబట్టి హాలీవుడ్ లో ఫస్ట్ సూపర్ హీరో అన్న మాట, ఎప్పుడు నిజమౌతుందన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే దొరకదు.. మరి ఎప్పుడు దొరుకుతుంది? హాలీవుడ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హీరో కల నెరవేరేందుకు ఎంత టైం పట్టొచ్చు.. షారుఖ్ ఖాన్ తో పోటీ పడి, హాలీవుడ్ సూపర్ హీరో లీగ్ లో అడుగు పెట్టడం అనేది ఎప్పుడు నిజమౌతుంది? డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సాలిడ్ షాకులు, సర్ ప్రైజులు వరుసగా వినిపిస్తాయా?
హాలీవుడ్ లో ఇండియా నుంచి దీపికా, ప్రియాంక, లేదంటే సైడ్ రోల్స్ వేసిన మేల్ ఆర్టిస్టులున్నారు. కాని హాలీవుడ్ మూవీలో హీరోగా కనిపించిన ఇండియన్ లేడు.. అదే జరగలేదంటే, అంతకుమించేలా హాలీవుడ్ సూపర్ హీరో అనిపించుకోబోతున్న తొలి ఇండియన్ గా ఎన్టీఆర్, షారుఖ్ పేర్లు ఐదారు నెలల క్రితం వినిపించాయి.. అవేంజర్స్ కి ఇండియాలో ఉన్న డిమాండ్ వల్ల, ఒక్క సూపర్ హీరో అయినా ఇండియన్ ని పెట్టాలనేది అవేంజర్స్ టీం ప్లాన్ అన్నారు.అవేంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత కూడా సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. అలాం ప్లాన్ చేసిన సరికొత్త ప్రాజెక్ట్ కోసం ఇండియా తరపున ఒక హీరోని, సూపర్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి.. అక్కడే షారుఖ్ ఖాన్ ని తీసుకోవాలా? ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేయాలా అన్న డిస్కర్షన్స్ లో అవేంజర్స్ టీం బిజీ అన్నారు. కట్ చేస్తే ఇంతవరకు హాలీవుడ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.
నిజానికి ఇదే సినిమా ప్రాజెక్ట్ ప్లానింగ్ కాదు... అందులో ఒక పాత్రతో ఇండియన్ మార్కెట్ ని అట్రాక్ట్ చేసే ప్లానింగ్. కాబట్టి ఫ్యాన్స్ కోసమో, మరోకారణం చేతనో అప్ డేట్స్ ఇవ్వాలనుకోరు.. కేవలం, వాళ్ల ప్లానింగ్ మొత్తం పూర్తయ్యాకే, షాకింగ్ ఎనౌన్స్ మెంట్స్ వస్తాయి.. అయినా ఆ ఎనౌన్స్ మెంట్ లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుందా? షారుఖ్ ఖాన్ పేరే వినిపిస్తుందా?ఇక్కడే రెండు థియరీలు వినిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్ షా మాత్రమే కాదు, ఇండియాతో పాటు, జెర్మనీ, యూరప్ లో చాలా పేరున్న నటుడు. హాలీవుడ్ స్టార్స్ కి కూడా తను సుపరిచితమే.. అయినంత మాత్రాన తననే అవేంజర్స్ కొత్త ప్రాజెక్ట్ లో సూపర్ హీరోగా తీసుకుంటారనుకోలేం.
ఎందుకంటే, తనకెంత ప్రజాధరణ ఉన్నా తను 60ఏల్లు దాటిన నటుడు.రిటైర్ అయ్యే వయసులో తనని సూపర్ హీరో పాత్రకోసం తీసుకుంటే, అది ప్లస్ అయ్యే అవకాశం తక్కువం. ఎందుకంటే అవేంజర్స్ లో సూపర్ హీరోగా ఎవరు కనిపించినా, ఆ పాత్రతో మిగతా కొత్త సినిమాలు, లేదంటే వెబ్ సీరీసులు ప్లాన్ చేస్తారు.. అవన్నీ ఏళ్ల తరబడి జరిగే ప్లానింగ్స్ .. కాబట్టి ఇప్పడే షష్టిపూర్తి చేసుకున్న హీరోని సూపర్ హీరోగా తీసుకుంటే ప్రయోజనం లేదనే ఎన్టీఆర్ ని అవేంజర్స్ టీం కన్పామ్ చేసిందనే ప్రచారం కూడా గతంలో జరిగింది..కాని ఏదైనా అప్ డేట్ వస్తే కాని ఇది కన్ఫామ్ అని చెప్పలేం.
కాని ఇక్కడ దర్శక నిర్మాతల్లా హాలీవుడ్ లో అప్ డేట్స్ ఇవ్వటం లాంటివి ఉండవు... కేవలం హాలీవుడ్ సూపర్ హీరోకి తాను సూట్ అవుతానని అనిపించుకునేందుకే కథ నచ్చకున్నా, వార్ 2 చేశాడు ఎన్టీఆర్. అందులో పాత్ర, ఫైట్స్ ఇలాంటివి రిజల్ట్ తో సంబ్ంధంలేకుండా తనని ఎలివేట్ చేస్తాయి.. ఇదేకాదు త్రిబుల్ ఆర్ టైంలో నాటు నాటు పాటకు గ్లోబల్ గా గుర్తింపు వచ్చినప్పుడే, హాలీవుడ్ సూపర్ హీరో రోల్స్ చేయాలని చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు అన్నారు.. సో ఇవన్నీ చూస్తుంటే, ఎన్టీఆర్ డ్రీమ్ తీరేలా కనిపిస్తోంది. కాకపోతే ఆ సూచనలు పెరిగేలా, అవేంజర్స్ టీం నుంచి ఎన్టీఆర్ పేరు కాకపోయినా, కనీసం త్వరలో ఒక ఇండియన్ సూపర్ హీరో రాబోతున్నాడనే ఎనౌన్స్ మెంట్ వచ్చినా, అది మ్యాన్ ఆఫ్ మాసెసే అని ఒక అంచనాకు రావొచ్చు.