దేవర మూవీకి సీక్వెల్ ఉంటుందా అన్న డౌట్ నుంచి, పట్టాలెక్కబోతోంది వరకు లెక్కే మార్చేశాడు ఎన్టీఆర్. కొరటాల శివ కూడా దేవర సీక్వెల్ పనులు మొదలు పెట్టాడన్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయన్నాడు. కాని లాంచింగ్ సమ్మర్ లో షూటింగ్ మాత్రం దసరాకే అని తెలుస్తోంది. మరి అంతా గ్యాప్ ఎందుకు? డ్రాగన్ షూటింగ్ దసరా వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండటమే రీజనా? లుక్ మార్చుకునేందుకు ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటున్నాడా? మాటల మాంత్రికుడితో గాడ్ ఆఫ్ వార్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? సారి చెప్పినా అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి ఇంకా పూర్తి స్థాయి కరుణ దక్కలేదా? దేవర సీక్వెల్ అక్టోబర్ నుంచే ఎందుకు మొదలౌతోంది? ఆ నెల్లోనే ఎందుకు ఎన్టీఆర్ భారీ ఎత్తున డేట్లిచ్చాడు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ ని సమ్మర్ లోగా పూర్తి చేస్తాడన్నారు. కాని గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే, దసరా వరకు ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ అయ్యేలా ఉంది. అలాని త్రివిక్రమ్ మూవీ, అలానే దేవర సీక్వెల్ డిలే అవుతాయా అంటే కానేకాదు. దేవరని అక్టోబర్ నుంచి తెరకెక్కంచబోతోంది ఫిల్మ్ టీం. కాని ఈనెలాఖర్లో మాత్రం దేవర 2 లాంచింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ లో మొదలు కాబోతోంది. అంటే ఎగ్జాక్ట్ గా దసరా, దీపావళి సీజన్ లో దేవర సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మొదలౌంతుంది.
ఎగ్జాక్ట్ గా డ్రాగన్ కూడా పూర్తయ్యేది సెప్టెంబర్ లోనే...సో ఒక వైపు డ్రాగన్ షూటింగ్ పూర్తవుతూనే, టీజర్లు, ట్రైలర్ల లాంచ్ తో దసరా ధమాకా మొదలౌతుంది. అప్పుడే దేవర 2 సెట్స్ పైకెళుతుంది.ఈలెక్కన అప్పటి వరకు త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ఉండదా అంటే, ఉంటది.. అది మేలోనే మొదలు కాబోతోంది. కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం డిసెంబర్ నుంచే అంటున్నారు. ఈలోపు వెంకీ తో ఆదర్శ కుటుంబం పూర్తి చేయటం, ఆతర్వాత గాడ్ ఆఫ్ వార్ తాలూకు వర్క్ మొదలవటం జరుగుతాయి... ఓరకంగా దేవర 2, గాడ్ ఆఫ్ వార్ రెండూ కూడా ప్యార్ లల్ గానే మొదలౌతాయని తెలుస్తోంది.
ఐతే దేవర సీక్వెల్ విషయంలో ఎప్పుడూ డౌట్లు, కన్ ఫ్యూజన్లే కనిపించాయి.. అలాంటివార్తలే వైరలయ్యాయి. ఐతే రాజమౌైలఇ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి పాన్ ఇండియా లెవల్లో సోలోగా ఎన్టీఆర్ కి హిట్ పడేలా చేసిన మూవీ దేవర. అందుకే దాని సీక్వెల్ కి చాలా ప్రయారిటీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. కాకపోతే తనెంత ప్రయారిటీ ఇచ్చినా, డ్రాగన్ లో తన లుక్ కి, దేవర సీక్వెల్ లో తన లుక్ కి సింక్ కావట్లేదు.కాబట్టే, డ్రాగన్ షూటింగ్ పూర్తిగా అయిపోయే వరకు దేవర సీక్వెల్ ని హోల్డ్ లో పెట్టక తప్పని పరిస్తితి.. దాని వల్లే, దేవర 2 ఉండదు, వాయిదా, లేదంటే పక్కన పెట్టారంటూ నెగెటీవ్ ప్రచారాలు జరిగాయట. ఐతే కొరటాల శివ మాత్రం తనకి బల్క్ గా అక్టోబర్ లో ఎన్టీఆర్ డేట్స్ దొరకటంతో, ఈపాటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టడం, పూర్తి చేయటం జరిగిందని తెలుస్తోంది. రెండో దేవరకి చాలా వరకు టైం బానే కలిసొస్తున్నట్టు తెలుస్తోంది.