ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడు రూమర్లకు బ్రేక్ వేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. బేసిగ్గా తన సినిమా వస్తోందంటేనే, రూమర్లు, నెగెటీవ్ ప్రచారాలు కామన్. కాకపోతే, ఈసారి నెగెటివ్ తో పాటు, పాజిటివ్ ప్రచారాలు కూడా పెరిగాయి. అవే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని కన ఫ్యూజన లోకి నెడుతున్నాయి. ఆ రూమర్స్ లో దేవర 2 ఆగిపోయిందనే నెగెటీవ్ ప్రచారం ఉంది. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ చేస్తాడా; బన్నీ చేయబోతున్నాడా అన్న చర్చ ఉంది... డ్రాగన్ రెండు భాగాలు ఇలా ఏకంగా ఏడు రూమర్లకు బ్రేక్ పడబోతోంది.మరో ఏడు రోజుల్లో ఏడు రూమర్లే కాదు, ఈలోపు క్రియేట్ అయ్యే మరిన్ని రూమర్లకు కూడా ఎన్టీఆర్ ఒక్కడే బ్రేక్ వేయబోతున్నాడు. అదికూడా తన నోటి మాటతోనే.. తన బర్త్ డే రోజు తనే స్వయంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాడట. అంటే, ప్రెస్ మీట్ లాంటిది ఉండబోతోందా? డ్రాగన్ గ్లింప్స్ ని మించే అప్ డేట్ ఇంకేదో వస్తుందా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏడు రోజుల్లో ఏడు రూమర్లకు బ్రేక్ వేయబోతున్నాడు. అందులో అన్నీంటికంటే ముఖ్యమైనది, మొదటిది గాడ్ ఆఫ్ వార్ మీద వస్తున్న రూమర్లు... నిజం చెప్పాలంటే ఈ కథ ఎన్టీఆర్ కోసమే త్రివిక్రమ్ రాసుకున్నాడు. తర్వాత బన్నీకి కథ నచ్చిందని, ఎన్టీఆర్ ని కాదని, ఐకాన్ స్టార్ వైపుకి త్రివిక్రమ్ షిప్ట్ అయ్యాడన్నారు.తర్వాత ఆవివాదంముగిసి, మళ్లీ ఎన్టీఆర్ కటాక్షంతో, తనతోనే గాడ్ ఆఫ్ వార్ తీసేందుకు రూట్ క్లియర్ అయ్యిందని కూడా అంటున్నారు. కాని డ్రాగన్ రెండు భాగాల వల్లే షూటింగ్ డిలే అవుతోందని, మరో ఏడాదిన్నర వరకు డ్రాగన్ షూటింగ్ జరుగుతుందనే వార్తలొస్తున్నాయి. అందుకే బన్నీతో త్రివిక్రమ్ సినిమా అంటూ మరోసారి పాత పాటే పాడుతున్నారు, రూమర్స్ క్రియేట్ చేసే బ్యాచ్.
సో ముందు ఈ రూమర్ కి ఎన్టీఆర్ బర్త్ డే రోజు అంటే మరో 7 రోజుల తర్వాత క్లారిటీ రాబోతోంది. మోస్ట్ లీ ఎన్టీఆర్ తో లుక్ టెస్ట్ కోసం చేసిన షూటింగ్ వీడియోని ఏఐ సాయంతో గ్లింప్స్ లా మార్చి త్రివిక్రమ్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. అదే జరిగితే, ఇక గాడ్ ఆఫ్ వార్ విషయంలో వస్తున్న రూమర్స్ కి బ్రేక్ పడుతుంది. ఇక రెండో రూమర్, దేవర 2 లేదు, ఉండదు అన్న రూమర్ కి కూడా మే 20న బ్రేక్ పడబోతోంది.ఆరోజు కొరటాల శివ సాలిడ్ పోస్టర్ తోనో, లేదంటే ప్రోమోతోనో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వటంతో, ఈ సినిమా ఉండదనే రూమర్ కి బ్రేక్ పడే ఛాన్స్ఉంది. 3వ రూమర్ విషయానికొస్తే, నాగవంశీ ప్రొడ్యూసర్ గా నెల్సన్ దిలీప్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని నిర్మాతే తేల్చాడు. కాని అది ప్రాక్టికగల్ గా ఎంతవరకు నిజమో మే 20న వచ్చే స్పెషల్ ఎనౌన్స్ మెంట్ తో తేలబోతోంది.
ఇక డ్రాగన్ రెండు భాగాలా కాదా; ఇందులో ఎన్టీఆర్ వేసే రెండు పాత్రలు, తాతా మనవడివా? లేదా తండ్రి కొడుకులవా? లేదంటే సోదరుల పాత్రలా... ఇలా డ్రాగన్ మీద రెండు రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వాటికి కూడా మే 20న అంటే మరో 7 రోజుల్లో బ్రేక్ పడబోతోంది. ఇక 2029 లో సుకుమార్ తో ఎన్టీఆర్ కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ రెండు మూడు సార్లు కలిసి ఎన్టీఆర్ కి కథచెప్పాడన్నారు.. సో ఈ రెండు ప్రాజెక్టులు 2029 , 2030 లో పట్టాలెక్కుతాయా లేదా, అన్నది ఎన్టీఆరే తేల్చే ఛాన్స్ఉంది. తన పుట్టిన రోజు చాలా విషయాలకు, చాలా ప్రశ్నలకు సమాధానాన్ని ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం ఉందట. మొత్తానికి 7 రోజుల్లో 7 రూమర్లకు బ్రేక్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.