ఎన్టీఆర్ + ఎన్టీఆర్.. 5వ సారి ఆసియా అంతా…?

ఎన్టీఆర్ ఒకడు కాదు, ఇద్దరిగా వస్తే కలిసొస్తుందా? తన గత సినిమాలు చూస్తే కలిసొస్తుందనే తేలింది. ఒక్క ఆంద్రావాలలో మరీ తండ్రి పాత్ర వేసేంత ఏజ్ తనకి కనిపించకపోవటంతో, ఎక్కడో రిజల్ట్ మిస్ ఫైర్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 5:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని సరిగ్గా వాడుకుంటే, పెర్ఫామెన్స్ తో ఆడుకుంటాడని అంటారు. చాలా సార్లు ఈ మాట ప్రూవ్ అయ్యింది. అలాంటి ఎన్టీఆర్ ని డ్యూయెల్ రోల్ లో తీసుకుంటే, బాక్సాఫీస్ లో పూనకాలే.. ఒక్క ఆంధ్రావాలా లోఈ ఐడియా మిస్ ఫైర్ అయ్యింది. కాని తర్వాత వచ్చిన మూడు సినిమాల్లో అదుర్స్ అనిపించాడు ఎన్టీఆర్. జైలవకుశ తర్వాత దేవరలో కూడా ఇదే ఐడియా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఐతే ఈసారి తన డబుల్ డోస్ ఎఫెక్ట్ పాన్ ఇండియా వరకే ఉండట్లేదు. పాన్ ఆసియా మూవీగా డ్రాగన్ రాబోతోంది. ఎన్టీఆర్ రెండు పాత్రలు రెండు భాగాలుగా డ్రాగన్ మూవీ భారీ దండయాత్రకు సిద్దమౌతోంది. నాలుగు సార్లు డబుల్ డోస్ కి ప్రయత్నిస్తే, ఒక్క సారి తప్ప మిగతా మూడు సార్లు ఎన్టీఆర్ బాక్సాఫీస్ తో ఆడకున్నాడు. దేవరతో పాన్ ఇండియా లెవల్లో కూడా ఇదే ఐడియా వర్కవుట్ అయ్యింది. మరి డ్రాగన్ తో డబుల్ ఫోటో కాన్సెప్ట్ పాన్ ఆసియాను షేక్ చేస్తుందా? ఇందులో తను డ్యూయెల్ రోల్ వేయటానికి కథకంటే, ఆసియా మార్కెట్టే అసలు రీజనా? అదెలా?

ఎన్టీఆర్ ఒకడు కాదు, ఇద్దరిగా వస్తే కలిసొస్తుందా? తన గత సినిమాలు చూస్తే కలిసొస్తుందనే తేలింది. ఒక్క ఆంద్రావాలలో మరీ తండ్రి పాత్ర వేసేంత ఏజ్ తనకి కనిపించకపోవటంతో, ఎక్కడో రిజల్ట్ మిస్ ఫైర్ అయ్యింది. కాని తర్వాత వచ్చిన అదుర్స్ హిట్టైంది. జైలవకుశ లో ఏకంగా మూడు పాత్రలేస్తే, బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఇక దేవరతో అయితే ఏకంగా పాన్ ఇండియా షేక్ అయ్యింది.అంతకుమించి రాజమౌళి సెంటిమెంట్ నే బ్రేక్ చేసి, తన సాయం లేకుండా పాన్ ఇండియా షేక్ చేయగలనని ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకునేలా చేసింది దేవర మూవీ. కాబట్టి డ్యూయెల్ రోల్ ఎప్పుడు తనకి కలిసొస్తుందనే సెంటిమెంటే బలపడింది. దీనికి తోడు వెండితెరమీద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడుంటేనే, రెస్పాన్స్ ఓరేంజ్ లో ఉంటే, డ్యూయెల్ రోల్ లో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, డెఫినెట్ గా కథకి కలిసొచ్చే అంశమే.

బాక్సాఫీస్ కి బోనస్ లాంటి ప్రయోగమే.. కాకపోతే పాన్ ఇండియా లెవల్లో దేవర డ్యూయెల్ రోల్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, పాన్ వరల్డ్ లెవల్లో డ్రాగన్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. కాకపోతే, అదుర్స్, దేవర, జైలవకుశ ఇవన్నీ ఒక ఎత్తైతే, డ్రాగన్ మరో ఎత్తు అనిపించేలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి.. అప్పుడే పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మార్కెట్ లో డ్రాగన్ నిప్పుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది.ఎగ్జాంపుల్ బాహుబలి.. ఐను బిల్లాలో డ్యూయెల్ రోల్ వేసి హిట్ కొట్టిన ప్రభాస్ కి నిజమైన డబుల్ డోస్ అంటే బాహుబలే..

ఎందుకంటే అందులో రెండు పాత్రలకి లుక్ నుంచి పెర్ఫామెన్స్ వరకు, కథనుంచి నెరేషన్ వరకు అన్నీంట్లో ప్రత్యేకతుంది.. అందుకే బాహుబలి రేంజ్ లో డ్రాగన్ కూడా ఒక హీరో రెండు పాత్రల ఇంపాక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉండాలి.అప్పడే మార్కెట్ షేక్ అవుతుంది. ట్రెండ్ సెట్ అవుతుంది. అందుకే నాలుగు సార్లు డ్యూయెల్ రోల్స్ లేదంటే త్రిబుల్ రోల్స్ తో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ కి, ఈసారి పాన్ వరల్డ్ లేదంటే పాన్ ఆసియా లెవల్లో బ్లాక్ బస్టర్ పడాలంటే, కథ కథనాలే కాదు, తను వేస్తున్న రెండు పాత్రల్లో వేరియేషన్ బాహుబలి రేంజ్ లో ప్రత్యేకంగ ఉండి తీరాల్సిందే.. అదే ఇక్కడ కుదిరినట్టుంది. అందుకే హెల్త్ ని రిస్క్ చేసీ మరీ రెండు పాత్రల్లో వేరియేషన్ కోసం, సన్నబడటం, తర్వాత కండలు పెంచటం ఇలా రెండీంటికి సిద్దపడ్డాడు ఎన్టీఆర్.

Published : 
  • 4 March 2026, 5:50 PM IST