చెప్పిన సమయానాకే బాక్సాఫీస్ బద్దలు…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' . 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో, ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను మూటగట్టుకుంది.

Post Published By: dialnews
Updated : 3 April 2026, 2:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' . 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో, ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను మూటగట్టుకుంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి 'పెద్ది' సినిమా విడుదలపై గందరగోళం ఒక చిన్న పొరపాటు వల్ల మొదలైంది. ఇటీవల ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత SKN, 'పెద్ది' సినిమా జూన్ 26కి వాయిదా పడిందని పొరపాటున ప్రకటించారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఏప్రిల్‌లో రావాల్సిన సినిమా మళ్ళీ జూన్‌కు వెళ్ళిపోయిందా అని ఆందోళన చెందారు. అయితే, వెంటనే అప్రమత్తమైన నిర్మాత SKN మరియు కో-ప్రొడ్యూసర్ సాయి రాజేష్ క్లారిటీ ఇచ్చారు. వేదికపై ఉన్నప్పుడు ఆడియన్స్ అరుపుల వల్ల తను తప్పుగా విన్నానని, జూన్ 26 అనేది మరొక సినిమా డేట్ అని, 'పెద్ది' టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని క్షమాపణలు కోరారు. ఈ చిన్న పొరపాటే నెట్టింట పెద్ద వైరల్ అయ్యింది. ఈ పుకార్ల మధ్య స్వయంగా రామ్ చరణ్ రంగంలోకి దిగడం విశేషం. ఇటీవల తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మించిన 'రాకాసి' ప్రమోషన్లలో పాల్గొన్న చరణ్, 'పెద్ది' రిలీజ్ డేట్ వాయిదాపై స్పందించారు.

"పెద్ది సినిమా వాయిదా పడిందని నేను కూడా వింటున్నాను.. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. పెద్ది లేట్ అవ్వదు, అందరికీ ఇదే విషయం చెప్పండి"
అని చరణ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. చరణ్ స్వయంగా ఈ మాట చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మే డే వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ తేదీని లాక్ చేశారు. ఒకవేళ ఈ సినిమా వాయిదా పడితే, ఆ డేట్ కోసం నిఖిల్ 'స్వయంభూ', సమంత 'మా ఇంటి బంగారం' వంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి. కానీ 'పెద్ది' టీమ్ మాత్రం ఏప్రిల్ నెలాఖరుకే రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. సినిమా రంగంలో పుకార్లు సహజం, కానీ 'పెద్ది' లాంటి భారీ చిత్రాల విషయంలో అభిమానులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా సందడి మొదలవ్వడం ఖాయం.

Published : 
  • 3 April 2026, 2:00 PM IST