వాటం చూపించే ఐటం సాంగ్…!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్ళింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్దికి సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది

Post Published By: dialnews
Updated : 28 April 2026, 8:15 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్ళింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్దికి సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'పెద్ది' విడుదల ఎప్పుడు ఉంటుందనే దానిపై రకరకాల వార్తలు వినిపించాయి. ఈ గందరగోళానికి స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు చెక్ పెట్టాడు. తాజాగా జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, పెద్ది సినిమా రిలీజ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమాను జూన్ నెలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే, ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో కనిపించబోతోందట. శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్ మరియు సింగర్ కూడా. గతంలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో ఆమె చేయబోయే ఐటమ్ సాంగ్ అంతకు మించి ఉండబోతోందని టాక్.

ఈ పాట కోసం భారీ సెట్ వేశారని, శృతి హాసన్ తన గ్లామరస్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ సాంగ్ కేవలం ఒక పాట మాత్రమే కాదు, మాస్ ఆడియన్స్‌కు ఒక ఐఫీస్ట్ లాంటిది" అని చిత్ర యూనిట్ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి 'పెద్ది' సినిమాతో శృతి హాసన్ మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అద్భుతమైన కొరియోగ్రఫీతో తెరకెక్కుతున్న ఈ లిరికల్ సాంగ్ ను మే నెలలో విడుదల చేయనున్నట్టు సమాచారం.

Published : 
  • 28 April 2026, 8:15 PM IST