2: MEGA మిస్సింగ్.. మాస్ SHOCKING…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ పేలటానికి 24 గంటల ముందు పెద్ది ట్రైలర్ వచ్చింది. కథంతా అందులోనే చెప్పేశాడు డైరెక్టర్. అలా ట్రైలర్ వచ్చిందో లేదో, వెంటనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తప్పించుకున్నాడనే మాటే వినిపించింది.

Post Published By: dialnews
Updated : 20 May 2026, 6:10 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ పేలటానికి 24 గంటల ముందు పెద్ది ట్రైలర్ వచ్చింది. కథంతా అందులోనే చెప్పేశాడు డైరెక్టర్. అలా ట్రైలర్ వచ్చిందో లేదో, వెంటనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తప్పించుకున్నాడనే మాటే వినిపించింది. అంటే ఈ ట్రైలర్ లో ఏదో మిస్ అవటం వల్లే ఇలా అన్నారా? అందుకే దాని ఎఫెక్ట్ డ్రాగన్ గ్లింప్స్ కొచ్చే రెస్పాన్స్ మీద పడకుండా పోయిందా? అంటే కానే కాదు. ఎంతైనా ఇది ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కథ.. కాని రామ్ చరణ్ చేశాడు.. అదే అంశం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని సంబర పెడుతోందా? లేదంటే ఎన్టీఆర్ కి పెద్ది గాయాలు మిస్ అయ్యాయనే కోణంలో ఫ్యాన్స్ నుంచి ఇలాంటి స్పందన వస్తోందా? ఇంతకి పెద్దిలో మెగా మిస్సింగ్ ఏమై ఉండొచ్చు..? మెగా షాక్ వెనకున్న కారణాలేంటి? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా చరణ్ కి సపోర్ట్ చేస్తున్నా? సడన్ గా వాళ్లు ఇలా రిలీఫ్ అవటానికి రీజనేంటి?

పెద్ది మూవీ ట్రైలర్ రాగానే అదుర్స్ అన్నారు. టీజర్, సాంగ్స్ కంటే ట్రైలర్ నెక్ట్స్ లెవర్ అన్నారు. కట్ చేస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఇప్పుడు రెండు రకాల టాక్స్ వస్తున్నాయి. ఒకటి ఎన్టీఆర్ సేఫ్... రెండోది మెగా పవర్ స్టార్ కి హిట్ రావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ పెట్టడం.. ముందుగా పెద్ది ట్రైలర్ లో మెగా మిస్సింగ్ ఏంటి? మెగా షాకింగ్ ఇంకేంటో చూస్తే... ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఈ ట్రైలర్ రెస్పాన్స్ విషయంలో డివైడ్ అయ్యారో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.పెద్ది మూవీ ట్రైలర్ మరీ చప్పగా సాగింది. హీరో క్రికెటర్ గా, రెజ్లర్ గా, అథ్లెట్ గా ఇలా మల్టీ స్పోర్ట్స్ మన్ గా కనిపించాడు. ఇక పల్లె టూరి నుంచి పట్నం వచ్చి, తర్వాత నేషనల్ లెవల్ స్పోర్స్ స్టార్ గా మారి, దేశం కోసం వరల్డ్ గేమ్స్ లో ప్రాతినిథ్యం వహించటం వరకు అంతా బానే ఉంది. కథ మొత్తం ట్రైలర్ లోనే చూపించాడు. ఇక థియేటర్ కెళ్లి పెద్ది ఎమోషనల్ జర్నీ చూస్తే సరిపోతుంది.

మరి ఇందులో ఏం మిస్సైందని, ఇంకేం బాలేదని ఎన్టీఆర్ తప్పించుకున్నాడనే రిలీఫ్ తన ఫ్యాన్స్ లో కనిపిస్తోంది..? అక్కడే రెండు ట్విస్ట్ లున్నాయి. పెద్దిలో మాస్ మతిపోగొడుతుందనిపించే ఒక్క హై మూవ్ మెంట్ ఉన్న షాట్ కనిపించలేదు.. అంతా ఫ్లాట్ గా సాగిపోతున్న ప్రోమో తప్ప... ఇక పెద్ది ట్రైలర్ చూస్తుంటే కొత్త మూవీ ని చూడబోతున్నామనిపించేలా లేదు.లగాన్ లో క్రికెట్, దంగల్ లో కుస్తి, సుల్తాన్ లో భారీ కండలు ఫైట్లు, అలానే రంగస్థలం చిట్టిబాబే మళ్లీ వచ్చాడా అనిపించేలా హీరో పాత్ర... వీటికి తోడు పుష్పరాజ్ స్టైల్లో పచ్చి పల్లెటూరి యాంబియన్స్, అలాంటి ఐడెంటిటీ ఎమోషన్స్.. ఇవే పెద్దిని నాలుగైదు పాత సినిమాల రీమిక్స్ లా మార్చాయా అన్న డౌట్లు రావటానికి కారణమౌతున్నాయి.

నిజానికి ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా.. కాని కథ తనకంటే రామ్ చరణ్ కే ఎక్కువ సూట్ అవుతుందని తను ఈ కథని త్యాగం చేశాడన్నారు. తన ఉద్దేశ్యం మంచిదే అయినా, పెద్ది ట్రైలర్ చూశాక ఎన్టీఆర్ ఈ కథని వదులుకోవటం మంచిదే అయ్యిందంటున్నారు. చాలా పెద్ద గండం నుంచి తను తప్పించుకున్నారనంటున్నారు.జాన్వీ పాత్ర ఎందుకుందో అనేలా ఉందనంటున్నారు. రెహమాన్ పాటలు కొంతవరకు పర్లేదు కాని, ట్రైలర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరీ నాసీరకంగా ఉందనే కామెంట్లు పెంచారు. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలా మంది, రామ్ చరణ్ కి పెద్దితో హిట్ రావాలని కోరుకోవటం, కామెంట్స్ రూపంలో ఇదే విషయం వైరలవటం పాజిటివ్ సైనే.. కాని ట్రైలర్ మాత్రం మాస్ మతిపోగొట్టేలానో, ఏదో గొప్ప మూవీ చూడబోతున్నామనో అనిపించేలా లేకపోవటంతో, ఎన్టీఆర్ కాస్తలో ప్రమాధం నుంచి తప్పించుకున్నాడనే రిలీఫ్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.

Published : 
  • 20 May 2026, 6:10 PM IST