అదే కారణంతో.. ఆల్ టైమ్ రికార్డ్స్…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Post Published By: dialnews
Updated : 20 May 2026, 7:50 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ, యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్‌గా, ఇంటెన్స్‌గా సాగింది. ముఖ్యంగా, ట్రైలర్‌లోని ఒక ప్రత్యేకమైన యాక్షన్ షాట్ అభిమానులను పూర్తిగా మంత్రముగ్ధులను చేస్తోంది. రామ్ చరణ్ అత్యంత ఉద్వేగంతో, తనదైన సిగ్నేచర్ శైలిలో ప్రత్యర్థిపై దాడి చేస్తున్నట్లుగా ఉన్న ఈ సన్నివేశం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పాలి. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే, లాస్ట్‌లో వచ్చే ఆ 'ట్రాన్సిషన్ షాట్' మరో ఎత్తు అంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఒక సాధారణ క్రికెటర్‌గా కనిపించే పాత్ర, కథలో వచ్చే మలుపుల వల్ల కుస్తీ యోధుడిగా ఎలా మారింది అనే విషయాన్ని చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు. ఈ పర్టికులర్ ట్రాన్సిషన్ షాట్ సినిమాకే హైలైట్ కానుందని, రామ్ చరణ్ పాత్రలోని ఈ రెండో కోణమే ఈ సినిమాకు ప్రాణమని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో బుచ్చిబాబు సానా దర్శకత్వ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ట్రైలర్‌లోని ఆ ఒక్క ట్రాన్సిషన్ షాట్‌కు నీకు గుడి కూడా కట్టేయవచ్చు బుచ్చి" అంటూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని సరికొత్తగా వ్యక్తపరుస్తున్నారు. రామ్ చరణ్ మేకోవర్, ఆయన ఇంటెన్స్ లుక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా 'వావ్' అనేలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి.
ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. ప్రతి పాత్రను టైటిల్‌తో రివీల్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ‘పెద్ది’ సినిమా ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. ‘ఉప్పెన’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడం, పైగా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ హీరో కావడంతో ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అన్ని హంగులతో, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సిద్ధమైన 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, రామ్ చరణ్ కెరీర్‌లో ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి అంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Published : 
  • 20 May 2026, 7:50 PM IST