‘పెద్ది’లో హనుమాన్ రిఫరెన్స్…?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Post Published By: dialnews
Updated : 28 May 2026, 3:30 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు, ఈ చిత్రం ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో, సాలిడ్ ఎమోషన్స్ మరియు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతోందని టాక్ రావడంతో బిగ్ స్క్రీన్ పై చరణ్ ను చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అందిస్తున్న విజువల్స్ మరియు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి.

వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమాలో ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో ‘హనుమాన్ రిఫరెన్స్’ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ సినిమాలో అత్యంత కీలకమైనదిగా ఉండటమే కాకుండా, థియేటర్లలో ఆడియన్స్‌కు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఈ సీక్వెన్స్ ముఖ్యంగా 'మెగా ఫ్యాన్స్' కి మరింత పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారట. మెగా కుటుంబం అంతా మొదటి నుండి హనుమాన్ భక్తులనే సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో కూడా హనుమాన్ ప్రస్తావన లేదా రిఫరెన్సులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు అదే బాటలో రామ్ చరణ్ చిత్రంలో కూడా ఇలాంటి ఒక డివోషనల్ టచ్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్ పడటం విశేషం.

గతంలో రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో కూడా ఒక పవర్‌ఫుల్ హనుమాన్ రిఫరెన్స్ సీన్ ఉంటుంది. థియేటర్లలో ఆ సీన్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
మళ్ళీ ఇప్పుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా కూడా తన గురువు సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, ‘పెద్ది’ లో ఈ తరహా డివోషనల్ యాక్షన్ బ్లాక్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో థియేటర్లలో ఈ డివోషనల్ యాక్షన్ సీన్ వస్తున్నప్పుడు ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ పెహల్వాన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో చరణ్ చేతిలో గద పట్టుకుని రగ్గడ్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పవర్‌ఫుల్ లుక్‌కి తోడు ఈ హనుమాన్ రిఫరెన్స్ సీన్ కూడా తోడైతే, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవడం ఖాయం.మరి ఇంతటి ఈ అద్భుతమైన విజువల్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ బిగ్ స్క్రీన్స్ పై ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే రాబోయే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Published : 
  • 28 May 2026, 3:30 PM IST