బాలీవుడ్ తగలబెట్టేలా బుచ్చిబాబు మాస్టర్ స్కెచ్…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ అయిపోయింది. 'పెద్ది' సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ 'రయ్ రయ్ రా రా' వచ్చేసింది.

Post Published By: dialnews
Updated : 3 March 2026, 6:58 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ అయిపోయింది. 'పెద్ది' సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ 'రయ్ రయ్ రా రా' వచ్చేసింది. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సానా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో..‌ వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ పాట దూసుకెళ్తోంది. మొదటి సాంగ్ 'చికిరి' ఒక క్లాస్ మెలోడీ అయితే, ఈ 'రయ్ రయ్ రా రా' పక్కా మాస్ నంబర్. ఈ పాటలో ఒక రకమైన 'రస్టిక్ ఫోక్' వైబ్ ఉంది. ఏఆర్ రెహమాన్ అంటే సాధారణంగా క్లాస్ మ్యూజిక్ అనుకుంటాం, కానీ ఇందులో ఆయన ఇచ్చిన బీట్స్ థియేటర్లో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా డ్రమ్స్ మరియు ఆ నాటు స్టెప్స్ కి తగినట్టుగా ఉన్న రిథమ్ అదిరిపోయింది.

లిరికల్ వీడియోలో చూపిస్తున్న చరణ్ లుక్స్ మాస్ గా ఉన్నాయి. బుచ్చిబాబు తన సినిమాల్లో విజువల్స్ ని ఎంత గ్రాండ్‌గా చూపిస్తారో మనకు తెలుసు, ఈ సాంగ్‌లో కూడా అది కనిపిస్తోంది. స్వయంగా రెహమాన్ పాడిన పాట ఎనర్జీ గురించి మాట్లాడాల్సి వస్తే.. పక్కా లోకల్ ఫ్లేవర్‌ని తీసుకొచ్చారు. ఆ వాయిస్‌లో ఉన్న బేస్, సాంగ్‌కి హైలైట్. ఇక లిరిక్స్ విషయానికి వస్తే, హీరో ఎలివేషన్ మరియు ధర్మం గురించి చెప్పే మాటలు మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. 'రయ్ రయ్ రా రా' అనే హుక్ లైన్ అయితే లూప్‌లో వినేలా ఉంది.

రామ్ చరణ్ అంటేనే డాన్స్. ఈ పాటలో ఆయన వేసే గ్రేస్ ఫుల్ స్టెప్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. లిరికల్ వీడియోలో అక్కడక్కడ కనిపించే కొన్ని గ్లింప్స్ చూస్తుంటే, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇంపాక్ట్ విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తోంది. ఓవరాల్‌గా చెప్పాలంటే, 'రయ్ రయ్ రా రా' ఒక పక్కా చార్ట్‌బస్టర్ మెటీరియల్. ఫస్ట్ విన్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించినా, రెండోసారి వింటే మాత్రం మైండ్‌లో రిజిస్టర్ అయిపోతుంది. ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్‌తో ఒక వింటేజ్ మాస్ వైబ్‌ని క్రియేట్ చేశారు.

Published : 
  • 3 March 2026, 6:58 PM IST