ప్రభాస్ ‘ఫౌజీ’లో గాంధీ ఎవరు?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ'అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.

Post Published By: dialnews
Updated : 17 August 2026, 11:55 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ'అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికే చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా, డిసెంబర్ 2నే ఈ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రీమియర్స్ కూడా ప్రదర్శించనున్నట్లు చిత్ర నిర్మాత రవిశంకర్ ఒకానొక సందర్భంలో వెల్లడించారు.

ఈ క్రమంలోనే 'ఫౌజీ' సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సీనియర్ నటుడు అనూపమ్ ఖేర్ ఈ చిత్రంలో అత్యంత కీలకమైన మహాత్మా గాంధీ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గాంధీ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉండనుందని సినీ వర్గాల భోగట్టా. ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథలో అనూపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటుడు గాంధీజీ పాత్ర పోషించడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అనూపమ్ ఖేర్ ఇప్పటికే తెలుగులో నటించిన పలు చిత్రాలకు మంచి ప్రశంసలు దక్కించుకున్నారు. ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు ప్రభాస్ నటించే 'ఫౌజీ' చిత్రంలో ఆయన మహాత్మా గాంధీ పాత్రలో నటిస్తున్నారని, ఆ పాత్ర కథను తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉంటుందని వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ వార్త గనుక నిజమైతే, తెలుగు సినీ పరిశ్రమలో అనూపమ్ ఖేర్‌కు ఉన్న క్రేజ్ మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హను రాఘవపూడి మేకింగ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ పీరియాడిక్ కథాంశంలో ప్రభాస్ లుక్ మరియు కథా నేపథ్యం ఎలా ఉండబోతుందనే దానిపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. దీనికి తోడు అనూపమ్ ఖేర్ వంటి సీనియర్ నటుల కలయిక సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

Published : 
  • 17 August 2026, 11:55 AM IST