రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్స్ తో పాన్ ఇండియా కింగ్ గా మారాడు. అలాంటి తనని లెజెండ్ అన్నాడు ధురందర్ డైరెక్టర్ ఆదిథ్య ధర్. అంతే ఇప్పుడీ మాట, సోషల్ మీడియాలో తూటాలా దూసుకెళుతోంది. చాలా కాలం తర్వాత ఒక వర్గం పూనకాలొచ్చినట్టు రెచ్చిపోతోంది. స్పిరిట్ మీద, సందీప్ రెడ్డి మీద బురదని వరదలా ఎత్తిపోస్తోంది... ఐతే ఇక్కడే పాన్ ఇండియా కింగ్ ని పాన్ ఇండియా లెజెండ్ అన్న ఆదిత్య ధర్ మాట, పాన్ ఇండియా స్టార్స్ ని షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ ని ఇంప్రెస్ చేసి తనతో మూవీ ఛాన్స్ కొట్టేసేందుకు, ట్రై చేస్తున్న స్టార్స్ అందరికీ లెజెండ్ అన్న మాట గేట్ పడేలా చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆఖరికి సూపర్ స్టార్ మహేశ్ బాబు అందరికి ఆశలు గల్లంతవుతున్నాయా? రెబల్ స్టార్ ని ఆదిత్య ధర్ లెజెండ్ అంటూ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కి ప్లానింగ్ లో ఉన్నాడని తేల్చాడా? ఒక్క లెజెండ్ అన్న పొగడ్త వెనక ఇంత స్టోరీ ఉందా?
పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్.. ఇందులో ఎలాంటి డౌట లేదు.. ఎందుకంటే ఖాన్లు, కపూర్లు కూడా ప్రభాస్ రేంజ్ లో ఐదు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకోలేదు. షారుఖ్ ఖాన్ కి రెండు సినిమాలు వెయ్యికోట్ల సీన్ తెచ్చినా, జవాన, పటాన్ హిందీ మార్కెట్ నే షేక్ చేసింది. కాని పాన్ ఇండియా మొత్తం ఈ మూవీలు కుదిపేసినట్టు ఎక్కడా కనిపించలేదు.పుష్ఫ రాజ్ గా బన్నీ, త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, చరణ్, కేజీయఫ్ తో యష్ పాన్ ఇండియాని షేక్ చేశారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని బాహుబలిగా రెండు సార్లు, సాహో, సలార్, కల్కీ తో మూడుసార్లు పాన్ ఇండియాని షేక్ చేసి, పాన్ ఇండియా కింగ్ గా మారాడు ప్రభాస్. కట్ చేస్తే ఇప్పుడు తనకి ప్రమోషన్ వచ్చింది.. పాన్ ఇండియా లెజెండ్ గా మారే టైం వచ్చింది.
ఈమాటంది ధురందర్ రెండు భాగాలతో రెండు సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్. ధురందర్ 2 మూవీ చూసి ఆ టీం ని ప్రభాస్ పొగిడాడని ఇలా అనలేదు. మొదటినుంచే రెబల్ స్టార్ అంటే తనకి ప్రత్యేక అభిమానమన్నాడు. సలార్ టైంలో తాను ట్వీట్ కూడా చేశాడు. సో తనకి జెన్యూన్ గానే రెబల్ స్టార్ మీద అపారమైన గౌరవం ఉందని తెలుస్తోంది.ఐతే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, ధురందర్ 2 అదిరిపోయిందని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ధురందర్ 2ని ఆకాశానికెత్తాడు.. కాని వీళ్లెవరికీ ప్రభాస్ ని లెజెండ్ అని పిలిచినంతగా రెస్పాండ్ కాలేదు డైరెక్టర్ ఆదిత్య ధర్. ఓరకంగా ఆదిత్య ధర్ ని మెచ్చుకుంటూనే, తనమీద కర్చీఫ్ వేసి తన మేకింగ్ లో సినిమా పట్టేందుకు మన పాన్ ఇండియా హీరోలు ప్రయత్నిస్తుంటే, తను మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ ని లెజెండ్ అని పొగుడుతూ, తనమీద కర్ఛిఫ్ వేస్తున్నాడనే టాక్, ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది.ఆదిత్య ధర్ నిజంగానే ప్రభాస్ తో సినిమాకోసం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంత్ ఆగిపోయిన అశ్వద్దామని పూర్తి చేసే పనిలో ఉణ్నతను, ఆతర్వాత రెబల్ స్టార్ తో సినిమా చేయొచ్చనే అంచనాలున్నాయి. కేవలం ఇలా పొగిడాడని కాదు, గతంలో ఒక ఇంటర్వూలో ప్రభాస్ కి సూటయ్యే కథ తన దగ్గరుందన్న మాటలు, ఇప్పుడు మళ్లీ వైరలవటం చూస్తుంటే, ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయటం కన్ఫామ్ అయ్యేలా ఉంది.