3000 కోట్ల కల.. కర్ణుడు కన్నెర్ర చేస్తే..!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నడూ చూడని నెంబర్ చూసేలా చేసిన స్టార్ ప్రబాస్. తన బాహుబలి 2 తో 1850 కోట్ల రికార్డు ని అక్కడ కూర్చోబెట్టాడు..

Post Published By: dialnews
Updated : 28 March 2026, 6:20 PM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నడూ చూడని నెంబర్ చూసేలా చేసిన స్టార్ ప్రబాస్. తన బాహుబలి 2 తో 1850 కోట్ల రికార్డు ని అక్కడ కూర్చోబెట్టాడు.. రాజమౌళి వల్లే ఇదంతా జరిగినా.. తనలాంటి కటౌట్ పడితే, 1000 కోట్ల సినిమా కూడా 2 వేల కోట్ల కంటెంట్ గా మారుతుందని బాహుబలి 2 తో తేలింది...దంగల్ కి 2 వేల కోట్ల రికార్డు ఉన్నా, 1200 కోట్ల చైనా వసూళ్లు పక్కన పెడితే, ఈ మూవీ బాహుబలి 2 దరి దాపుల్లోకి కూడా రాదు.. కాని ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2, కల్కీని కలపాల్సిన టైం వచ్చినట్టుంది. 1850 కోట్లు 1200 కోట్లు కలిస్తే 3 వేల కోట్ల టాలీవుడ్ డ్రీమ్ తీరే ఛాన్స్ఉంది. ఆ భారమంతా ఇప్పుడు కర్ణుడి మీదే పడిందా? కర్ణుడిగా 1200 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్, కల్కీ సీక్వెల్ తో 3 వేల కోట్ల భారం మోయబోతున్నాడా? ఇంతకి 3 వేల కోట్ల భారం తనెందుకు మోయాలి?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కంప్లీట్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లాడు. ఫౌజీ లేదు.. స్పిరిట్ లేదు..అంతా కల్కీ.. కల్కీ.. కల్కీ... కర్ణుడిగా ఇప్పడుు తను సెట్లో బిజీ.. కాని ఎందుకు ఈ సైలెన్స్.. అంతగా తనేం చేస్తున్నాడు.. అన్నీంటికి ఒకటే సమాధానం. కల్కీ మూవీని వచ్చే మార్చ్ లో రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఎలాంటి ఎనౌన్స్ మెంట్లు ఇచ్చినా.. ఇంటర్నల్ గా ఇలాంటి ప్లాన్ తోనే నాగ్ అశ్విన్ టీం ముందుకెళుతోందని తెలుస్తోంది.అందుక్కారణం, కల్కీ 30శాతం షూటింగ్ అయిపోయింది. 40శాతం షూటింగ్ ని ఈ మూడు నెలల్లో పూర్తి చేయాలనుకోవటం వెనక, ముందు గ్రాఫిక్స్ పార్ట్ పూర్తి చేయాలనే కండీషన్ ఉందని తెలుస్తోంది. అయినా ఫౌజీ ఇంకొన్ని రోజులు షూట్ చేస్తే పూర్తువుతుంది. సందీప్ రెడ్డి వంగ కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం, ప్రబాస్ మరో మూవీ చేయకూడదు.

అలా చూస్తే ఇప్పుడు స్పిరిట్ తోనే ప్రభాస్ బిజీ అవ్వాలి.. అలా కాకుండా కల్కీ సీక్వెల్ షూటింగ్ ని ముందు గా మొదలుపెట్టటానికి కారనం, స్పిరిట్ లో తన లుక్ మారబోతుండట.. ఔను భారీగా మజిల్స్ పెంచి, కనిపించాల్సిన సీక్వెన్స్ వల్లే, ప్రబాస్ లుక్ మారబోతోందట. అలా మారితే, స్పిరిట్ షూటింగ్ కే పరిమితమయ్యే ఛాన్స్ఉంది. కల్కీ లో తన లుక్ కి ఇది కంప్లీట్ రివర్స్ లుక్..సో కల్కీ 2 పెండింగ్ 70శాతం షూటింగ్ కోసం మరో ఏడాది ఆగాలి.. అందుకే ఆల్ ఆఫ్ సడన్ గా నాగ్ అశ్విన్ టీం, కల్కీ 2 ని మొదలు పెట్టింది. ఇక కల్కీ 2 సీక్వెల్ కథతో, వారణాసి కి చాలా సిమిలారిటీస్ ఉండటంతో, అది కల్కీ 2 ని ఎఫెక్ట్ చేస్తుందనే, ఇలా చేస్తున్నారనే మరో వాదనుంది.

కాకపోతే, కలిసొచ్చిన ఏ సినిమా అయినా సీక్వెల్ రూపంలో వస్తే అందకు కనీసం రెండు మూడు రెట్లు వసూల్ల వరదొచ్చే ఛాన్స్ఉంది. అలాకూడా రెబల్ స్టార్ మార్కెట్ లో ఊపు తెచ్చేందుకు కూడా ఫౌజీ, స్పిరిట్ కంటే ముందు కల్కీ 2 ని రిలీజ్ చేయాలనకుంటున్నాట్టు తెలుస్తోంది. స్పిరిట్ రిలీజ్ కి ముందు ఒక సాలిడ్ హిట్ ఉంటే, దాని ఇంపాక్ట్ తో స్పిరిట్ వేవ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.ఇవన్నీ విచిత్రంగా అనిపించినా, 1000కోట్లు వచ్చే దగ్గర 2 వేల కోట్లు వచ్చే ఛాన్స్ఉంటే దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం కామన్. అందుకే 1200 కోట్ల కల్కీ, 2400 కోట్ల నుంచి 3 వేల కోట్ల హిట్ గా మారే అవకాశం ఉంది కాబట్టే, కల్కీ 2 విషయంలో నాగ్ అశ్విన్ సడన్ గా స్పీడప్ చేస్తున్నాడనే మరో కోణంలో వార్తలు వైరలౌతున్నాయి.

Published : 
  • 28 March 2026, 6:20 PM IST