దసరాకు గన్ పేలిస్తే.. క్రిస్మస్ కి బుల్లెట్ దిగాల్సిందే…!

రెబల్ స్టార్ ప్రభాస్ చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వస్తా అన్నాడు. ఇటలీ వెళ్లాడు. కట్ చేస్తే వచ్చి కల్కీ 2 కోసం 15 రోజులు కష్టపడబోతున్నాడని తేలింది. తర్వాత స్పిరిట్ కోసం డేట్లు కేటాయిస్తాడా? ఫౌజీ కొత్త షెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్నది తేలుతుంది.

Post Published By: dialnews
Updated : 3 April 2026, 8:20 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వస్తా అన్నాడు. ఇటలీ వెళ్లాడు. కట్ చేస్తే వచ్చి కల్కీ 2 కోసం 15 రోజులు కష్టపడబోతున్నాడని తేలింది. తర్వాత స్పిరిట్ కోసం డేట్లు కేటాయిస్తాడా? ఫౌజీ కొత్త షెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్నది తేలుతుంది. ఇలాంటి టైంలో పిడుగులాంటి వార్తా.. అదే ఫౌజీ మూవీ దసరా నుంచి క్రిస్మస్ కి వాయిదా అంటూ ప్రచారం పెరిగింది. ఇందులో నిజమున్నట్టే కనిపిస్తోంది. కారణం షూటింగ్ డిలేనో, పోస్ట్ ప్రొడక్షన్ కి టైం కావాల్సి వచ్చో కాదు... అంతకు మించిన రీజన్ తో రెబల్ స్టారే రిలీజ్ డేట్ వాయిదా వేయించాడా? సలార్ టైంలో ఎడిటింగ్ రూమ్ లో గంటలు గంటలు కూర్చున్న ప్రభాస్, కల్కీ విషయంలో ఇలానే తన పూర్తి ఫోకస్ మూవీ మీద పెట్టాడు.. కట్ చేస్తే రెండూ హిట్లే.. ఇప్పడు మళ్లీ ఫౌజీ, కల్కీ2, స్పిరిట్ విషయంలో తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడా? దీనికి ఫౌజీ వాయిదాకి లీంకేంటి? ఆ నిర్ణయం ఎలా ప్రభాస్ కి కలిసొస్తుంది?

రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్న మూవీ ఫౌజీ. దసరాకే రిలీజ్ అన్నారు. ఈనెల్లో ఏదైనా పెద్ద అప్ డేట్ వచ్చే చాన్స్ఉందన్నారు. తీరా చూస్తే, దసరాకురిలీజ్ అనుకున్న ఫౌజీని క్రిస్మస్ కి అంటే డిసెంబర్ కి వాయిదా వేసేలా ఉన్నారన్నారు. ఇది మాత్ర దర్శక నిర్మాతల నిర్ణయం కాదు.. పూర్తిగా రెబల్ స్టార్ ప్రభాస్ నిర్ణయమే అని తెలుస్తోంది.ఫౌజీ రీసెంట్ షెడ్యూల్ పూర్తి చేసి సమ్మర్ వెకేషన్ కి ఇటలీ వెళ్లిన ప్రబాస్, తర్వాత తిరిగొచ్చి, కల్కీ2 షెడ్యూల్ తో బిజీ అవ్వొచ్చు.. మోస్ట్ టీ వారం తర్వాత అంటే ఈనెల 10 నుంచి కల్కీ 2 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఆతర్వాత ఫౌజీ షెడ్యూల్ కోసం డేట్లు కేటాయిస్తాడా? సందీప్ రెడ్డి స్పిరిట్ కోసం డేట్లు కేటాయిస్తాడా అన్నది తర్వతే తేలుతుంది.

ఐతే ఇప్పుడు దసరాకు రిలీజ్ అనుకున్న ఫౌజీ రిలీజ్ డేట్, ని క్రిస్మస్ కి మార్చటం వెనకున్న రీజనేంటి? ఇదే షాకింగ్ డిసీజన్ అంటున్నారు. సరే షూటింగ్ డిలే అవుతోంది.. పోస్ట్ ప్రొడక్షన్ డిలే అయ్యేలా ఉంది.. కాబట్టే ఇలా వాయిదా వేస్తున్నరంటే, కరెక్ట్ గా 2 నెల్లు ఫోకస్ చేస్తే ఫౌజీ షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్యార్ లల్ గానే చేస్తున్నారు.అది కూడా 50 శాతం వరకు పూర్తైంది.. ఓరకంగా దసరాకు కనీసం రెండు నెల్ల ముందే ఫస్ట్ కాపీ రెడీ కావొచ్చని తెలుస్తోంది. అయినా దసరా కాదని, క్రిస్మస్ కే ఫౌజీ ని వాయిదా వేస్తున్నారు. కారణం ఐమ్యాక్స్ వర్షన్ కోసమే అని తెలుస్తోంది. ఈరోజుల్లో పాన్ ఇండియాన నుంచి పాన్ వరల్డ్ లెవల్ కి వెళ్లాలంటే, ఇలాంటి టెక్నికల్ ఎట్రాక్షన్ ఏదో ఉండాలి.

దీనికి తోడు, ఫౌజీ కూడా ఏదో పీరియాడికల్ వార్ డ్రామా కాదు.. వార్ యాక్షన డ్రామా అవటంతో, ఐమ్యాక్స్ వర్షన్ ని వదలకూడదనే నిర్ణయం తీసుకున్నాడట రెబల్ స్టార్. అంటే ఐమ్యాక్స్ వర్షన్ రెడీ అవటానికి టైం పడుతుందా అంటే, అదేంలేదు.. దసరాలోపే ఐమ్యాక్స్ వర్షన్ లోకి ఫౌజీని మార్చటం కూడా జరిగే ఛాన్స్ఉంది. కాని సమస్య అది కాదు, ఐమ్యాక్స్ థియేటర్స్ దొరకాలి. ప్రపంచవ్యాప్తంగా 1750 వరకు ఐమ్యాక్స్ థియేటర్స్ ఉన్నాయి. ఇందులో కనీసం సగం దొరకాలన్నీ డిసెంబర్ వరకు వేయిట్ చేయాలి... అందుకే దసరా నుంచి ఫౌజీని క్రిస్మస్ కి వాయిదా వేస్తోందట ఫిల్మ్ టీం.

Published : 
  • 3 April 2026, 8:20 PM IST