ఒకప్పుడు న్యూస్ రీడర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.!

సినిమా పరిశ్రమలో ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లు అనేవి ఎప్పుడూ ఆసక్తికరమైన అంశాలే. ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి, సంబంధాలలో ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు.

Post Published By: dialnews
Updated : 20 August 2026, 5:04 PM IST

సినిమా పరిశ్రమలో ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లు అనేవి ఎప్పుడూ ఆసక్తికరమైన అంశాలే. ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి, సంబంధాలలో ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియా భవానీ శంకర్, ప్రేమ మరియు రిలేషన్‌షిప్స్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. "అమ్మాయిలు ప్రేమలో పడే ముందే తమకు ఏం కావాలో పూర్తి స్పష్టత కలిగి ఉండాలి. బంధంలో రాజీ పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఒకవేళ భాగస్వామి ప్రవర్తన మీకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నా, లేదా ఆ సంబంధం ఒక భారంగా అనిపించినా, దాన్ని అక్కడితో ముగించి ముందుకు సాగడమే ఉత్తమం" అని ఆమె అభిప్రాయపడ్డారు.

తన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలోచించకుండా బంధాన్ని తెంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం రాజ్‌వేల్ రాజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కాలేజీ రోజుల్లోనే ప్రారంభమైన వీరి ప్రేమాయణం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో తన ప్రియుడితో ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉండే ప్రియ, పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నపై మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పడం ఆమె నైజం. చెన్నైకి చెందిన ప్రియా భవానీ శంకర్ తన కెరీర్‌ను తమిళ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా ప్రారంభించారు.

ఆ తర్వాత విజయ్ టీవీలోని 'కల్యాణం ముదల్ కాదల్ వరై' సీరియల్ ద్వారా నటిగా మారారు. 2017లో 'మేయాద మాన్' సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, కడైకుట్టి సింగమ్, మాన్‌స్టర్, తిరుచిత్రంబలం, డిమోంటే కాలనీ 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగులో కళ్యాణం కమనీయం, భీమా, జీబ్రా వంటి చిత్రాలలో నటించినప్పటికీ, ఆమెకు ఆశించిన స్థాయిలో టాలీవుడ్‌ అవకాశాలు రాలేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిచ్చే ప్రియ, మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన 'ఇరుముడి' సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో తెలుగులో మంచి కంబ్యాక్ ఇస్తానని ఆమె ఆశిస్తున్నారు.

Published : 
  • 20 August 2026, 5:04 PM IST