త్రిబుల్ ఆర్ తో రాముడిగా ఒక్కసారి తన లుక్ మారగానే థియేటర్స్ లో పూనాకాలొచ్చాయి... అప్పటి వరకు త్రిబుల్ ఆర్ లో పెర్ఫామెన్స్ పరంగా, పాత్ర పరంగా డామినేషన్ అంతా భీముడిదే.. అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దే. కట్ చేస్తే ఒక్క రాముడి గెటప్ సీన్ తో మెగా పవర్ స్టార్ లెవలే మారిపోయింది. కట్ చేస్తే ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫెల్యూర్స్ తర్వాత వస్తున్న పెద్దితో, సడన్ గా ఒక చిన్న ఛేంజ్ తన రేంజ్ నే మార్చేలా ఉంది.. ఒక్క లుక్ ఒకే ఒక్క లుక్ తో నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ లో కూడా పూనాకాలు వస్తున్నాయి.. ఖాన్లు, కపర్లు, ఆఖరిని హ్రితిక్ రోషన్ ని కూడా డామినేట్ చేస్తున్న రామ్ చరణ్ అంటున్నారు. పెద్ది మూవీ పాటలు, టీజర్ అన్నీ పర్లేదనిపించేలా ఉంటే.. పెహెల్మాన్ గా ఫస్ట్ టైం కనిపించిన రామ్ చరణ్, ఊర మాస్ లుక్ లో నిజంగానే షాక్ ఇస్తున్నాడు.. ఇక్కడ కొడితే, సౌండ్ డిల్లీలో వస్తోంది... ఈ రీసౌండ్ ఏంటో చూసేయండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ఫోటో తన ఫేట్ నే మార్చేలా ఉంది. మజిల్స్ పెంచటం, భారీ లుక్ తో రావటం వేరు, పూనకాలు తెప్పించేంత మాసీ లుక్ తో షాక్ ఇవ్వటం వేరు.. అలాంటి షాకింగ్ కంటెంట్ తో ఈసారి హనుమాన్ గా మారేలా ఉన్నాడు. ఔను త్రిబుల్ ఆర్ లో కాసేపే రాముడిగా కనిపించే సీన్ తో మెగా పవర్ స్టార్ పూనకాలు తెప్పించాడు.ఇప్పుడు హనుమంతుడిగా మారాడు. నిజానికి త్రిబుల్ ఆర్ లో సినిమా అంత ఎన్టీఆర్ పాత్ర భీమ్ డామినేషనే కనిపిస్తుంది. ఆ పాత్రకే ఎక్కువ జనాల్లో సాఫ్ట్ కార్నల్ కనిపించింది. కాని క్లైమాక్స్ వచ్చాకే, రాముడి లుక్ లో యాక్షన్ సీక్వెన్స్ వచ్చాకే, లెక్క మారింది. నార్త్ ఇండియాలో రామ్ చరణ్ ని రాముడిగా ఫిక్స్ అయిపోయారు. అంతగా ఆ లుక్ వాల్లలో పూనకాలు తెప్పించింది. అంతగా ఎక్కేసింది.
కట్ చేస్తే, ఇప్పుడు పెద్ది మూవీలో తన లుక్ కి మామూలు రెస్పాన్స్ రావట్లేదు.. అసలే ఆచార్య, గేమ్ ఛేంజర్ తోబ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేశాడు రామ్ చరణ్. తన ఫ్రెండ్ ఎన్టీఆర్ మాత్రం దేవరతో ఏకంగా రాజమౌలి సెంటిమెంట్ నే బ్రేక్ చేశాడు. డ్రాగన్ రెండు భాగాలషూటింగ్ తో పాటు, గాడ్ ఆఫ్ వార్, దేవర2 ప్లానింగ్ లో ఉన్నాడు.కాని చరణ్ మాత్రం హిట్ కోసం కల్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఆప్రాసెస్ లోనే ఆటకూలి కాన్సెప్ట్ తో పెద్ది మూవీ చేస్తున్నాడు. వరుసగా ఫెల్యూర్స్ వచ్చాయి కాబట్టి, ఇది మూడోసారి మసి అంటూ నెగెటివ్ కామెంట్లు చేసే బ్యాచ్ కూడా ట్రోలింగ్స్ పెంచేసింది. పెద్ది పాట పేలినా.. టీజర్ పర్లేదనిపించినా.. పాన్ ఇండియా షేక్ అయ్యేంత కంటెంట్ కష్టం అన్నారు. అంటున్నారు.
అలాంటి కామెంట్లకి, ఒక్కలుక్ ఒకే ఒక్క లుక్... గదతో ఊర మాస్ లుక్ లో హెవీ మజిల్స్ తో ఖాన్లు, కపూర్లు, రోషన్లను కూడా మించిపోయాడు రామ్ చరణ్. ఎప్పుడూ నెగెటీవ్ కామెంట్స్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యే తనకి, కేవలం ఈ కొత్త ప్రోమో అంతా ఫిదా అయ్యేలా ఛేసింది. అసలు తను గధ పట్టుకోవటం, పహెల్మాన్ లా దూసుకొచ్చేయటం చూస్తుంటే, సల్మాన్ నుంచి హ్రితిక్ వరకు చాలా మంది హీరోల లుక్ కంటే ఎక్కువ మాస్ అప్పీల్ కనిపిస్తోందంటున్నారు. చాలా కాలం తర్వాత అంటే త్రిబుల్ ఆర్ లో తను రాముడిగా కిక్ ఇచ్చిన తర్వాత, మల్లీ ఇలా హనుమంతుడిలా నార్త్ లోపూనకాలు తెప్పించేస్తున్నాడు. ఈ ప్రోమో ఇక్కడ పేలితే, ఢిల్లీలో రీసౌండ్ వస్తోంది.