రెబల్ స్టార్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ను ఎప్పటినుంచో వెంటాడుతున్న ఒక ప్రశ్న... ‘బాహుబలి’ తర్వాత ఆ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ షేక్ చెయగల కాంబినేషన్ ఏది అని. దానికి సమాధానంగా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతున్న ఒకే పేరు స్పిరిట్. స్పిరిట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. వంగ అంటేనే ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, రా ఎమోషన్, బోల్డ్ ట్రీట్మెంట్… మరి ప్రభాస్ అంటే పాన్-ఇండియా లెవెల్లో పిచ్చ క్రేజ్.
ఇలాంటి ఇద్దరూ కలిసి వస్తే థియేటర్‌లో రచ్చ ఖాయం అని ఫ్యాన్స్ ఫుల్ హోప్‌లో ఉన్నారు.ఇప్పటికే బయటికి వచ్చిన కంటెంట్ చూస్తే, ‘Spirit’లో మాస్ ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా ఒక గట్టి మూడ్, ఒక డార్క్ ఎనర్జీ, ఒక హై-టెన్షన్ వరల్డ్ బిల్డ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకు పీక్‌లో ఉన్నాయంటేమొదటి రీజన్, ప్రభాస్ కెరీర్‌లో ఇది మరో డిఫరెంట్ షేడ్ చూపించే ఛాన్స్.
రెండవది, సందీప్ రెడ్డి స్టైల్‌లో క్యారెక్టర్ డిజైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హీరోని ‘హీరో’లా కాదు, ‘మనిషి’లా చూపిస్తాడు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ని కొందరు అభిమానులు పోలీస్ రోల్ లో చూడాలనుకుంటే, మరికొందరు గ్రే షేడ్ క్యారెక్టర్ కోరుకుంటున్నారు. త్రిప్తి దిమ్రి హీరోని గా నటిస్తున్న ఈ సెన్సేషన్ మూవీలో ప్రభాస్ ఎలాంటి క్యారెక్టర్లో నటిస్తే బావుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.