బిగ్ బాస్ 10 ఎవరికి ఎంత?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కామనర్ల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Post Published By: dialnews
Updated : 8 September 2026, 3:00 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కామనర్ల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లకు అందే రెమ్యునరేషన్ల గురించిన వార్తలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షోలో ఎలిమినేట్ అయినా లేదా ఫైనల్ వరకు ఉన్నా, ఒప్పందంలోని మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించరని స్పష్టమవుతోంది. ఎలిమినేషన్ లేదా ఫైనల్ తర్వాత నిర్దిష్ట సమయంలో 80 శాతం మొత్తాన్ని ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన 20 శాతం మొత్తాన్ని మాత్రం షో నిబంధనలు అన్నీ పాటించిన తర్వాతే విడుదల చేస్తారని సమాచారం ఉంది.

ఈ సీజన్‌లో జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ అత్యధికంగా వారానికి 4.5 లక్షలు అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న 16 మంది కంటెస్టెంట్లలో రాంప్రసాద్‌దే టాప్ రెమ్యునరేషన్ అని ప్రచారం జరుగుతోంది. ఆయన కామెడీ టైమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ పంచే విధానం బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సోషల్ మీడియాలో ఉన్న ఆయన భారీ ఫాలోయింగ్ కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్‌కు ముఖ్య కారణం అని చెబుతున్నారు. ఇక యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కు వారానికి 3.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో ముకేష్ గౌడకు వారానికి 3 లక్షల భారీ పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ జాబితాలో మరికొందరు ప్రముఖులు కూడా భారీగానే పారితోషికాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. దేబ్జాని మోడక్, త్రిగున్ వంటి వారికి వారానికి 2.75 లక్షల వరకు చెల్లిస్తున్నారట. జబర్దస్త్ నరేష్, సీరియల్ నటి చైత్ర రాయ్‌లకు వారానికి 2.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టెంపర్ వంశీ మరియు నటుడు కృష్ణుడికి కూడా వారానికి 2 లక్షలు ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే పాడ్‌కాస్ట్ హోస్ట్ సుధీర్ రెడ్డికి వారానికి సుమారు 1.25 లక్షలు ముడుతున్నట్లు సమాచారం అందుతోంది. వీరందరి ఎంట్రీలతో ఈసారి హౌస్‌లో రసవత్తరమైన పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈసారి సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కామనర్ల కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ కూడా అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. 'అగ్నిపరిక్ష' వేదిక ద్వారా ఎంపికైన రూన్సీ, శాలిని, సృష్టి, రోహిత్, ఆర్జే చరణ్, అమన్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.ఈ ఆరుగురు కామనర్లకు ఒక్కొక్కరికి వారానికి 70 వేల వరకు పారితోషకం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీలతో సమానంగా వీరు హౌస్‌లో ఎలాంటి గేమ్‌ ఆడతారనేది ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. ఈ లెక్కలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి స్పష్టత వస్తుంది. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధమవుతోంది.

Published : 
  • 8 September 2026, 3:00 PM IST