అగ్నిపర్వతం బద్దలే.. టీజర్ టైమ్ బాంబ్..!

వారణాసి టీం సైలెంట్ గా టైం బాంబ్ రెడీ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు టైం బాంబ్స్ ని డిజైన్ చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ్ బాబు సమ్మర్ వేకేషన్ కి, ఫారెన్ వెళ్లాడు. నెల సెలవుల తర్వాత జూన్ లో ల్యాండ్ కాబోతున్నాడు.

Post Published By: dialnews
Updated : 22 April 2026, 6:50 PM IST

వారణాసి టీం సైలెంట్ గా టైం బాంబ్ రెడీ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు టైం బాంబ్స్ ని డిజైన్ చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ్ బాబు సమ్మర్ వేకేషన్ కి, ఫారెన్ వెళ్లాడు. నెల సెలవుల తర్వాత జూన్ లో ల్యాండ్ కాబోతున్నాడు. అంతా తన లుక్ మరో సారి మార్చుకునేందుకేఅనంటున్నారు. అదెలా ఉన్నా జూన్ లో భూమ్ బద్దలయ్యే అప్ డేట్స్ రాబోతున్నాయి.. టీజర్ టైం బాంబ్ అప్ డేట్ రూపంలో జూన్ లోనే పేలబోతున్నట్టు తెలుస్తోంది. అంటే టీజర్ రిలీజ్ డేట్ ని జూన్ లోనే ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాన్నే కాస్త వెరైటీగా పోస్టర్ రిలీజ్ చేసి, ఎనౌన్స్ చేసేందుకు రాజమౌళి టీం రెడీ అవుతోంది. ఆ పోస్టర్ లో డైనోసార్ ఉంటే ఎలా ఉంటుంది... అదే విషయం బయటికి పొక్కటంతోనే, అగ్నిపర్వతం బద్దలయ్యే అప్ డేట్ రాబోతోందన్న క్లారిటీ వచ్చేస్తోంది.

వారణాసి మూవీ టీం అగ్నిపర్వతం బద్దలయ్యే అప్ డేట్ తో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఒక్కసారి ఊహించుకోండి.. డైనోసార్ మీద సూపర్ స్టార్ మహేశ్ బాబు కౌబాయ్ లుక్ లో ఉంటే... అలాంటి పోస్టర్ వస్తే, బూమ్ బద్దలే... తన తండ్రి సూపర్ స్టార్ ఇండియన్ సినిమాకు కౌబాయ్ జోనర్ ని పరిచయం చేశాడు. అలాంటి లుక్ లోనే మహేశ్ బాబు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి డైనోసార్లను పరిచయం చేసే సాహసం చేస్తున్నాడు.ఔను డైనోసార్ మీద కౌబాయ్ లుక్ లో మహేశ్ వస్తే, దేశంలోనే, కాదు వరల్డ్ వైడ్ గా ఆ పోస్టర్ వైరలౌతుంది... ఇంతవరకు ఎవరూ చేయని సాహసమిది.. అలాని అంత పెద్ద డైనోసార్ మీద హీరో కూర్చోవటం మరీ అతిశయంగా అనిపించొచ్చు.. కాకపోతే జురాసిక్ వరల్డ్ లో లానే, డైనోసార్ పిల్లని ఇందులో వాడబోతున్నారట. దానిమీదే హీరో స్వారి చేస్తాడని తెలుస్తోంది.

ఓరకంగా జురాసిక్ వరల్డ్ లో బ్లూ డైనోసార్ ప్రేరణతోనే ఆ ఎపిసోడ్ పెట్టినట్టు ఇండస్ట్రీలో టాక్ కిక్ ఇస్తోంది. ఏదేమైనా ఆ పోస్టర్ జూన్ లో రాబోతోంది. కేవలం పోస్టర్ ని రిలీజ్ చేయటం కాదు, అందులో టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. అంతేకాదు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా వారణాసి టీజర్ లాంచ్ చేయాలన్న రాజమౌళి కల కూడా నెరవేరేలా ఉంది.ప్రసెంట్ వారణాసి షూటింగ్ కి బ్రేక్ పడింది. సమ్మర్ వెకేషన్ కోసం మహేశ్ బాబు కూడా లాజ్ ఏంజిల్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఐతే ఇది తన లుక్ మార్పుకోసం ప్లాన్ చేసిన వెకేషన్ అనంటున్నారు. వారణాసిలో మహేశ్ బాబు చాలా గెటప్స్ లోకనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పుడున్న లుక్ కాకుండా, కొత్త లుక్ కోసం నెలరోజుల్లో మహేశ్ మారిపోతాడని, అందుకే అమెరికా వెళ్లాడని ప్రచారం జరుగుతోంది.ఇక తను రాగానే, వారణాసి టీం, జూన్ లో వారణాసి కొత్త పోస్టర్ రివీల్ చేయబోతోంది ఫిల్మ్ టీం. అంతేకాదు మోస్ట్ లీ ఆగస్ట్ 15కే టీజర్ లాంచ్ అన్న ఎనౌన్స్ మెంట్ కూడా అందులో ఉండబోతోంది. అందుకు నెలరోజుల ముందు అంటే జులై 15న వారణాసి గ్లింప్స్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే పోస్టర్, టీజర్, గ్లింప్స్ ఇలా మూడు సర్ ప్రైజులని జూన్ నుంచి మొదలు పెట్టేలా ఉంది వారణాసి టీం.

Published : 
  • 22 April 2026, 6:50 PM IST