ఒక్కో టీజర్ లో… ఒక్కో గ్లోబల్ సూపర్ స్టార్..?

వారణాసి టీం భారీ తుఫాన్ ని రంగం సిద్దం చేస్తోంది. జూన్ ఫస్ట్ వీక్ లో ఏదో సాలిడ్ అప్ డేట్ రావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 10న భూమి బద్దలయ్యేలా ఏఐ లో వారణాసి టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి

Post Published By: dialnews
Updated : 25 May 2026, 6:55 PM IST

వారణాసి టీం భారీ తుఫాన్ ని రంగం సిద్దం చేస్తోంది. జూన్ ఫస్ట్ వీక్ లో ఏదో సాలిడ్ అప్ డేట్ రావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 10న భూమి బద్దలయ్యేలా ఏఐ లో వారణాసి టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాదు ఆగస్ట్ ఫస్ట్ వీక్, అలానే ఆగస్ట్ సెకండ్ వీకెండ్ లో మరో టీజర్.. ఇలా జూన్ 10 నుంచి ఆగస్ట్ 15 వరకు వరుసగా రెండు మూడు వారాలా గ్యాప్ లో మూడు టీజర్లు రాబోతున్నాయి.. అవి టీజర్లంటారో, ప్రోమోలంటారో పేరేదైనా, ఒక్కో టీజర్ లో ఒక్కో గ్లోబల్ సూపర్ స్టార్ ని పరిచయం చేయబోతున్నాడు రాజమౌళి. ముందు ఏఐతో పాత్రలని పరిచయం చేసి, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అవతార్ 4 సెట్లో హంగామా చేయబోతోంది జక్కన్న టీం. ఇవే విషయాలను, కర్టెన్ రైజర్ గా జూన్ 1 కి రివీల్ చేయబోతున్నారా? ఇంతకి జూన్ 10న భూమ్ బద్దలంటే అర్ధమేంటి? ఆ డేట్ స్పెషాలిటీ ఏంటి?

ఒక్క హీరో, మూడు పాత్రలు... ఒక్కో టీజర్ లో ఒక్కో పాత్ర.. ఇదే వారణాసి వరాల వెళ్లువ.. జూన్ 10న మొదలై, ఆగస్ట్ 15 కి ముగుస్తుంది.. ఇంతవరకు ఏ సినిమా అయినా ఒక టీజర్ వదలటం చూశాం.. రెండు ట్రైలర్లను లాంచ్ చేయటం చూశాం.. కాని వారనాసి టీం మూడు టీజర్లు ప్లాన్ చేస్తోంది. ఈ ఎనౌన్స్ మెంట్ మోస్ట్ లీ జూన్ ఫస్ట్ లేదా, సెకండ్ కి రావటం ఆల్ మోస్ట్ ఖాయంగా కనిపిస్తోంది.నిజానికి జూన్ నుంచే వారణాసి వరల్డ్ ప్రమోషన్ ని కాస్త స్పీడప్ చేయాలనేది రాజమౌళి ప్లాన్. ఆల్రెడీ గతంలో గ్లింప్స్ భారీ ఈవెంట్ తో లాంచ్ చేశాడు. అమెరికన్ యూ ట్యూబర్స్ కి వారణాసి టీం ఇంటర్వూలు ఇచ్చేసింది. ఇప్పుడు మెక్సికో ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత పారిస్ ఫిల్మ్ ఫెస్ట్ లో ప్రమోషన్ కోసం జక్కన్న టిం రెడీ అవుతోంది. అది కూడా 10 వేల మంది డాన్సర్లతో భారీ సాంగ్ షూటింగ్ చేసిన వెంటనే.. అంటే మోస్ట్ లీ జులైలో.

డ్రాగన్ గ్లింప్స్ ఏరేంజ్ లో ఇండియాని షేక్ చేస్తోందో చూస్తున్నాం. ఇక రాజమౌలి కూడా ఇలాంటి ప్రయత్నమే ఏదో చేసేలా ఉన్నాడు. అలాని డ్రాగన్ లా భారీ గ్లింప్స్ అనికాదు.. అలాంటిదే కాని అంతకుమించేలా, మూడు టీజర్లు లాంచ్ చేయాలనేది ఇనీషియల్ ఐడియా అని తెలుస్తోంది..జూన్ 10, ఆగస్ట్ మొదటి వారం, తర్వాత ఆగస్ట్ 15 ఈ మూడు ముహుర్తాల్లో మూడు టీజర్లు.. ఒక్కో టీజర్ లో ఒక్కో మహేశ్ బాబు ... రాముడిగా, శివుడిగా, మామూలు సాహసికుడిగా, ఇలా మూడు పాత్రలు వేస్తున్న మహేశ్ బాబుని, మూడు టీజర్లతో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడట రాజమౌళి. మరి జూన్ 10నే ఎందుకు మొదటి టీజరనేది ఇంకా అర్ధం కాని ప్రశ్నే.

కాకపోతే జూన్ 10న రిలీజ్ చేసే టీజర్ లో ఏఐ వీడియో, అలానే మేకింగ్ వీడియో రెండూ మిక్స్ చేసి రిలీజ్ చేస్తారని ఫీలర్స్ వస్తున్నాయి. ఆగస్ట్ మొదటి వారంలో, అది హాలీవుడ్ లో రెండో టీజర్ వచ్చే ఛాన్స్ఉంది. అవతార్ 4 మూవీ షూటింగ్ ఆగస్ట్ లో మొదలౌతుంది. అప్పుడే ఆ సెట్ కి వెళ్లి వారణాసి టీం రెండో టీజర్ లాంచ్ చేయాలనుకుంటోందట.ఎందుకంటే అవతార్ 2 వే ఆఫ్ వాటర్ లో వాడిన అండర్ వాటర్ టెక్నాలజీని వారణాసి లో ఒక పాటకి వాడబోతోంది రాజమౌళి టీం. సో ఆ విషయం ఇలా జేమ్స్ కామెరున్ చేతుల మీదుటా టీజర్ లాంచ్ చేసి, ఎనౌన్స్ చేయబోతున్నారట. అలా వరల్డ్ ఆడియన్స్ లోభారీగా వారణాసిని ప్రమోట్ చేసినట్టౌతుంది. అలానే ఆగస్ట్ 15న మరో టీజర్.. ఈ మూడు టీజర్లలో మహేశ్ బాబు మూడు పాత్రలని విడివిడిగా పరిచయం చేస్తూ. మెల్లిగా వారణాసి ప్రమోషన్ లోఎమోషన్ పెంచే ప్రయత్నం చేయబోతున్నాడు రాజమౌళి... అందుకే తగ్గ ఏర్పాట్లైతే జరుగుతున్నాయి... జూన్ 1 కి మోస్ట్ లీ ఎనౌన్స్ మెంట్ భారీగానే రావొచ్చు.. మొదటి టీజర్ జూన్ 10నే రావొచ్చు.. కాకపోతే, అప్పుడే మొదటి టీజర్ ఎందుకు లాంచ్ చేయబోతున్నారో, రిలీజ్ అయితే కానిచెప్పలేం.

Published : 
  • 25 May 2026, 6:55 PM IST