రెబల్ స్టార్ ని గుండుతో ఒక సారి ఊహించుకోండి.. ముందుఫ్యాన్సే ఫైర్ అయ్యే ఛాన్స్ఉంది. కాని ఇది నిజం... స్పిరిట్ లో ప్రభాస్ లుక్ మీద గతంలో వచ్చిన రూమర్స్ ని, సందీప్ రెడ్డి మరింత నిజం చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ స్పిరిట్ పోస్టర్ వల్ల తన లుక్ ఎలా ఉంటుందో ఈపాటికే జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది. మళ్లీ గుండు కథేంటని ఎవరికైనా డౌట్ రాకుండా ఉండదు. కాని ఇదే నిజం. ఫస్ట్ టైం రెబల్ స్టార్ ప్రభాస్ ని జనం గుండుతో చూడబోతున్నారు. సందీప్ రెడ్డి ఇంత పెద్ద సాహసాన్ని చేస్తున్నాడు. సూపర్ మాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ ని ఇలా గుండుతో చూసేందుకు ఫ్యాన్న్స్ అంత ఈజీగా ఒప్పుకోరు.. అలాని అదేం తప్పుకాదు... సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా గుండుతో కనిపించాడు.మెగా స్టార్ కూడా గుండు ప్రయోగాన్ని ప్రమోషనల్ వీడియోలో చూపించాడు.. ఇంతకి ఫౌజీ ఎప్పుడు, కల్కీ 2 పూర్తయ్యేదెన్నడు లాంటి ప్రశ్నలు ఎదురౌతున్న టైంలో, సడన్ గా సీన్ లో కి రెబల్ స్టార్ గుండు వార్త వైరలయ్యేలా ఉంది. ఐతే ఒకటి ప్రభాస్ ని ఇంతవరకు అంతా డార్లింగ్ గా చూశారు.. ఛత్రపతి, బాహుబలి లాంటి సూపర్ మాసీవ్ పాత్రలో చూశారు.. కాని ప్రభాస్ లో విలనిజం ఎన్నడైనా చూశారా? అదే చూపిస్తానంటున్నాడు సందీప్ రెడ్డి వంగ... డెఫినెట్ గా స్పిరిట్ లో ప్రభాసే హీరో.. అలాని తనేం ఇందులో విలన్ అన్న సంకేతాలు రావట్లేదు.. కాని విలనిజం మాత్రం పక్క అని తెలుస్తోంది.
నున్నటి గుండూ...మెలేసినట్టు చాలా పెద్ద మీసాలు.. ఎన్నడూ ప్రభాస్ ని ఎవరూ అలా చూసి ఉండరు.. అలాంటి లుక్ ఎందుకు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నట్టు... మరి ఆల్రెడీ రివీల్ చేసిన పోస్టర్ లో ఆలుక్ ఎవరిది? ఈ ప్రశ్నలన్నీంటికి ఒకే సమాధానం.. ఇది డ్యూయెల్ రోల్ కాదు. ఇందులో ప్రభాస్ సింగిల్ రోల్ లో నే కనిపించబతున్నాడు.కాకపోతే పాత్ర, కథ ఆధారంగా, కొన్ని సిచ్చువేషన్స్ లో ప్రభాస్ గుండుతో కనిపించటం మాత్రం పక్కా అని సమాచారం అందుతోంది. ఒక దారి తప్పిన ఐపీఎస్ ఆఫీసర్ కథగానే స్పిరిట్ మూవీ వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ వచ్చిన ఆడియో టీజర్ తో అదేతేలింది.కాకపోతే, గుండు గోలేంటి? అక్కడికే వస్తున్నా... సొసైటీ దారి తప్పిందని, ఆ దారిలో నడిచే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి.. ఇది క్లుప్తంగా స్పిరిట్ స్టోరీలైన్ అని తెలుస్తోంది. ఇది ఆడియో టీజర్ విన్న ఎవరికైనా అర్ధమైపోతుంది.కాస్త సినిమా గ్నానం ఉన్న వాళ్లు కూడా ఇది గెస్ చేయొచ్చు.. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, రొటీన్ కి భిన్నంగా సందీప్ రెడ్డి హీరోలు ప్రవర్తిస్తుంటారు.. సో సొసైటి ఇలా ఉందని, తనకి ఇలా జరిగిందని ఏడ్చే హీరోయిజం తన మూవీలో ఉండదు.. అంతా తిరగబడటమే.
అందుకే స్పిరిట్ లో దెబ్బతిన్న పులిని పోస్టర్ లో చూపించిన సందీప్ రెడ్డి వంగ... గాయమైన పులి తిరిగి ఎలా పంజా విసురుతుందో, చూపించేప్పుడు మాత్రం ప్రభాస్ ని గుండుతో చూపించాలనుకుంటున్నాడట. మిలటరీ ఆఫసర్లలో కనిపించేమీసకట్టు తో ప్రభాస్ మరోసారి బాహుబలిని మించే రాజరికపు లుక్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే అది కూడా గుండుతూ..ఇక బిల్లాలో తప్ప ప్రభాస్ ఇంతవరకు ఎందులో నెగెటీవ్ రోల్ వేయలేదు. బిల్లాలో కూడా కాసేపే ఆపాత్ర నెగెటివ్ గా కనిపిస్తుంది. తర్వాత అంతమైపోతుంది. కాని యానిమల్ లో హీరో కమ్, విలన్ రెండు పాత్రలని నెగెటివ్ గా చూపించిన సందీప్, స్పిరిట్ లో ఒకే పాత్రలో ఆ రెండు షేడ్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
ఆ వేరియేషన్ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేందుకే, ఇలా తన లుక్ లో మార్పులు చేస్తున్నారట. అది కూడా కొంత షూటింగ్ అయ్యాక ప్రభాస్ తో చేసిన సెకండ్ లుక్ టెస్ట్ వల్లే ఇది కన్ఫామ్ అయ్యింది. నిజానికి ఈ మూవీలో 70శాతం మూవీలో గుండుతోనే కరడు గట్టిన యానిమల్ లా కనిపించబోతున్నాడు స్పిరిట్.. ఆ కటౌట్ కాస్త అగ్రెసివ్ గా కనిపిస్తేనే, బాహుబలి దర్బారు ఊగిపోయింది.. అలాంటిది సందీప్ రెడ్డి స్టైలాఫ్ హీరోయిజంలో ప్రభాస్ నెగెటీవ్ గా అగ్రసీవ్ గా కనిపిస్తే, కథ యావరేజ్ గా ఉన్నా, బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే.. అదే కథ కత్తిలా ఉంటే, ఆరేంజ్ టాక్ వస్తే... ఇక బాహుబలికి ఐదారు రెట్ల సునామీ గ్యారెంటీ.