పరశురాముడి’ పాత్రలో అనిమల్ హీరో…!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏదంటే.. అది నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణం'. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post Published By: dialnews
Updated : 7 March 2026, 11:35 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏదంటే.. అది నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణం'. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. రణబీర్ ఈ మూవీ పార్ట్-1 లో విష్ణుమూర్తి ఆరవ అవతారమైన 'పరశురాముడి' పాత్రలో కూడా కనిపిస్తారట! రామాయణంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం.

ముఖ్యంగా సీతా స్వయంవరం తర్వాత శివధనుస్సు విరిగినప్పుడు పరశురాముడు ఆగ్రహంతో రావడం, ఆ తర్వాత రాముడి అసలు తత్వాన్ని గుర్తించడం అనే ఘట్టం హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. రణబీర్ డ్యూయల్ షేడ్స్ లో కనిపిస్తారనే వార్త ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేసింది. దంగల్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు నితీష్ తివారీ ఈ కావ్యాన్ని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

రణబీర్ కపూర్, సాయి పల్లవి వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోనుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ పాత్ర కోసం రణబీర్ తన ఆహార్యాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ ఎంతో నిష్ఠతో ఈ పాత్రను పోషిస్తున్నారని టాక్. దర్శకుడు నితీష్ తివారీ ఈ కథను ఒక్క భాగంలో ముగించడం లేదు. రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని విపులంగా చూపించడానికి మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 850 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి.

విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్‌లో ఆస్కార్ గెలుచుకున్న 'DNEG' సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయోధ్య నగరాన్ని, లంకను సెట్స్ రూపంలో అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్ లా ఉండేలా గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సంగీతం విషయంలో కూడా ఈ సినిమా ఒక సంచలనం సృష్టించబోతోంది. మన దేశ గర్వకారణం ఎ.ఆర్. రెహమాన్ తో పాటు, హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ హన్స్ జిమ్మర్ కలిసి ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Published : 
  • 7 March 2026, 11:35 AM IST