PUSHPA 2: పుష్ప 2లో అసలు విలన్ ఎవరు..? జగదీష్ పాత్రతో నష్టమా..?

పుష్ప సీక్వెల్ పుష్ప రాజ్‌లో అసలు విలన్ కేశవే అంటున్నారు. నిజంగా సినిమాలో హీరోని వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్ కేశవే అంటూ అప్పట్లో అంతా అంచనాలు వేశారు. అది నిజమో కాదో తేలాలంటే పుష్ప 2 వచ్చాకే తేలుతుంది.

Post Published By: narender Thiru
Updated : 2 February 2024, 6:17 PM IST

PUSHPA 2: పుష్పలో హీరో పుష్పరాజ్.. హీరోయిన్ శ్రీవల్లి.. ఇక కేశవ ఫ్రెండు, సునీల్ అండ్ కో ఫస్ట్ హాఫ్ విలన్లు, భన్వర్ సింగ్ షెకావత్ చివర్లో వచ్చే విలన్.. ఫహద్ ఫాజిలే సీక్వెల్‌లో అసలు విలన్. ఇది పుష్ప హిట్ అయినప్పుడు జనాల్లో ఏర్పడ్డ ఇంప్రెషన్. కాని రియాలిటీ మరోలా ఉంది. పుష్ప సీక్వెల్ పుష్ప రాజ్‌లో అసలు విలన్ కేశవే అంటున్నారు. నిజంగా సినిమాలో హీరోని వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్ కేశవే అంటూ అప్పట్లో అంతా అంచనాలు వేశారు.

KALKI 2898 AD: ఇండియన్ ఆడియెన్స్ ఎదురు చూస్తోంది ఈ సినిమాల కోసమే..

అది నిజమో కాదో తేలాలంటే పుష్ప 2 వచ్చాకే తేలుతుంది. కాని పుష్ప 2 షూటింగ్ పూర్తికాకముందే కేశవే వెన్నుపోటు పొడిచే అసలు విలన్ అనంటున్నారు. ఇది సినిమా కథలో కాదు, రియల్‌గా జరుగుతున్న కథలో. పుష్ప 2 ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అందులో హీరోతో సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్‌లో కేశవగా జగధీష్ నటిస్తున్నాడు. అలాంటి జగదీష్.. మొన్న ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో జైలుకెళ్ళగానే పుష్ప 2 షూటింగ్‌కి బ్రేకులన్నారు. కథమార్చటమో, తను రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయటమో తప్ప ఇంకో ఆప్షన్ లేదు అన్నట్టు ప్రచారం జరిగింది. లక్కీగా జగధీష్‌కి బేయిల్ దొరకటం, షూటింగ్‌లో జాయిన్ కావటంతో పుష్ప 2కి వచ్చిన ఇబ్బంది ఏం లేదన్నారు. కానీ, ఇక్కడే చిక్కొచ్చింది. జగధీష్ మీద అమ్మాయి సూసైడ్ కేసు ఉండగా, తనని పుష్ప 2 రిలీజ్ టైంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానాలున్నాయి.

అంబాజిపేట మ్యారేజీ బ్యాండ్‌లో జగదీష్ ఉండగానే సినిమాకు మంచి టాక్ వస్తోంది. కాబట్టి తన వల్ల పుష్పకి ఇబ్బందిలేదు అనే వాదన పెరిగింది. కాని అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీలో జగదీష్ పాత్ర పుష్పలో కేశవలో పాత్రతో పోలిక లేదు. దానికున్న అంచనాలు వేరు. కాబట్టి జగధీష్ రియల్ లైఫ్‌లో జైలుకెళ్లటం పుష్పరాజ్‌కి ఇబ్బందులు తెచ్చే అంశమే.

Published : 
  • 2 February 2024, 6:17 PM IST