Kollywood: తమిళ విజయ్ తెలుగు కష్టాలు.. సీన్ లోకి కమల్ హాసన్..

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఎంత గొప్పి సినిమాలు చేసినా ఎందుకనో తెలుగు జనాలకు తన ఓ పట్టాన నచ్చడు. కొన్ని ఫేసులు అంతే.. ఏం చేయలేం అనే బ్యాచ్ కూడా ఉంది. తుపాకి, మాస్టర్ ఇక్కడ హిట్టైనా ఏదో కంటెంట్ బాగుంటే, కథలో కొట్టుకెళ్లటమే కాని, విజయ్ డాన్స్ అయినా, యాక్టింగ్ అయినా ఎందుకో ఇక్కడి జనాలకు అంతగా ఎక్కదనే అభిప్రాయం ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 13 April 2023, 6:45 PM IST

కారణం ఏదైనా ఈ హీరోకి తెలుగు మార్కెట్ లో సూర్య, కార్తి లాగా చొచ్చు కెళ్లే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏదో కథలో అద్భుతం జరిగితే తప్ప తన పాచిక ఇక్కడ అంత ఈజీగా పారదు.. అందుకే ఖైదీ, విక్రమ్ ఫేం లోకేష్ కనకరాజ్ కొత్త ప్లాన్ వేశాడు.

విజయ్ దళపతితో తను తీస్తున్న లియో లో కమల్ హాసన్ ని రంగంలోకి దింపుతున్నాడట. ఎలాగూ విక్రమ్ తో ఖైదీ అంటూ కార్తి తాలూకు ఎంట్రీని పరోక్షం గా చూపించాడు. అలానే లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో భాగంగా, లియో మూవీ మీద తెలుగుమార్కెట్లో ఆసక్తి పెంచేందుకు , సీన్ లోకి లోకనాయకుడు కమల్ ని రంగంలోకి దింపనున్నాడు. లియో ఇంటర్వెల్ సీన్ లో విక్రమ్ ఎంట్రీతో లెక్క మార్చబోతున్నాడు. ఇది సగం వరకు సినిమా టీమే తేల్చింది. కమల్ ఎంట్రీని ఫిల్మ్ టీం తేల్చినా, ఇంటర్వెల్ సీన్ లో తను ఎంట్రీ ఇస్తాడనేది లీకుల వల్ల బయటికి పొక్కింది.

Published : 
  • 13 April 2023, 6:45 PM IST