బ్యాంక్‌ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి లోకేష్‌ కనగరాజు.. జర్నీపై ఓ సినిమానే తీయొచ్చు..!

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక యూనివర్స్‌ను క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్. సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న దర్శకులలో ఆయన ఒకరు.

Post Published By: dialnews
Updated : 17 August 2026, 10:10 PM IST

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక యూనివర్స్‌ను క్రియేట్‌ చేసుకున్న డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్. సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న దర్శకులలో ఆయన ఒకరు. కానీ ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి, ఆసక్తికరమైన ప్రయాణం ఉన్నాయి. MBA పూర్తి చేసిన లోకేష్ కనగరాజ్, సాధారణ యువకుడిలాగే తన కేరీర్‌ను ప్రారంభించారు. ఒక బ్యాంక్‌లో దాదాపు నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేశారు. లెక్కలు చూసుకోవడం, బ్యాలెన్స్ షీట్‌లు బ్యాలెన్స్ చేయడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది. కానీ, ఆయన మనసంతా ఎప్పుడూ వెండితెర పైనే ఉండేది. సినిమాపై ఉన్న అపరిమితమైన ప్రేమతో, బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో చిత్ర పరిశ్రమలోకి రావాలనే ఒక పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.

బ్యాంక్‌లో పనిచేస్తున్న సమయంలోనే లోకేష్ ఒక కార్పొరేట్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. ఆయన తీసిన ఆ షార్ట్ ఫిల్మ్, ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దృష్టిని ఆకర్షించింది. ఇది లోకేష్ చలనచిత్ర ప్రయాణానికి తొలి ద్వారాలను తెరిచింది. ఆ గుర్తింపుతో ఆయనకు సినిమాలపై నమ్మకం పెరిగింది. దర్శకుడిగా లోకేష్ ప్రయాణం 'మానగరం' చిత్రంతో ప్రారంభమైంది. మొదటి సినిమాతోనే క్రిటిక్స్ మరియు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కార్తితో తీసిన 'ఖైదీ' చిత్రంతో తన మార్క్ ఏంటో ప్రపంచానికి చూపించారు. హాలీవుడ్‌లో సూపర్‌హీరో యూనివర్స్‌లు ఏలుతున్న సమయంలో, తమిళ సినిమాలో కథలను, పాత్రలను ఒకదానికొకటి అనుసంధానిస్తూ లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ LCUని సృష్టించారు.

ప్రేక్షకులు ఆ ఉత్కంఠభరితమైన కథనాలను, పాత్రల కనెక్షన్లను డీకోడ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు. ఆయన కథ చెప్పే విధానం, స్క్రీన్‌ప్లే నేర్పరితనం భారతీయ సినిమా దిగ్గజాలను సైతం ఆకర్షించాయి. విజయ్‌తో 'మాస్టర్', 'లియో' కమల్ హాసన్‌తో 'విక్రమ్' రజనీకాంత్‌తో 'కూలీ' ఇలా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరూ లోకేష్ విజన్‌ను నమ్మి ఆయన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అలాంటి లోకేష్‌ ఇప్పుడు యాక్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా, లోకేష్ తన ప్రయాణాన్ని నిరంతరం సరికొత్తగా మలచుకుంటున్నారు. దర్శకుడిగా, యూనివర్స్ క్రియేటర్‌గా విజయం సాధించిన ఆయన, ఇప్పుడు 'DC' అనే సినిమాతో నటుడిగా కొత్త అవతారమెత్తారు. బ్యాంక్ ఉద్యోగి నుండి టాప్ డైరెక్టర్‌గా, ఇప్పుడు నటుడిగా లోకేష్ కనగరాజ్ ప్రయాణం, డ్రీమ్స్‌ను ఫాలో అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప స్పూర్తి.

Published : 
  • 17 August 2026, 10:10 PM IST