ఏడేళ్లు మంచంపైనే ముమైత్ ఖాన్.. టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ షాకింగ్ గతం.. అసలు ఏమైంది..?

ముమైత్ ఖాన్.. నీ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. zen z కిడ్స్ కు ఈమె గురించి తెలియదు కానీ 90స్ కిడ్స్ మాత్రం ముమైత్ ఖాన్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు

Post Published By: dialnews
Updated : 8 February 2026, 8:21 PM IST

ముమైత్ ఖాన్.. నీ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. zen z కిడ్స్ కు ఈమె గురించి తెలియదు కానీ 90స్ కిడ్స్ మాత్రం ముమైత్ ఖాన్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఒక టైంలో ఆమె చేసిన ఐటెం సాంగ్స్ తెలుగు ఇండస్ట్రీని ఊపేసాయి. ముఖ్యంగా పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్‌ను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. తనదైన స్టైల్, మాస్ స్టెప్పులతో ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేశారామె. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే ముమైత్ ఉండాల్సిందే అనేంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ముమైత్, ఆ తర్వాత కాలంలో సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమె ఎందుకు సడన్‌గా మాయమయ్యారనేది చాలా మందికి తెలియని విషయం. ఇన్నాళ్లకు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముమైత్ ఖాన్ ఆ విషయాలపై నోరు విప్పారు.

తన జీవితంలో జరిగిన ఊహించని పరిణామాలను, వ్యక్తిగత విషాదాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒకానొక సమయంలో తాను చావు అంచుల వరకు వెళ్లొచ్చానని ముమైత్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఒక ప్రమాదం తన జీవితాన్నే తలకిందులు చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, తన మెదడులోని నరాలకు బలమైన దెబ్బ తగిలిందని, ఫలితంగా తన కెరీర్, ఆరోగ్యం అన్నీ దెబ్బతిన్నాయని ఎమోషనల్ అయ్యారు.
ఆ గాయం కారణంగా దాదాపు ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ముమైత్ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.

తనకు ప్రాణ సమానమైన డ్యాన్స్‌కు ఇన్నేళ్లు దూరం కావాల్సి రావడం ఎంతో బాధను మిగిల్చిందన్నారు. అంతేకాకుండా, చికిత్సలో భాగంగా వాడిన మందుల ప్రభావంతో తాను విపరీతంగా బరువు పెరిగానని, ఫిజికల్‌గా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు.ఆ కష్టకాలంలో తన తల్లి తనకు కొండంత అండగా నిలిచారని ముమైత్ గుర్తు చేసుకున్నారు. ఏడేళ్ల పాటు అమ్మ తనను కంటికి రెప్పలా కాపాడుకుందని, ఆ సమయంలో ఆమె సేవలే తనను బతికించాయని చెప్పారు. మొత్తానికి ఆ గడ్డు కాలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముమైత్ మాటలు చూస్తే, గ్లామర్ ప్రపంచం వెనుక ఎంతటి విషాదం దాగి ఉందో అర్థమవుతుంది.

Published : 
  • 8 February 2026, 8:21 PM IST