టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన మాస్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రాబోతున్న ప్రతి సినిమాపై భారీ అంచనాలుంటాయి. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య బాబు మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమాపై ఇప్పుడు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.సాధారణ సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభం కానున్న నెక్స్ట్ షెడ్యూల్‌లో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌తో పాటు ప్రత్యేకమైన పాటను కూడా తెరకెక్కించనున్నారు.
షూటింగ్ సమయంలో జరిగిన చిన్న గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న బాలయ్య బాబు, త్వరలోనే తిరిగి ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల తార కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ నటుడు మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ మరియు గ్లింప్స్‌లో బాలయ్యను ఒక సరికొత్త రాజసంతో, పవర్‌ఫుల్ కింగ్ లా చూపించడం విశేషం. వృద్ధి సినిమాస్' పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో దిట్ట అయిన గోపీచంద్ మలినేని, బాలయ్య బాబులోని అసలుససలు మాస్ యాంగిల్‌ను మరోసారి వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. డిసెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.