రాత మారిపోయే.. మోత మోగిపోద్ది…!

తండేల్' సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్న యువసామ్రాట్ నాగచైతన్య, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'వృషకర్మ'తో మన ముందుకు రాబోతున్నాడు

Post Published By: dialnews
Updated : 5 March 2026, 1:50 PM IST

తండేల్' సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్న యువసామ్రాట్ నాగచైతన్య, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'వృషకర్మ'తో మన ముందుకు రాబోతున్నాడు. 'విరూపాక్ష'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, 'వృషకర్మ' ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో చైతన్య ఒక చీకటి గుహలో, చేతిలో తవ్వే పరికరంతో చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. "చెడు శక్తులు మేల్కొన్నప్పుడు, ఒక యోధుడు ఎంపిక చేయబడతాడు" అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ దిగ్గజ నటుడు జయరాంని ఎంపిక చేశారు. ఆయన ఈ సినిమాలో 'ప్రొఫెసర్ రంగనాథ్' అనే పాత్రలో కనిపిస్తారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఒక మైథలాజికల్ అడ్వెంచర్ సినిమాలో ప్రొఫెసర్ పాత్ర ఉందంటే, అది పురాతన రహస్యాలను ఛేదించే పాత్ర అని మనకు అర్థమవుతోంది. జయరాం లుక్ కూడా చాలా డిగ్నిఫైడ్ గా, ఏదో అన్వేషిస్తున్నట్లుగా ఉంది. ఈ సినిమాలో చైతన్య సరసన క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి 'దక్ష' అనే పాత్రలో నటిస్తోంది. లాపాతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాత్సవ ఈ సినిమాలో విలన్‌గా ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ సినిమాకు కథ అందించడం విశేషం.

కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగాSVCC బ్యానర్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇది ఒక మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. పురాతన సంపద లేదా రహస్యాల వేటలో భాగంగా సాగే అడ్వెంచర్ అని తెలుస్తోంది. చైతన్య ఈ సినిమా కోసం తన బాడీని చాలా రఫ్ అండ్ రగ్గడ్ గా మార్చుకున్నాడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. నాగచైతన్య - కార్తీక్ దండు కాంబినేషన్ అంటే కచ్చితంగా ఏదో మ్యాజిక్ ఉండబోతోందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Published : 
  • 5 March 2026, 1:50 PM IST