Nayanthara: గోల్డెన్ ఛాన్స్.. బాలీవుడ్‌ చూపు నయనతార వైపు..

డెబ్యూ మూవీ హిట్‌ తర్వాత నయనకు క్రేజీ ఆఫర్‌ దక్కిందట. సంజయ్‌ లీలా బన్సాలీ కొత్త సినిమాలో నయనతార పేరు వినిపిస్తోంది. అలియాభట్‌, రణ్‌వీర్‌సింగ్‌ జంటగా నటించే సినిమాలో కీ రోల్‌ కోసం నయనతారను తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు సంజయ్‌.

Post Published By: narender Thiru
Updated : 11 October 2023, 5:10 PM IST

Nayanthara: జవాన్‌ హిట్‌తో బాలీవుడ్‌ చూపు నయనతారపై పడింది. బిగ్‌ ఫిల్మీస్‌ నయనతారను తీసుకోవాలన్న ప్లాన్‌లో వున్నారు. జవాన్‌ తర్వాత ఇంతవరకు మరో హిందీ మూవీకి సైన్‌ చేయని నయన్‌ను ఓ బంపర్‌ ఆఫర్‌ వెంటాడుతోంది. జవాన్‌లో గ్లామర్‌ గుప్పించకపోయినా.. నయన క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రూ.11వందల కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసి.. టాప్‌ హిందీ మూవీగా నిలిచింది. డెబ్యూ మూవీ హిట్‌ తర్వాత నయనకు క్రేజీ ఆఫర్‌ దక్కిందట.

సంజయ్‌ లీలా బన్సాలీ కొత్త సినిమాలో నయనతార పేరు వినిపిస్తోంది. అలియాభట్‌, రణ్‌వీర్‌సింగ్‌ జంటగా నటించే సినిమాలో కీ రోల్‌ కోసం నయనతారను తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు సంజయ్‌. నయన ప్రస్తుతం యాక్టర్‌గా కంటే బిజినెస్‌ ఉమెన్‌గా బిజీగా వుంది. స్కిన్‌ ప్రొడక్షన్‌ ప్రమోషన్‌ కోసం ఆ మధ్య విదేశాలు కూడా వెళ్లొచ్చింది. ఓన్‌ ప్రొడక్షన్‌ కోసం.. గ్లామర్‌ షూట్‌లో పాల్గొన్న నయన ఇన్‌స్టాను స్కిన్‌కేర్‌తో నింపేసింది. ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత మళ్లీ యాక్టింగ్‌ స్టార్ట్ చేసిన నయన్‌.. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.

సౌత్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్‌ తీసుకుంటూ.. ఇప్పటికీ నంబర్‌ వన్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ క్రేజీ ఇమేజ్‌ దక్కడంతో.. అక్కడ రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తోందన్న టాక్‌ నడుస్తోంది. పెళ్లి.. పిల్లలు తర్వాత నయనతార మరింత ఇమేజ్‌తో దూసుకుపోతోంది.

 

Published : 
  • 11 October 2023, 5:10 PM IST